NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తప్పులు ఎక్కువ కాలం చేయలేరు .. ఎప్పటికైనా వెలుగు చూడక మానవు.. ఇదే ఉదాహరణ

కొంత మంది తమ తెలివి తేటలతో తప్పులు చేస్తూ తాము దొరికిపోము అని అనుకుంటుంటారు. కానీ తప్పుడు పనులు ఎక్కువ కాలం దాగవు. అవి ఎప్పటికైనా వెలుగు చూడక తప్పుదు. అందుకు శిక్షలు తప్పవు. నిన్న బాపట్లలో వెలుగు చూసిన ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. వివిద శాఖల అధికారులు, ఉద్యోగులు క్రమం తప్పకుండా విధులకు హజరయ్యేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ హజరును ప్రవేశపెట్టి కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు తమ అతి తెలివి, మేధావి తనాన్ని ఉపయోగించి ప్రభుత్వ ఉన్నతాధికారులను బురిడి కొట్టిస్తూ విధులకు డుమ్మా కొడుతుంటారు.

Biometric Attendance Fraud

 

బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ సీ)లో వైద్యాధికారిగా భాను ప్రకాశ్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ వైద్యుడికి మార్టూరులో ప్రైవేటు ఆసుపత్రి ఉంది. ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో కంటే సొంత క్లినిక్ లోనే ఎక్కువగా తమ వైద్య సేవలను కొనసాగిస్తున్నాడు. ఆయన పీహెచ్ సీ కి వెళ్లకపోయినా క్రమంతప్పకుండా హజరు మాత్రం నమోదు అవుతూనే ఉంది. ఒక వేళ పీహెచ్ సీకి వచ్చినా సిబ్బంది తో కలిసి మద్యం సేవించే వాడనీ, మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించే వాడనే ఆరోపణలు ఉన్నాయి. నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజిని పిహెచ్ సి తనిఖీకి విచ్చేసిన సందర్భంలో గ్రామస్తులు వైద్యుడిపై పిర్యాదు చేశారు.

AP Minister Vidtala Rajini

టీఆర్పీ స్కామ్.. తెలుగు న్యూస్ చానెళ్ళు బాగోతం ‘న్యూస్ ఆర్బిట్’ చేతిలో..!

హజరులో హైటెక్ పద్దతి

మంత్రి విడతల రజిని విచారణ సందర్భంగా ఊహించని వాస్తవం వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు క్లినిక్ లో ఎప్పుడూ బిజీగా ఉండే ఆ వైద్యుడు భానుప్రకాశ్ .. తన కృత్రిమ వేలిని పిహెచ్ సీ సిబ్బందికి ఇచ్చి క్రమం తప్పకుండా మూడు పూటలా హజరు వేయించేవాడని తెలిసింది. గ్రామస్తుల నుండి వైద్యుడిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మంత్రి రజిని వెంటనే చర్యలు చేపట్టారు. సదరు వైద్యుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఎంతైనా వైద్యుడు కదా, హైటెక్ పద్దతితో కృత్రిమ వేలు తయారు చేయించి హజరు నమోదు చేసుకుంటున్నాడు. ఈ ఘటన వెలుగు చూడటంతో ప్రభుత్వం.. ఉపాధ్యాయుల హజరునకు ఫేస్ రికగ్రైజేషన్ యాప్ తీసుకురావడం తప్పేలేదన్న భావన కలుగుతోంది.

AP BJP: ఏపీలో స్పీడ్ పెంచుతున్న బీజేపీ .. ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి కీలక బాధ్యతలు

Related posts

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju