సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది తమన్నా. చాలామంది తెలుగు తమిళ టాప్ హీరోల సరసన నటించడం జరిగింది. అయితే ప్రస్తుతం మూడు పదుల వయసు రావడంతోపాటు అవకాశాలు కూడా తగ్గటంతో తమన్నా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. చివరిగా తమన్నా నటించిన చెప్పుకోతగ్గ సినిమా సైరా నరసింహారెడ్డి. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోల పక్కన నటిస్తూ ఏదో రీతిలో కెరియర్ రాణిస్తూ వచ్చింది.
దీంతో మిల్కీ బ్యూటీ మూలన పడిపోయింది, అందుకే సీనియర్ హీరోలు వాడేస్తున్నారు అని వార్తలు వైరల్ ప్రేక్షకులనుండి రావటం మొదలయ్యాయి. ఇటువంటి తరుణంలో….. తమన్నా లేటెస్ట్ షాకింగ్ నిర్ణయం తీసుకోవటం జరిగిందట. దీంతో తమిళ , తెలుగు టాప్ హీరోలంతా తమన్నా తీసుకున్న నిర్ణయానికి ఒక్క సారిగా ఉలిక్కి పడి నట్లు సౌత్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
పూర్తి మేటర్ లోకి వెళితే సీనియర్ హీరోల పక్కన నటిస్తే రాబోయే రోజుల్లో…. కెరియర్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని భావించి, సినిమా ఇండస్ట్రీ లో అతి చిన్న హీరో అయినా పర్వాలేదు అని డిసైడ్ అయ్యి తాజాగా ఇండస్ట్రీలో ఓ చిన్న హీరో పక్కన హీరోయిన్ గా తమన్నా నటించడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా కుర్ర హీరోల పక్కన నటిస్తే అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉందని తమన్నా డిసైడ్ అయ్యి కుర్ర హీరో అయినా సత్యదేవ్ పక్కన హీరోయిన్ గా నటించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ ఛాన్స్ లో వస్తున్న గాని తమన్నా వదిలేసి పోవటంతో తెలుగు, తమిళ్ టాప్ హీరోలు…..తమ పక్కన హీరోయిన్లుగా ఎవరు నటిస్తారు అనే ఆందోళనలో పడినట్లు ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది.