NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

చంద్రబాబు-మోహన్ బాబు మధ్య ఉన్న హిస్టరీ తెలిస్తే అవాక్కవుతారు..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రముఖ సినీ యాక్టర్ విద్యావేత్త రాజకీయ నాయకుడు మోహన్ బాబు కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విషయం తెలిసిందే. బాబు పేరు వింటేనేమోహన్ బాబు ఎగిరెగిరి పడతారు. మరి వారి ఇద్దరి మధ్య వైరం ఎలా వచ్చింది? ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వారు ఇప్పుడు ఎందుకు చిటపటలాడుతూ ఉన్నారు?

 

mohan babu fires on chandrababu - MaaMaata.com

అదే మొదలు….

మోహన్ బాబు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పరమ భక్తుడు. బాబు ఆయన మామ గారి నుండి పార్టీ పగ్గాలను చేజిక్కించుకున్న తర్వాత మోహన్ బాబు.. చంద్ర బాబు నాయుడు తోనే కలిసి ఉన్నారు. ఇక్కడ రూమర్ ఏమిటంటే.. ప్రస్తుతం బాబు నడిపిస్తున్నహెరిటేజ్కంపెనీ లో అంతకుముందు మోహన్ బాబు కి షేర్లు ఉండేవట. అయితే వ్యాపారం విషయంలో వీరిద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో…. చంద్రబాబు తన రాజకీయ బలం ఉపయోగించి మోహన్ బాబుకి చెందిన షేర్స్ అమ్మేశారని చెబుతున్నారు. ఇక తనకు జరిగిన అన్యాయానికి ప్రతిగా మోహన్ బాబు నాయుడు పై పగ పెంచుకున్నారట.

పగ సాధించారు

ఇకపోతే 2019 ఎన్నికల ముందు మోహన్ బాబు…. చంద్రబాబు నాయుడు ని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. తన విద్యానికేతన్ విద్యా సంస్థలకు చంద్రబాబు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కావాలని చెల్లించకుండా ఆపివేశారని రోడ్డెక్కారు. అంతేకాకుండా జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపి వారికి అనఫీషియల్ ప్రచారకర్తగా కూడా వ్యవహరించారు. చివరికి చంద్రబాబు ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంటే తప్పించి మోహన్ బాబు శాంతించలేదు.

ఇంకేం ఆపుతోంది?

ప్రస్తుతం వినాయక చవితి సందర్భంగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాబు మోసగాడని మోహన్ బాబు చెప్పడం గమనార్హం. అయితే నేరుగా చంద్రబాబు పేరు ని వాడకుండా తను గతంలో ఒక వ్యక్తిని నమ్మితే అతను మోసం చేశాడని.. తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యాడని.. తాను అతని వల్ల ఆర్థికంగా నష్టపోయానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో అసలు మోహన్ బాబు…. చంద్రబాబు పేరును నేరుగా చెప్పడానికి అతనిని ఏమి ఆపుతోందో అర్థం కావడం లేదని అందరూ తల గోక్కుంటున్నారు. మరి మీకు ఏమైనా అర్థం అయిందా…?

Related posts

CM Revanth Reddy: కీరవాణి స్టూడియోకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి .. ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో స్వల్ప మార్పులు

sharma somaraju

Poll Violence In Tadipatri: అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీపై వేటు

sharma somaraju

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

sharma somaraju

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

sharma somaraju

Lok Sabha Elections 2024: ముగిసిన ఆరో విడత పోలింగ్ .. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదు

sharma somaraju

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు .. బహిరంగ క్షమాపణలు చెప్పాలని జవహర్ రెడ్డి డిమాండ్

sharma somaraju

VV Lakshmi Narayana: ఏపీ రాజధాని అంశంపై జేడీ లక్ష్మీనారాయణ కేంద్రానికి కీలక వినతి

sharma somaraju

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?