NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

తెలంగాణలో కొత్త రాజకీయం మొదలెడుతున్న రాములమ్మ..?

 

ఒక నాటి తెలుగు సినీ పరిశ్రమ మేటి నటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి పార్టీ మారనున్నారా? సొంత గూడు (బిజెపి) చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. రెండు రోజుల క్రితం హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు జెఇఇ, నీట్ పరీక్షలపై జరిగిన ధర్నా కార్యక్రమంలో కూడా విజయశాంతి పాల్గొనలేదు. దీంతో ఆమెపై వస్తున్న ఊహగానాలకు బలం చేకూరుతోంది. చాలా కాలం నుండి విజయశాంతి తిరిగి బిజెపికి వెళ్లనున్నారని పుకార్లు షికారు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుుతున్నారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లోనూ విజయశాంతి చురుగ్గా పాల్గొనడం లేదు.

 

తెలుగు సినీరంగంలో ఒక వెలుగు వెలిగి లేడీ అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఫైర్ బ్రాండ్ విజయశాంతి ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా ఉన్నారు. సినిమా రంగంలో అవకాశాలు తగ్గిన తరువాత తొలుత బిజెపి ద్వారా రాజకీయ రంగంలోకి ప్రవేశించిన విజయశాంతి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉదృతంగా జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ లోకి అడుగు పెట్టారు. టిఆర్ఎస్ తరపున ఎంపిగా గెలిచి పార్లమెంట్ లోనూ తన వాణి వినిపించారు. ఆ తరువాత పార్టీలో విజయశాంతికి ప్రాధాన్యత తగ్గడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ విజయశాంతికి మంచి ప్రాధాన్యత ఇచ్చింది. 2018, 2019 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఆ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. నాటి నుండి కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వచ్చారు. గత నెల చివరి వారం వరకూ టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఫేస్ బుక్ పోస్టులు పెట్టారు. ఇటీవల శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై మాట్లాడటం గానీ స్టేట్ మెంట్ ఇవ్వడం కానీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరం ఉంటూ వచ్చారు.

ఈ తరుణంలోనే విజయశాంతి తెలుగు సినీ పరిశ్రమకు రీఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు హీరోగా రూపొందించిన సరిలేరు నీకెెవ్వరు చిత్రంలో విజయశాంతి కీలక భూమికను పోషించారు. అయితే ఈ సినిమా ఆశించిన మేర ప్రేక్షకాదరణ పొందలేదు. విజయశాంతి పాత్రకూ అంతగా ఆదరణ లభించలేదు. దీంతో అటు టాలివుడ్ లో అవకాశాలు లభించలేదు. ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో విజయశాంతి తిరిగి బిజెపి గూటికి చేరాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చె నెల రెండవ వారంలో విజయశాంతి బిజెపి చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ అియినట్లు తెలుస్తోంది. అయితే విజయశాంతి మాత్రం ఇంత వరకూ అధికారికంగా తన పార్టీ మార్పు ఊహగానాలపై పెదవి విప్పలేదు. అయితే ఓ రెండు వారాల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?