Intinti Gruhalakshmi: లాస్య ఇచ్చిన ఐడియా తో నందు అభికీ కాల్ చేస్తాడు. డాడ్ ఎలా ఉన్నారు అని అంటాడు.. అభి నీకు గుర్తుందా చిన్నప్పుడు నేను టూర్స్ వెళ్ళేవాడిని.. నాకోసం నువ్వు టూర్ నుంచి వచ్చే వరకు ఎదురు చూసే వాడివి. నీకోసం నేను టూర్ మధ్యలో నుంచి వచ్చేవాడిని. ఎంతైనా పెద్ద కొడుకువి కదా.. కాస్త ప్రేమ ఎక్కువే.. అందరి మీద కాస్త ప్రేమ ఎక్కువే నువ్వంటే.. ఆ రోజులే చాలా బాగున్నాయిరా అని నందు ఎమోషనల్ అవుతాడు. అభి కూడా ఎమోషనల్ అవుతాడు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి డాడ్ అని అంటాడు అభి.. నువ్వు చెప్పాలా అంటాడు నందు..
నందు నువ్వు సూపర్ గా యాక్ట్ చేసావు. నీ యాక్టింగ్ కి అభి ఫ్లాట్ అయిపోయాడు అని లాస్య అంటుండగా.. నందు నేను యాక్ట్ చేయలేదు. నిజంగా ఫీలయి మాట్లాడను. నా లోపల ఉన్న బాధ అలా మాటల్లో పొంగుకొచ్చింది. నీ ఎమోషన్ మన ప్లాన్ కి అడ్డు రాకూడదు. ముందు అది గుర్తుంచుకో అని లాస్య వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
శృతి క్యారేజ్ తీసుకుని ప్రేమ్ పనిచేస్తున్న ఆఫీస్ కి బయల్దేరుతుంది. ప్రేమ చూడకుండా ఆ క్యారేజ్ ఇచ్చేసి రావాలి అనుకుంటుంది కానీ సుతి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఫీస్ లోకి రావడం ప్రేమ గుర్తుపట్టేస్తాడు. శృతి ఎక్కడికి అని అడుగుతాడు. నీకోసం క్యారేజ్ తీసుకువచ్చా అని శృతి కవర్ చేసుకుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి క్యారేజ్ ఇవ్వడానికి వచ్చిన శృతి ఆ క్యారేజ్ ప్రేమ్ కి ఇచ్చి అసలే పొద్దున కూడా టిఫిన్ తినలేదు ఇప్పుడైనా తిను అని అంటుంది. ప్రేమ్ శృతిని చూస్తూ పాపం పిచ్చిది నాకోసం క్యారేజ్ తీసుకొచ్చింది అనుకుంటాడు మనసులో. శృతి సారీ ప్రేమ్ అని తన మనసులో అనుకుంటుంది.
తులసి ప్రేమ్ అభిలను తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది. ప్రేమ్ నువ్వు నా కళ్ళ ఎదురుగా కనిపించిన కూడా నేను మాట్లాడలేక పోయాను. రేపు నువ్వు మంచి పొజిషన్ కి వెళ్ళాక మన ఇద్దరినీ ఇంకా ఆ దేవుడు దూరం చేయలేడు కూడా. త్వరగా మంచి పొజిషన్ కి ఎదిగి నా దగ్గరకు వచ్చేయ్ అంటుంది. అభి ఎందుకురా ఈ అమ్మ కళ్ళ ఎదురుగా ఉన్నా మాట్లాడట్లేదు.. అని వాళ్ళ ఫోటో చూస్తూ మాట్లాడుతుంటుంది తులసి.. ఇదంతా దివ్య చూసి నీకు మనసులో ఇంత ప్రేమ ఉండి ఎలా భరిస్తున్నవు మామ్ అని అడుగుతుంది.