NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

ఏపీ బీజేపీ పార్టీలో క‌ల్లోలం క‌నిపిస్తోంది. పార్టీని ముందుండి నడిపించాల్సిన ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు ఎక్క‌డా అందుబాటులో లేకుండా పోయార‌నే వాద‌న వినిపిస్తోంది. సాధార‌ణంగా ఏ పార్టీ చీఫ్ అయినా.. తాను పోటీ చేస్తూ.. త‌న వారిని గెలిపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌లు ఇప్పుడు అదే ప‌నిపై బిజీగా ఉన్నారు.

కానీ, చిత్రం ఏంటంటే.. బీజేపీ చీఫ్‌గా పురందేశ్వ‌రి మాత్రం.. ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. అంతేకాదు .. ఫోన్ నెంబ‌రును కూడా మార్చేసుకున్న‌ట్టు నాయ‌కులు గ‌గ్గోలు పెడుతున్నారు. కూట‌మి పొత్తులో భాగం గా బీజేపీ 10 అసెంబ్లీ, 6 పార్ల‌మెంటు స్థానాల‌ను తీసుకుంది. వీటిలో దాదాపు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఒక్క అన‌ప‌ర్తిలో మాత్రం కూట‌మికి చిక్కులు వ‌చ్చాయి. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాలు ఓకే. మ‌రి ఇలాంటి కీల‌క స‌మ‌యంలో పార్టీ రాష్ట్ర చీఫ్‌గా వారి త‌ర‌ఫున కూడా.. ప్ర‌చారం చేయాలి.

కానీ, పురందేశ్వ‌రి ఈ బాధ్య‌త‌ల‌ను వ‌దిలేశార‌నేది.. కీల‌క నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌. క‌నీసం త‌మ‌కు అం దుబాటులో కూడా లేకుండా పోయార‌ని.. ఫోన్ నెంబ‌రు కూడా మార్చుకున్నార‌ని..ఆఫీస్ కు ఫోన్ చేస్తే.. మేడం అందుబాటులో లేరని చెబుతున్నార‌ని.. ప‌లువురు నాయ‌కులు గ‌గ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే.. ఎన్టీఆర్ కుమార్తెగా ఆమె వ‌చ్చి క‌నీసం ఒక్క రోజైనా ప్ర‌చారం చేస్తే..  తమ గెలుపు ఖాయ‌మ‌ని వారు అంచ‌నా వేసుకుంటున్నారు.

అయితే.. పురందేశ్వ‌రి త‌న గెలుపు కోస‌మే శ్ర‌మించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాజ‌మండ్రి నుంచి బ‌రిలో ఉన్న పురందేశ్వ‌రి.. త‌న గెలుపు కోసం.. వ్యూహ ప్ర‌తివ్యూహాలు వేసుకుని ముందుకు సాగుతున్నారు. దీనిలోనే ఆమె తీరిక లేకుండా ప‌నిచేస్తున్నారు. రాజ‌మండ్రి నుంచి గెలుపు బీజేపీకి అంత ఈజీకాదని ఆమె అభిప్రాయం. దీంతో క్షేత్ర‌స్థాయిలో ఆమె ప‌ర్య‌టిస్తున్నారు. ఫ‌లితంగా ఇత‌ర నేత‌ల‌కు క‌నీసం ఫోన్‌లలో కూడా అందుబాటులోకి రావ‌డం లేదు. దీంతో ఆమె ఒక‌వైపే చూస్తున్నారంటూ.. నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N