NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఏప్రిల్ 2 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: ఏప్రిల్ 2 – చైత్రమాసం – శనివారం

మేషం

ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది వృధా ఖర్చులు పెరుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి.

Today Horoscope Apr 2ed
Today Horoscope Apr 2ed

 

వృషభం

ఆర్థిక పురోగతి కలుగుతుంది. పాత ఋణాలు తీర్చగలుగుతారు. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందుతారు. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

మిధునం

వృత్తి వ్యాపారములలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆధ్యాత్మికసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున పని ఒత్తిడి  ఉన్నప్పటికీ పనులు పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

కర్కాటకం

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు  గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సహాయ సహకారాలు అందుతాయి.

సింహం

చేపట్టిన పనులలో అధిక కష్టంతో అల్పఫలితం పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

కన్య

ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సన్నిహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తి అవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్ధిరాస్తి  క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

తుల

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతగా ఉంటుంది.

వృశ్చికం

సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వృధా ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి.

ధనస్సు

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత ఆశ్చర్య పరుస్తుంది. మాతృ వర్గ బంధువుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

మకరం

చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి వృత్తి ఉద్యోగమున అధికారుల గుర్తింపు పెరుగుతుంది.

కుంభం

చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది.  దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధు మిత్రులతో  మాటపట్టింపులు పెరుగుతాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి.

మీనం

సన్నిహితుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వృత్తి వ్యాపారమున నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

 

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

Related posts

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 16: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 15: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 14: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 13: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 13: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju