NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

నేతలకు కరోనా టీకా ఎప్పుడంటే.? క్లారిటీ ఇచ్చేసిన కేంద్రం…!!

కరోనా టీకా కోసం ప్రజలు అందరూ ఎదురుచూస్తున్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. దేశంలో తొలి దశ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ఈ నెల 16వ తేదీన ప్రధాన మంత్రి మోడి ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి దశలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ వేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలి దశ వ్యాక్సిన్ పంపిణీలోనే ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత కల్పించాలని పలు రాష్ట్రాలకు చెందిన నేతలు కేంద్రాన్ని కోరినా అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయంలో ప్రధాన మంత్రి మోడి ఒకింత కటువుగానే ప్రజాప్రతినిధులు వారి వంతు వచ్చే వరకూ ఆగాలని తేల్చిచెప్పేశారు.

Corona vaccination for leaders likely to second fase

తొలి విడత పంపిణీలో ప్రజా ప్రతినిధులు ఏవరూ వ్యాక్సిన్ కోసం బారులుతీరవద్దని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి ఆ మాట అనకుండా ఉండి ఉంటే ఈ పాటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల వంటి  ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ కోసం పోటీలు పడి మరీ వేయించుకునే వారు. నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడినే స్వయంగా చెప్పడంతో ప్రజా ప్రతినిధుల జులుం లేకుండా తొలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగిపోతున్నది. ఇక రెండవ దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఆయన పాటు ముఖ్యమంత్రులు కూడా టీకాను తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 50 ఏళ్లు పైబడిన ప్రజా ప్రజా ప్రతినిధులకు రెండవ దశలో వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రధాన మంత్రి మోడీ స్వయంగా సీఎంల భేటీలో ప్రస్తావించారు.

సుమారు మూడు కోట్ల మంది దాకా ఉన్న ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ ముగిసిన తరువాత రెండవ దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించనున్నారు. రెండవ దశ ప్రారంభించిన తొలి రోజే ప్రధాన మంత్రి మోడీ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా నిన్నటి వరకూ దేశ వ్యాప్తంగా 7.86 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బుధవారం ఒక్క రోజే 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లక్షా 12వేల ఏడు మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ లకు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వడంతో ఈ రెండు వ్యాక్సిన్ లను పంపిణీ చేస్తున్నారు. రెండవ విడత పంపిణీ సమయానికి మరో ఒకటి రెండు వ్యాక్సిన్ లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N