NewsOrbit
జాతీయం న్యూస్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యుల్ ఖరారు ..నూతన పార్లమెంట్ భవనంలో తొలి సమావేశాలు.. ఎప్పటి నుండి అంటే..?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్దమైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యుల్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీ నుండి ఆగస్టు 11వ తేదీ వరకూ వర్షాకాలసమావేశాలు జరగనున్నాయని ఆయన తెలిపారు. ఈ సారి సమావేశాలు తొలుత పాత పార్లమెంట్ భవనంలో ప్రారంభమై మధ్యల కొత్త భవనంలోకి మారతాయని ఇటీవల అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్రం యోచిస్తొందని సమాచారం.

new-parliament-building

 

ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) బిల్లును ఈ సారి జాబితాలో ఉందని తెలుస్తొంది. దీనికి సంబంధించి చాలా మంది పార్లమెంట్ సభ్యులు అభిప్రాయాలను ఇప్పటికే అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై లా కమిషన్, న్యాయ మంత్రిత్వ శాఖ కూడా వారి అభిప్రాయాలను తెలియజేయాలని జూన్ 14నే నోటీసు జారీ అయ్యింది. ఈ మేరకు జూలై 3న లా కమిషన్, న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో అధికారుల సమావేశం జరగనున్నది. ఇందులో సభ్యుల అభిప్రాయాలు, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయం వంటి అంశాలు చర్చించబోతున్నారు. అయితే ఈ బిల్లును పలు పార్టీలు వ్యతిరేకిస్తుండగా, మరి కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నాయి. దీంతో పాటు ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల విషయంలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై బిల్లును ప్రవేశపెట్టనున్నది. అయితే ఈ ఆర్డినెన్స్ పై కేంద్రం, ఆప్ ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆప్ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకించే విషయంలో మద్దతు ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పలువురు బీజేపీయేతర ముఖ్యమంత్రులను కలిసి కోరారు.

మరో పక్క వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇవే మోడీ సర్కార్ కు చివరి వర్షాకాల సమావేశాలు. ఆ ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపే లక్ష్యంతో విపక్షాలు అన్ని కలిసి కట్టుగా పోరాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విపక్షాల ఐక్యతకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సమయంలో వివిధ అంశాల్లో అధికార పక్షం బీజేపీని విపక్షాలు గట్టిగానే ప్రశ్నించనున్నాయని తెలుస్తొంది. మణిపూర్ హింసాత్మక ఘటనలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు సన్నద్దం అవుతున్నట్లు సమాచారం. కాగా నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మే 28న ప్రారంభించిన సంగతి తెలిసిందే.

France Violence: ఆందోళనలతో అట్టుడికిపోతున్న ఫ్రాన్ .. పోలీసులతో ఘర్షణలు .. తీవ్ర రూపం దాల్చిన హింస

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N