NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను ఈడీ వ్యతిరేకించింది. ఆయన ఎన్నికల ప్రచారం చేసే హక్కు .. ప్రాధమికమైనది కాదని స్పష్టం చేసింది. అలానే రాజ్యాంగం కల్పించిన హక్కు కాదని, న్యాయపరమైన హక్కు కూడా కాదని ఈడీ పేర్కొంది. ఈ మేరకు గురువారం సుప్రీం కోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది.

Arvind Kejriwal

ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏ రాజకీయ పార్టీ నాయకుడికి మద్యంతర బెయిల్ మంజూరు చేసిన దాఖలాలు లేవని ఈడీ తన అఫిడవిట్ లో పేర్కొంది. అదీ కాక ఆయన ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధి కూడా కాదని వివరించింది. గతంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమన్లు తప్పించుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ .. ఈ తరహా పద్ధతిని అనుసరించారని తన అఫిడవిట్ లో ఈడీ గుర్తు చేసింది.

ఒక వేళ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్ కు ప్రత్యేక రాయితీ తో మద్యంతర బెయిల్ మంజూరు చేస్తే అది చట్టం పరిధి దాటినట్లు అవుతుందని పేర్కొంది. అనైతిక రాజకీయ నాయకులు ఎన్నికల ముసుగులో దర్యాప్తు నుండి తప్పించుకొనేందుకు మద్యంతర బెయిల్ పేరిట ప్రయత్నిస్తారని ఈడీ ఆరోపించింది.

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం కోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలో ఈడీ, కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును శుక్రవారానికి రిజర్వు చేసింది.  ఒక వేళ అరవింద్ కేజ్రీవాల్ కు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తే అధికారిక విధుల్లో పాల్గొనడం గానీ.. ఫైళ్లపై సంతకాలు కానీ చేయకూడదంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Related posts

Lok Sabha Election 2024: ఈవీఎంలను నీటి గుంటలో పడేసిన గ్రామస్థులు .. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

sharma somaraju

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Road Accident: లారీని ఢీకొన్న స్కార్పియో .. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

sharma somaraju

Lok Sabha Election 2024: సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ .. బరిలో ప్రధాని మోడీ సహా ప్రముఖులు

sharma somaraju

CM YS Jagan: ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన .. గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల అంశంపై తీర్పు రేపటి వాయిదా

sharma somaraju

Vistara Bomb Threat: శ్రీనగర్ వెళ్తున్న విస్తారా విమానానికి బూటకపు బాంబు బెదిరింపు .. ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై ప్రభావం

sharma somaraju

Sheep Scam: గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరెస్ట్

sharma somaraju

AB Venkateswararao: పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. చివరి రోజు సంచలన వ్యాఖ్యలు

sharma somaraju

ఎయిరిండియాకు నోటీసులు జారీ చేసిన డీజీసీఏ

sharma somaraju

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N