Sridevi Drama Company : కామెడీ షోలకు పెట్టింది పేరు ఈటీవీ. ఎనిమిదేళ్ల కిందనే జబర్దస్త్ పేరుతో సరికొత్త కామెడీ షోను తీసుకొచ్చింది ఈటీవీ. అది ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. కామెడీ స్కిట్లతో కంటెస్టెంట్లు చేసే కామెడీని చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి Sridevi Drama Company అనే కొత్త షోను తీసుకొచ్చింది ఈటీవీ. శ్రీదేవి డ్రామా కంపెనీ Sridevi Drama Company అనే షోలో ఎంటర్ టైన్ మెంట్ కు కొదవ ఉండదు.
జబర్దస్త్ టీమ్ తో పాటు మరికొందరు సెలబ్రిటీలు అందరూ కలిసి చేసిన హంగామా మామూలుగా లేదు. జనవరి 31న ఈ షో ప్రారంభం కాగా.. మొదటి ఎపిసోడ్ సూపర్ సక్సెస్ అయింది. బుల్లితెర ప్రేక్షకులు ఈ షోను సూపర్ గా ఆదరించారు. మొదటి ఎపిసోడ్ కోసం ఈటీవీ చాలానే కసరత్తు చేసింది.
Sridevi Drama Company కి అట్రాక్షన్ గా ఇమ్మాన్యుయేల్, వర్ష
శ్రీదేవి డ్రామా కంపెనీకి స్పెషల్ అట్రాక్షన్ గా ఇమ్మాన్యుయేల్, వర్ష నిలిచారు. జబర్దస్త్ టీమ్ గురించి ఎలాగూ తెలిసిందే. వాళ్లు ఎక్కడుంటే అక్కడ నవ్వులే. జబర్దస్త్ కంటెస్టెంట్లు అందరూ కలిసి కామెడీ చేస్తే ఎలా ఉంటదో ఈ షోను చూస్తేనే తెలుస్తుంది. అందులోనూ బుల్లితెర సీరియల్ హీరో అర్జున్ యాంకర్ గా అదరగొట్టేశాడు. మొత్తం మీద శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంటర్ టైన్ మెంట్ కు కొదవ లేదు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మొదటి ఎపిసోడ్ ను చూసేయండి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!