NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కెసిఆర్ కి చెమటలు పట్టించేందుకు మళ్లీ సిద్ధమైన కోదండరాం..!!

 

తెలంగాణలో మరో ఎన్నికకు సిద్ధం అవుతోంది. 2018 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి (టి జె ఎస్) ఎన్నికకు సిద్ధం అవుతోంది. సిఎం కె సి ఆర్ కు చెమటలు పట్టించేలా, టీ ఆర్ ఎస్ నేత టి ఆర్ కు చుక్కలు చూపించేలా తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్ ఎస్) హవా తగ్గించేలా ఈ సారి కోదండరాం బృందం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది,

Kodandaram

 

పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా 2018 ఎన్నికల్లో టి జె ఎస్ పోటీ చేసిన దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకశం ఉంది. ఈ నేపథ్యంలో వీటిపై చర్చించేందుకు సోమవారం నాంపల్లిలోని టి జె ఎస్ కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎలా వ్యవహారించాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. టి జె ఏస్ చైర్మన్ గా ప్రజా సంఘాలను, అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాంకు పట్టభద్రులల్లో మంచి ఆదరణ ఉంది. కోదండరాం పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో ఉంటే గెలుపు సునాయాసమే అని టి జె ఎస్ భావిస్తున్నది,

టి ఆర్ ఎస్ మినహా మిగతా అన్ని పార్టీల మద్దతు కూడగట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టి జె ఎస్ నిర్ణయించినట్లు సమాచారం. వరంగల్లు, ఖమ్మం, నల్లగొండ స్థానం నుండి కోదండరాం పోటీ చేయాలని టి జె ఎస్ నేతలు కోరారు. ఏ నిర్ణయమైనా పార్టీ సమిష్టిగా తీసుకోవాలని కోదండరాం పేర్కొన్నారు. త్వరలో మరో సారి సమావేశమై రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో భాగంగా ఇతర పార్టీలు, ప్రజా సంఘాల నేతల అభిప్రాయాలు. వారి మద్దతుపై చర్చించాలని సమావేశం నిర్ణయించింది, ఇది ఇలా ఉండగా అధికార టీ ఆర్ ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఏ విధంగా ఫేస్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న కేసీఆర్ నేతృత్వం లోని టీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం బరిలో ఉంటే టీ ఆర్ ఎస్, టీ జె ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండవచ్చని అనుకుంటున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju