NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Cyclone michaung: దూసుకు వస్తున్న మిచాంగ్ తుఫాన్ .. అప్రమత్తమైన ఏపీ సర్కార్ .. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Cyclone michaung: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. పుదుచ్చేరికి 730 కి.మీ, చెన్నైకి 740 కి.మీ, నెల్లూరుకు 860 కి.మీ, బాపట్లకు 930 కి.మీ, మచిలీపట్నానికి 910 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్ర డైరెక్టర్ ఓ ప్రకటన లో తెలిపారు. ఇది పశ్చిమ – వాయువ్య దిశగా పయనించి ఇవేళ (శనివారం) బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా, ఆదివారానికి తుఫాను (సైక్లోన్ మిచాంగ్) గా బలపడుతుందని తెలిపారు. అనంతరం వాయువ్య దిశగా పయనించి సోమవారం నాటికి నెల్లూరు – మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని అన్నారు.

తుఫాను ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని చెప్పారు. సోమవారం పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. మంగళవారం దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా లో అత్యంత భారీ వర్షాలు పడతాయన్నారు. తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తొంది.

తుఫాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసింది. ఇప్పటికే అధికారులు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తాడేపల్లి లో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఫోన్ నంబర్ లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేసింది. తుఫాను ప్రభావం శనివారం నుండి మొదలై ఈ నెల అయిదవ తేదీ వరకూ కొనసాగనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సముద్రంలో చేపల వేటపై నిషేదం విధించారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తం తొమ్మిది నౌకాశ్రయాల్లో 1వ నెంబర్ హెచ్చరిక జారీ అయ్యింది. తుఫాను కారణంగా వంద కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ డ్యామ్ పై కేంద్రం కీలక నిర్ణయం .. రెండు తెలుగు రాష్ట్ర వివాదాలకు పరిష్కారం ఇలా..

Related posts

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju