NewsOrbit
రాజ‌కీయాలు

అది తప్పుడు జాబితా

హైదరాబాద్ : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తును ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో నిలిచేది వీళ్ళే అంటూ స్థానాల వారీగా అభ్యర్థుల పేర్లు వార్తల్లో వెలువడ్డాయి. టివి ఛానళ్లలో అభ్యర్ధుల ఖరారు అంటూ కొన్ని పేర్లు వెలువడిన తర్వాత కాంగ్రెస్ రంగంలోకి దిగింది. తమ పార్టీ నుంచి జాబితా అంటూ ఏదీ విడుదల కాలేదనీ, వస్తున్న వార్తలను నమ్మవద్దనీ ఎఐసిసి కార్యదర్శి మధు యాస్కి ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల లిస్ట్ అంటూ దొంగ లిస్ట్ బయటకు రావడంలో టిఆర్‌ఎస్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉందనీ, రేపు ఎఐసిసి ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుందనీ, తర్వాత మాత్రమే అభ్యర్ధుల జాబితా వెల్లడిస్తారనీ మధు యాస్కీ పేర్కొన్నారు.

తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ  స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్ మినహా మిగిలిన 16 స్థానాల్లో ఎలాగైనా గెలవాలని టిఆర్ ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు కసరత్తులు చేస్తున్నది.

ఇందులో భాగంగానే సామాజిక సమీకరణల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించితేనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పరువు దక్కుతుందని టిపిసిసి సీనియర్ నేత ఒకరు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఏయే స్థానం నుంచి ఎవరెవరిని బరిలో దింపాలనే దానిపై ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌కు సూచనలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

Related posts

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

Leave a Comment