NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గన్ కొత్త‌ నిర్ణ‌యం…. టీడీపీకి చెక్ పెడుతుందా?

ఏపీ ముఖ్య‌మంత్రిగా వైఎస్ఆర్‌సీపీ అధినేత ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత తెలుగుదేశం పార్టీ వివిధ అంశాల్లో ఆయ‌న్ను టార్గెట్ చేసింది, ఇర‌కాటంలో ప‌డేసింది. ఇందులో కొన్ని విష‌యాల్లో విజ‌యం సాధించింది కూడా. అలాంటి వాటిలో ఇసుక పాల‌సీ ఒక‌టి.

ప్రతిప‌క్షాల‌న్నీ కూడా ఈ మేర‌కు జ‌గ‌న్ తీరును త‌ప్పుప‌ట్టాయి. అయితే, తాజాగా ఏపీ సీఎం తీసుకున్న నిర్ణ‌యం ఆ ఆరోప‌ణ‌ల‌కు చెక్ పెడుతుందా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా ఏపీ కేబినెట్లో కొత్త ఇసుక పాలసీకి ఆమోదం తెలిపడంతో ఈ మేర‌కు విశ్లేష‌ణ‌ల‌కు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

సంచ‌ల‌న నిర్ణ‌యం…

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధ్య‌క్షత‌న ఏపీ కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. ఈ సందర్భంగా ఇసుక పాల‌సీపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సులకు ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని ముందు నిర్ణయం తీసుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవీ అందుకు ముందుకు రాలేదు. దీంతో పేరుగాంచిన ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్‌కమిటీ సిఫార్సు చేసింది. ఓపెన్ టెండర్‌ ద్వారా ప్రక్రిట చేపట్టాలని కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులపై చర్చించి చివరకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. ఈ నిర్ణ‌యంవిజ‌య‌వంతం అయితే, సీఎం జ‌గ‌న్‌పై వ‌చ్చిన ప్ర‌ధాన విమ‌ర్శ‌కు చెక్ ప‌డిన‌ట్లేన‌ని అంటున్నారు.

ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణయాలు ఏంటంటే…

ఇసుక పాల‌సీతో పాటుగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్‌ఈబీ బలోపేతంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఎస్‌ఈబీ పరిధిని విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ సహా జూదాల కట్టడి బాధ్యతలను ఎస్‌ఈబీ పరిధిలోకి తేవాలని ఏపీ కేబినేట్ ప్రతిపాదించింది. డ్రగ్స్, గంజాయి నిరోధించే బాధ్యతలూ కూడా ఎస్‌ఈబీకి అప్పగించాలన్న ఆలోచనలో ఏపీ సర్కార్‌ ఉంది. అలాగే నవంబర్ 24న జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సున్నా వడ్డీ కింద 10 వేల రూపాయల రుణ సదుపాయం కల్పించనుంది. ఇక, ల్యాండ్ టైటిలింగ్ బిల్లు-2019లోని 75,76 క్లాజుల రద్దు సవరణకు నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినేట్. అగ్నిమాపక సంస్థ బలోపేతానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు నుంచి నాలుగు జోన్ల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా వివిధ పోస్ట్‌లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ఆదోనిలో మత ఘర్షణల కేసుల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పులివెందుల మండలం కె.వి.పల్లి గ్రామం…ఆముదాల వలసలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు 11 ఎకరాల భూమి ఏపీ సర్కార్ కేటాయించింది.

Related posts

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju