NewsOrbit
Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

AP CM Jagan: జాతీయ అవార్డులు గెలిచిన తెలుగు నటీనటులను అభినందించిన సీఎం జగన్..!!

Advertisements
Share

AP CM Jagan: 69వ భారతీయ చలనచిత్ర రంగానికి సంబంధించి జాతీయ అవార్డుల ప్రకటన నేడు ఢిల్లీలో జరిగింది. వివిధ విభాగాలలో పురస్కార విజేతలను..జ్యూరీ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలో 69 వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. RRR సినిమాకి ఏకంగా ఆరు అవార్డులు వరించాయి. పుష్ప సినిమాకి రెండు అవార్డులు వచ్చాయి. ఈ క్రమంలో జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక కావడం జరిగింది. దీంతో తెలుగు చలనచిత్ర రంగంలో 69 ఏళ్ల సినీ కెరియర్లో మొట్టమొదటిసారి జాతీయ అవార్డు అందుకుంటున్న హీరోగా బన్నీ రికార్డు క్రియేట్ చేశారు. ఇదే సమయంలో ఉత్తమ సంగీతం, ఉత్తమ సాహిత్యం విభాగాల్లో కూడా తెలుగు పరిశ్రమ సత్తా చాటింది.

Advertisements

CM Jagan congratulated Telugu actors who won national awards

ఈ 69 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఏడు భాషలు పోటీ పడగా.. 30 సినిమాలు రిజిస్టర్ అయ్యాయి. అయితే ఎక్కువగా తెలుగు సినిమాకి ఏకంగా 10 అవార్డులు రావటం జరిగింది. జాతీయస్థాయిలో తెలుగు చలనం చిత్ర పరిశ్రమ సత్తా చాటింది. దీంతో చాలామంది సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు తెలుగు చలనచిత్ర రంగంలో జాతీయ అవార్డులు గెలుచుకున్న విజేతలను అభినందిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం జాతీయ చలనచిత్ర అవార్డులు గెలిచిన విజేతలను సోషల్ మీడియా వేదికగా అభినందించారు. అల్లు అర్జున్, RRR టీంకు అభినందనలు తెలిపారు.

Advertisements

CM Jagan congratulated Telugu actors who won national awards

ఇదే సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కి ఇంకా.. RRR దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, చంద్రబోస్ కి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. మీరంతా మమ్మలందరినీ గర్వపడేలా చేశారని అభినందించారు. RRR సినిమాకి ఏకంగా ఆరు అవార్డులు రావడం జరిగాయి. కొండ పాలెం, ఉప్పెన సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి. ఉత్తమ జాతీయ నటుడు రేసులో అల్లు అర్జున్ తో పాటు చరణ్, ఎన్టీఆర్, సూర్య, జొజు జార్జి పోటీ పడగా చివరకి బన్నీకే అవార్డు వరించింది. దీంతో తెలుగు చలనచిత్ర రంగంలో మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకుంటున్న తొలి హీరోగా బన్నీ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది.


Share
Advertisements

Related posts

YCP vs TDP; వైసీపీ ఫిర్యాదుకు టీడీపీ కౌంటర్..! బలేగుంది రాజకీయం..!!

somaraju sharma

ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ .. పిటిషన్‌లో సంచలన ఆరోపణలు

somaraju sharma

Minister Jayaram : మరో వివాదంలో మంత్రి గుమ్మనూరు జయరాం

somaraju sharma