Ennenno Janmala Bandam : ప్రెగ్నెన్సీ నిలవక పోవచ్చు అనే కారణం వేదశ్వినీకి డైరెక్ట్ గా చెప్తే తను తట్టుకోలేదు మానసికంగా కృంగిపోతారు తనకి చానా నష్టం కాబట్టి ఈ విషయం ఆవిడకి తెలవనివ్వకండి అని డాక్టర్ అంటుంది. థాంక్స్ మేడం అని యష్ అంటాడు. కట్ చేస్తే హా టమాట పప్పు గోంగూర చట్నీ ఆలూ ఫ్రై ఇవన్నీ ఆయన ఇష్టంగా తింటారు కష్టపడే భర్తకి ఇష్టపడి వంటలు చేస్తే కడుపునిండా తిన్న భర్త కళ్ళల్లో ఆనందం కన్నా ఈ లోకంలో ఇంకేం కావాలి ఏ భార్యకి అయినా అని వేద అనుకుంటుంది.ఇంతలో అక్కడికి కృషి వచ్చి అమ్మఈరోజు సంథింగ్ స్పెషలాఅని అంటుంది. సంథింగ్ స్పెషల్ అంటే స్పెషల్ మీ డాడీ కి ఇష్టమైనవన్నీ చేశాను అని అంటుంది. అమ్మ నాకు ఒక చిన్న డౌటు ఇష్టమైనవన్నీ రోజు వండొచ్చు కదా కానీ అప్పుడప్పుడు మాత్రమే ఎందుకు వండాలి అని ఖుషి అంటుంది.

ఇది మిలియన్ డాలర్ కోషన్ ఇష్టం కదా అని రోజు వండేస్తే బోర్ కొట్టేస్తుంది ఇష్టమైనవన్నీ ఇష్టం లేకుండా పోతాయి కొన్నిటిని అప్పుడప్పుడు వండుకొని తింటేనే బాగుంటుంది అని వేద అంటుంది. అయితే సరే వేదమ్మ క్యారేజీ ఎవరికోసం అని ఖుషి అంటుంది.ఇది మీ డాడీ కోసం ఆఫీసుకి పంపిస్తున్నాను అక్కడ టైం కి ఏమి దొరకకపోతే ఏం తింటారు అందుకనే నేనే తీసుకు వెళుతున్నాను అని వేద అంటుంది. మరి నువ్వు ఎందుకమ్మా తీసుకెళ్లడం అని ఖుషి అంటుంది. నేను పక్కన ఉండి వడ్డిస్తే మీ డాడీ కడుపునిండా తింటాడు అని వేదా అంటుంది. అయితే నేను కూడా వస్తాను డాడీ కి నేను అంటే కూడా ఇష్టం కదా అని ఖుషి అంటుంది సరే అయితే పద మనం ఇద్దరం కలిసి వెళ్దాము అని వేద అంటుంది.. కట్ చేస్తే ఖుషి వేద ఆఫీస్ లోకి వస్తారు డాడీ అని ఖుషి అంటుంది. మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని యాష్ అంటాడు. డాడీ నేను వెళ్లి ఆఫీస్ అంతా చూసి వస్తాను అని ఖుషి అంటుంది.

వేద నువ్వు ఏం చేస్తున్నావు నీకైనా అర్థం అవుతుందా నువ్వు అసలు కథల కూడదు ఇంట్లోనే ఉండాలి పూర్తిగా రెస్ట్తీ తీసుకోవాలి అని యష్ అంటాడు. ఆపండి సార్ నేను ఒక డాక్టర్ని పిల్లల డాక్టర్ని అయినా నాకు కొన్ని తెలుసు అని వేదా అంటుంది. ఏం తెలుసు నీకు అసలు డాక్టర్ ఏం చెప్పారో తెలుసా నీకు అని యష్ అంటాడు. ఏం చెప్పారు గర్భసంచి వీక్ గా ఉంది ప్రెగ్నెన్సీ నిలవడం కష్టం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారా అని వేద అంటుంది. మరి ఇవన్నీ తెలిసి ఏంటి నువ్విలా అని యష్ అంటాడు. మీరు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది నేను తల్లినే కాను అని అన్నారు కానీ నేను తల్లిని అయ్యాను కదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో నాకు తెలుసండి అని వేద అంటుంది. నువ్వు ఇంత నమ్మకంగా ఉన్నావంటే నాకు ఇంకా కావాల్సింది ఏముంది అని యష్ అంటాడు. ఏమండీ నేను తల్లిని అవుతాను. ఖుషి ఆదిత్య లకి ఒక తమ్ముడిని ఇస్తాను మన ఇంట్లో మరొక బుజ్జాయి సందడి చేస్తాడు మనం ఇద్దరం కలిసి మన ఇంట్లో మంచి సమయం చూసి అందరికీ చెబుదాము అప్పటివరకు దీన్ని సీక్రెట్ గానే ఉంచుదాము అని వేద అంటుంది.

అలాగే వేద అని యాష్ అంటాడు. లేట్ అయిపోతుంది మీరు అలా కూర్చొని భోజనం చేదురు గాని అని వేద అంటుంది. కట్ చేస్తే చిన్నప్పుడు ముగ్గులు వేయడం నేర్పలేదేమో మీ పెద్దవాళ్లు ముగ్గులు వచ్చిన వాళ్లకి లెక్కలు బాగా వస్తాయని లెక్కలు వచ్చిన వాళ్ళకి వంటలు బాగా వస్తాయని మా అగ్రహారంలో అంటారు అని సులోచన అంటుంది. ఒక్క మాటలో ఒప్పుకున్నావు సులోచన నీకు వంటలు రావు అని మాలిని అంటుంది. అందుకేనా నా చేత అడిగిమరీ వంటలు చేయించుకుని లొట్టలు వేసుకుంటూ తింటున్నారు అని సులోచన అంటుంది.మాది తెలివైన వంశం సులోచన మరి బద్ధకంగా ఉంటేనే వడలికగా అనిపిస్తేను నిన్ను పిలిపించి ఒక నాలుగు మాటలు చెప్పితే నోటి ముందుకి 10 వెరైటీలు వస్తాయి మాది తెలివైనవంశమా మరి మీది తెలివైన వంశమా అని మాలిని అంటుంది. నిజమే వదిన ఒప్పుకోక తప్పదు మీ ఇదే తెలివైన వంశం అది సరే కానీ ఈ పూట ఏం వండారు అని సులోచన అంటుంది.

నేతితో చేసిన పులిహోర పెసర గారెలు సేమియా పాయసం ఇంకా కూరలు అంటావా వంకాయ నాన్న రకాలుగా వండాను అని అంటుంది. వద్దులేండి వదిన గారు మీరు చెప్పటం నాకు నోరూరటం వద్దులే అని సులోచన అంటుంది. ఆ మాత్రం మర్యాద నాకు తెలియదా మీ ఇద్దరికీ సరిపోయేంత భోజనం తీసుకెళ్ళు అని మాలిని అంటుంది. మరి మీకు తక్కువ పడుతుందేమో అని సులోచన అంటుంది. ఓ సులోచన తక్కువ పడితే మళ్లీ వండుకుంటాను దానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడతావు అని మాలిని అంటుంది. మాట తప్పరు కదా వదిన గారు అని సులోచన అంటుంది. మాటంటే మాటే మాలిని మాట మీద నిలబడుతుంది అని మాలిని అంటుంది. కట్ చేస్తే అభి జైలు నుంచి ఇంటికి వస్తాడు ఆగండి ఆగండి అని నీలాంబరి హారతి తీసుకువచ్చి హారతి ఇస్తుంది ఇప్పుడు లోపలికి రండి అని నీలాంబరి అంటుంది. ఏంటి అంత కొత్తగా ఉంది అని అభి అంటాడు. ఏంటి నాలుగు రోజులు ఇంట్లో ఉండకపోతేనే ఇల్లంతా కొత్తగా కనిపిస్తుందా మీకు అని నీలాంబరి అంటుంది. లేదు ఏవో మార్పులు జరిగాయి మా అక్క కైలాష్ ఎక్కడ కనిపించట్లేదు అని అభి అంటాడు.
లేరు ఇక రారు నేను అన్ని మీకు జాగ్రత్తగా చెపుతాను కదా ఏవండీ ఏ ఆడపిల్ల అయినా భర్త నుండి ఏం కోరుకుంటుంది ఏమి ఆశిస్తుంది కాస్తంత ప్రేమ కొంచెం ఆప్యాయత అంతే కదా మీ దగ్గర నుండి నాకు కొంచమైనా అవి దొరికాయా లేదు కదా కక్షలు కత్తులు పగలు ఇవన్నీ మనకెందుకండీ కత్తి పట్టిన వాడు కత్తితోనే పోతాడు అని అంటారు మీరు ఏమైనా అనుకోండి కారణం ఏదైనా మీ అక్క అజిత్ లా మారి కైలాశలే కదా మీ అక్క మీద నాకు కోపం రాధా మీతో తాళి కట్టించుకున్న భార్యను అండి నేను అందుకే వాళ్ళను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసాను అంతే కాదు ఇంకొక మంచి పని కూడా చేశాను వెన్నుపోటు పొడిచే మనుషులు ఉన్న ఈ లోకంలో మీరు జైలుకి వెళ్ళగానే ప్రాపర్టీ అంతా ఎక్కడ కాజేస్తారోనని నా పేరు మీద చేసుకున్నాను అని నీలాంబరి అంటుంది. ఎవరి పేరు మీద ఉంటే ఏంటి నన్ను కాదనుకొని వెళ్లిపోయారు కదా కానీ ఒక్కసారి కైలాసుని నేను కలవాలి అని అభి అంటాడు. మళ్లీ అదే మాట అంటారేంటండి జైలుకు వెళ్లి బేల్ మీద వచ్చారు ఆ వేదవాళ్లు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ల అనేది మనకు అనవసరం అండి రిస్క్ ఎవరికి అయింది ఫైనల్ గా నష్టపోయింది మనమే కదా వద్దండి ఇక నుంచి మంచిగా బ్రతుకుదాం మంచి పేరు తెచ్చుకుందాం అని నీలాంబరి అంటుంది. సరే నాకు కొన్ని పనులు ఉన్నాయి అని అభి అంటాడు. సరేగాని గీజర్ వేసి ఉంచాను స్నానం చేసి రండి మంచి భోజనం చేశాను.

తిందురు గాని అని నీలాంబరి అంటుంది. కట్ చేస్తే వేద నువ్వు ఏం చేస్తున్నావ్ నువ్వు రెస్ట్ తీసుకోవాలి కావాలంటే నేను వడ్డిస్తాను నువ్వు కూర్చో అని యాష్ అంటాడు. యష్ ఏమైంది రా నీకు ఇట్ల మారిపోయినవ్ ఏంది అని వాళ్ళ అమ్మ అంటుంది. అమ్మ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా అసలే ఇప్పుడు వేద వట్టి మనిషి కూడా కాదు అని యష్ అంటాడు. వేద వట్టి మనిషి కాదా యష్ నీ మాటలు వింటుంటే వేదాన్ని క్లినిక్ కూడా వెళ్లనిచ్చేలాగా లేవు కదా అని వాళ్ళని అంటుంది. అది 9 నెలల తర్వాత లే అమ్మ అని యష్ అంటాడు. ఏమో నీ మాటలు నాకు ఏమీ అర్థం కావట్లేదు అని మాలిని అంటుంది. నాయనమ్మ నాకు అర్థమైంది వేద అమ్మ బొజ్జలో చిన్ని బుజ్జాయి ఉన్నాడు అని ఖుషి అంటుంది. ఓ మై గాడ్వే ఇది నిజమా వేద అని మాలిని అంటుంది. నేను వేద మాట్లాడుకుంటుంటే విని ఖుషి అలా అన్నది అమ్మ అదేమీ లేదు అనియష్ అంటాడు. మీ తండ్రి కూతుర్లు ఇద్దరు మాట మార్చొద్దు అని మాలిని అంటుంది. అమ్మ వేదకి బేబీ వైరస్ వచ్చింది అది ఆడవాళ్లకు మాత్రమే వస్తుందట అని యష్ అంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది