NewsOrbit
Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Nara Lokesh: గన్నవరం సభలో చేసిన వ్యాఖ్యలకు లోకేష్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు..!!

Nara Lokesh: రెండు రోజుల క్రితం గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించడం తెలిసిందే. ఈ సభలో కృష్ణా జిల్లాతో పాటు పశ్చిమగోదావరి ఇంకా ఏలూరు జిల్లాలకు చెందిన నేతలు హాజరయ్యారు. వైసీపీ పార్టీ నాయకులపై సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక ఇదే సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. చాలా సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అదేవిధంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఇద్దరు నాయకులను వచ్చే ఎన్నికలలో ఓడించాలని ప్రజలకు లోకేష్ పిలుపునిచ్చారు. అనవసరంగా తమ కుటుంబ సభ్యులపై నోరు పారేసుకున్నారని… తెలుగుదేశం పార్టీ వచ్చాక వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

Police issued notice to Lokesh for his comments in Gannavaram Sabha

గన్నవరం తెలుగుదేశం పార్టీ అడ్డా అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికలలో మరోసారి తెలుగుదేశం పార్టీని ఆదరించాలని కోరారు. ఇదిలా ఉంటే గన్నవరం సభలో లోకేష్ చేసిన వ్యాఖ్యలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని నోటీసులో స్పష్టం చేశారు. అయితే నేరుగా నోటీసులు లోకేష్ కి ఇవ్వాలని పోలీసులు ప్రయత్నం చేసిన కుదరలేదు. దీంతో అక్కడ ఉన్న మాజీ ఎంపీ కొనకాల నారాయణకు నోటీసులు అందించి వెళ్లిపోయారు. మరోవైపు లోకేష్ తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులపై పోలీసులకు గుడివాడ వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.

Police issued notice to Lokesh for his comments in Gannavaram Sabha

కొడాలి నాని, వల్లభనేని వంశీలను చంపేస్తాను అనే రీతిలో గన్నవరంలో లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఇదే సమయంలో లోకేష్ తో పాటు బుద్ధ వెంకన్న, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, అయ్యన్నపాత్రుడలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. మొత్తం మీద కృష్ణా జిల్లాలో లోకేష్ పాదయాత్ర చాలా రసవత్తరంగా సాగుతోంది. వైసీపీ నాయకులపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

Related posts

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju