NewsOrbit
దైవం

అవతారం అంటే ఏమిటి?

 

అవతారం అనే మాటను ప్రతీరోజు ఏదో  ఒక సందర్భంలో వాడుతుంటారు. అసలు అవతారం అంటే ఏమిటి తెలుసుకుందాం.. తార అంటే నక్షత్రం. అవ అంటే దిగిరావడం. జీవరాశుల అభ్యున్నతి కోసం నిర్హేతుక కృపతో భగవంతుడు స్వీకరించేదే అవతారం. ఆ విశేషాలు తెలుసుకుందాం..

 

 

 

విష్ణువు రాముని గా భూమిపై అవతరించాడని అంటారు. మరి రామునిగా భూమిపై ఉన్న ఆ కాలం లో వైకుంఠమ్ లో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా? అవతారం అనగా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం.

ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచి వాళ్లని రక్షించటానికి భగవంతుడు పశు పక్షి మనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని అనేక మతాలవారి నమ్మకం. విష్ణువు మత్స్యకూర్మాది అవతారాలు ఎత్తెనని హిందువులు, పరమ విజ్ఞానము బుద్ధుడుగానూ, బోధిసత్వులుగానూ అవతారమెత్తిందని బౌద్ధులు, ఈశ్వరుని రెండవ అంశ అయిన పుత్రుడు యేసు రూపములో అవతరించెనని క్రైస్తవులు భావిస్తారు. ఈ కల్పనలన్నింటికీ దేవుడు మానవులకు ఉపకారము చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవసరం అన్న కల్పన ఆధారం. ప్రజలు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుండు వారి ఆపదలను తొలగించుటకు భౌతికరూపం ధరించుననే నమ్మకం అవతారకల్పనకు మూలాధారం. ప్రజలకు దుష్టులచే ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోవటం. ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం, సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్టశిక్షణ చేయటం చాలామటుకు అవతారకథల ప్రధాన ఇతివృత్తం.

అవతారాలు కేవలం త్రిమూర్తులకు, ఆదిదేవతలకే పరిమితం కాలేదు. దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసలు, చివరకు మానవులు కూడా అవతారమెత్తవచ్చు.

విష్ణువు ఎన్ని అవతారాలు ఒకేసారి ఎత్తినా; విడి విడి గా ఎత్తినా తన అస్తిత్వం కోల్పోడు; తన అసలు రూపం తో వైకుంఠమ్ లో దర్శన మిస్తూనే ఉంటాడు… విష్ణువు నుండి ఉద్బవించిన ఈ అవతారములు తమ అవతార పరిసమాప్తి చెందిన తరువాత తమ మూల అవతారమైన శ్రీమన్నారాయణుడి లో (విష్ణువు ) లో ఐక్య మందుతాయి… ఒకసారి ఐక్య మందినా కూడా భక్తుల కోరిక మేరకు మరల, మరల అవే రూపాలతో అవసరమైనప్పుడు దర్శనమిస్తూనే ఉంటాయి. అలాగే శివ పార్వతులు, మిగిలిన దేవతలు సందర్భాన్ని బట్టి భూలోకం పై అవతరిస్తూ ఉంటారు. ఇక దత్తాత్రేయుల వారు నేటికి అనేక అవతరాలలో ఆయా ప్రాంతాలలో నేటికి దర్శనమిస్తారని ప్రతీతి. హనుమ, కుమారస్వామి ఇలా పలు దేవతాస్వరూపులు ఆయా రూపాలలో భూమిమీద జన్మించి మనలను ఉద్దరిస్తారు.

Related posts

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju