NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Panchayat Elections : “గొడవల పంచాయతీ” – ఎక్కడా తగ్గని వైసీపీ – టీడీపీ.

AP Panchayat Elections : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొంది.

"Conflict Panchayat" - Nowhere to be found YCP - TDP.
“Conflict Panchayat” – Nowhere to be found YCP – TDP.

తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం 2021, జనవరి 31వ తేదీ ఆదివారంతో ముగిసింది. కానీ..అక్కడక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోటీ చేస్తున్న వారిని, ఇతరులను కిడ్నాప్ లు చేయడం, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేయడం కలకలం రేపుతున్నాయి.

AP Panchayat Elections : జగ్గంపేటలో కిడ్నాప్ : –

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో కిడ్నాప్‌ కలకలం రేపింది. గొల్లలగుంట టీడీపీ సర్పంచ్ అభ్యర్థి భర్త శ్రీనివాస్‌రెడ్డి అపహరించారు దుండగులు. కాళ్లు, చేతులు కట్టేసి.. శ్రీనివాస్‌ను అటవీ ప్రాంతంలో వదిలేశారు. గోవిందపురం అడవుల్లో శ్రీనివాస్‌ను గుర్తించిన పశువుల కాపర్లు.. సమాచారం ఇవ్వడంతో.. శ్రీనివాస్‌ను టీడీపీ కార్యకర్తలు గ్రామానికి తీసుకెళ్లారు. అయితే కక్ష పూరితంగా వైసీపీ నాయకులే కిడ్నాప్ చేయించారని శ్రీనివాస్‌రెడ్డి భార్య ఆరోపిస్తోంది. నామినేషన్‌ వేయకుండా అడ్డుకునేందుకు కిడ్నాప్‌ చేశారని ఆరోపించిన ఆమె.. తిరిగి వచ్చిన తర్వాత భర్తతో కలిసి నామినేషన్ వేసింది.

AP Panchayat Elections : అచ్చెన్నాయుడు అడ్డా లో వైసిపి అభ్యర్థిని అడ్డుకున్న టీడీపీ!

మరోవైపు..శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమీప బంధువు అప్పన్న వైసిపి తరపున నామినేషన్ దాఖలు చేయడానికి సిద్దపడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థి కింజరపు అప్పన్నను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. అప్పన్నకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దువ్వాడ శ్రీనివాస్‌ కారును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. శ్రీనివాస్‌ను గ్రామంలోకి రావడానికి వీల్లేందంటూ అడ్డుపడ్డారు. టీడీపీ, వైసీపీ శ్రేణుల ఘర్షణతో.. నిమ్మాడలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

AP Panchayat Elections : అనంతపురం జిల్లాలో!

ఇదిలా ఉంటే…అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు టీడీపీ మద్దతుదారుడు ఈరన్న. బొమ్మక్కపల్లికి చెందిన సర్పంచ్‌ అభ్యర్థి తిమ్మక్క భర్త ఈరన్నను నిన్న దుండగులు కిడ్నాప్‌ చేశారు. అతడు దేవాలయానికి వెళ్తున్న సమయంలో బంధించారు. ముఖానికి మాస్క్‌ ధరించిన ముగ్గురు దుండగులు తనను కిడ్నాప్‌ చేశారని తెలిపాడు. మత్తు మందు ఇచ్చి రాయపురం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్ళి చితక బాదారని ఆవేదన వ్యక్తం చేశాడు. మత్తులో నుంచి మేల్కొన్నాక.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని కత్తులతో బెదిరించారని వాపోయాడు. అయితే కిడ్నాపర్లకు కట్టుకథలు చెప్పి వారి నుంచి తప్పించుకున్నానన్నాడు ఈరన్న.

AP Panchayat Elections : టిడిపి ఎమ్మెల్సీ కారుపై దాడి!

మరో ఘటనలో చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం రేగింది. కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో దొరబాబు కారుతో పాటు..10కి పైగా ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. యాదమర్రి ఎంపీడీవో కార్యాయలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju