Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. నిన్నటి తో ఈ సీరియల్ 728 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తున్న ఈ సీరియల్ అనూహ్యమైన రీతిలో ముందుకు సాగుతుంది.. టీ ఆర్పీ రేటింగ్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఏమాత్రం తగ్గలేదు.. వచ్చేవారం హైలెట్ ట్విస్ట్ ఏంటో చూద్దాం..!
తులసి పై రివెంజ్ తీర్చుకుంటుంది లాస్య.. అందుకే ప్లాన్ చేసి మరీ సామ్రాట్ దగ్గర తన గురించి చెడుగా చెబుతున్నారు.. నందు, లాస్యకి తులసి ఎంత గడ్డి పెట్టునా వల్ల వంకర బుద్ధి మాత్రం మారదు.. తులసి తన నిజాయితీని నిరూపించుకోవాలని నందు దగ్గరకి వెళ్లి.. తన మాజీ భర్త నువ్వెనని .. ఆ నిజం నువ్వు చెప్పద్దు అని నాతో చెప్పావని
. ఆది సామ్రాట్ కు నీ నోటితో చెప్పిస్తే ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని తులసి అంటుంది.. నందు ససేమిరా ఒప్పుకోడు.. నేను సామ్రాట్ తో ఆ విషయం చెప్పాలి అంటే.. హనీ ని నువ్వు సేవ్ చేసినప్పుడు.. ఆ యాక్సిడెంట్ చేసింది నేనేనని నువ్వు చెప్పలేదు కదా.. ఇప్పుడు ఆ విషయం కూడా చెబుతాను అని నందు అంటాడు.. ఆ రోజు నిన్ను కాపాడాలని నేను ఆ విషయం చెప్పలేదు.. ఇప్పుడు అదే విషయాన్ని అడ్డం పెట్టుకొని నా మంచితనాన్ని చెడుగా చూపిస్తావా.. మీరిద్దరూ బాగుపడరు నేను ఊరుకున్నా.. పైన ఉన్న దేవుడు మాత్రం మిమ్మల్ని చూస్తూ ఊరుకోడు అని తులసి శాపనార్థాలు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
లాస్య, నందు ఎలాగైనా తులసి ప్రాజెక్ట్ చేయించి తమ్న ప్రాజెక్ట్ పట్టలెక్కించలని ప్లాన్ చేస్తున్నారు.. సామ్రాట్ దగ్గర తెలియనట్టు నందు, లాస్య లేనిపోనివి తులసి మీద చెబుతారు.. అలా తులసి పై లేని పోనివి చెప్పి సామ్రాట్ కు తులసి పై కోపం వచ్చేలా చేస్తారు.. సామ్రాట్ కోపంగా తులసి నా ప్రాజెక్ట్ క్యన్సిల్ చేస్తుందా.. ఇది నాకు ఇబ్బందిగా ఉంది అని నందు తో అంటాడు.. తనని అంత తేలికగా వదలను అని సామ్రాట్ అంటాడు.. కానీ తులసి మంచితనం సామ్రాట్ తెలుసుకుని ఆ ప్రాజెక్ట్ ను మళ్ళీ స్టార్ట్ చేస్తారు అదే వచ్చేవారం హైలెట్ ట్విస్ట్..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!