NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 02 2023 Episode 1115: ఆర్య ని అనుని చంపాలి అనుకుంటున్న ఛాయా..

Prema Entha Madhuram Today Episode December 02 2023 Episode 1115 Highlights

Prema Entha Madhuram December 02 2023 Episode 1115: మిమ్మల్ని ఆ విషయాలు అడిగి బాధ పెట్టినందుకు క్షమించండి కానీ పిల్లల కోసమైనా అతను ఎక్కడ ఉన్నాడో చెప్పండి వాళ్ల బాధను చూడలేకనే మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను ఐ యాం వెరీ సారీ రాధా గారు అని ఆర్య అంటాడు. పర్వాలేదండి మీరు మంచి పనే చేయాలనుకున్నారు కదా దానికి సారీ దేనికి అని రాదా అంటుంది. కట్ చేస్తే, ఆర్య బయట కూర్చుని కథ రాసుకుంటూ ఉంటాడు. అను లోపలకు కూర్చొని కార్తీక పౌర్ణమి కోసానికి 365 ఒత్తులు తయారు చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారు రాధా గారు అని దివ్య అడుగుతుంది. రేపు కార్తీక పౌర్ణమి కదా దివ్య 365 ఒత్తులు వెలిగిస్తే భగవంతుడు సంతోషిస్తాడు అని అను అంటుంది. మీకు కొంచెం భక్తి ఎక్కువ అనుకుంటా రాధా గారు మా అమ్మ కూడా నీలాగే భక్తితో ఉండి పూజలు చేస్తూ ఉంటుంది కానీ ఏం లాభం అన్ని కష్టాలే అనుభవిస్తుంది మీరు కూడా అంత సుఖంగా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు భగవంతుడు నీ పూజిస్తే అన్నీ కష్టాలే వస్తాయి ఎందుకండీ పూజించడం అని దివ్య అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 02 2023 Episode 1115 Highlights
Prema Entha Madhuram Today Episode December 02 2023 Episode 1115 Highlights

భగవంతుడు ఏదో చేయాలని కోరికతో పూజ చెయ్యకూడదు దివ్య మన నుదుటిన ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా ధైర్యంగా నిలబడి ఆ కష్టాన్ని ఎదుర్కునే శక్తిని ప్రసాదించమని భగవంతున్ని కోరుకోవాలి అని రాధా అంటుంది. ఏంటో  నండి మీ మాటలు నాకు ఏమీ అర్థం కావు అంటూ దివ్య వెళ్ళిపోతుంది. ఇంతలో పార్కుకి వెళ్లిన పిల్లలు సుగుణమ్మ ఇంటికి వచ్చేస్తారు. ఫ్రెండ్ ఈరోజు మేము చాలా ఎంజాయ్ చేశాను నువ్వు కూడా రావాల్సింది అని ఆకాంక్ష అంటుంది. చాలా గేమ్స్ ఉన్నాయా బాగా ఎంజాయ్ చేశారా ఇంకెప్పుడైనా మనందరం వెళ్దాం లే ఇప్పటికే పొద్దుపోయింది వెళ్లి స్నానం చేసి పడుకోండి అని ఆర్య అంటాడు. ఫ్రెండ్ ఈరోజు మేము నీ దగ్గరే పడుకుంటాము అని ఆకాంక్ష అంటుంది. అలాగే స్నానం చేసి రండి అని ఆర్య అంటాడు. ఇదేంటి అన్నయ్య బయట ఉన్నాడు అను గారు లోపల ఉన్నారు అని ఉష అనుకుంటుంది.

Prema Entha Madhuram Today Episode December 02 2023 Episode 1115 Highlights
Prema Entha Madhuram Today Episode December 02 2023 Episode 1115 Highlights

అన్నయ్య అన్నం తిన్నావా ఏంటి బయట కూర్చొని కదరాసుకుంటున్నావా రాధ గారికి అన్నం పెట్టావా అని అడుగుతుంది ఉష. పెట్టానమ్మా రాధ గారు తన గదిలో కూర్చుని తిన్నది నేనేమో హాల్లో కూర్చుని తిన్నాను అని ఆర్య అంటాడు. నేను అనుకున్నదే అయింది మీరు ఇద్దరు అలా కూర్చుని తింటారని అనుకున్నాను ఇంకా ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుని ఉంటారు నా బొందా అని ఉష కథ రాసిన పేపర్ తీసుకొని చదువుతుంది. అన్నయ్య ఈ కథ చాలా బాగా రాశావు ఆ తర్వాత ఏం జరగబోతుంది అన్నయ్య అని ఉష అడుగుతుంది. ముందే కథ గురించి తెలిసిపోతే చదివేటప్పుడు త్రిల్లింగ్ ఎలా ఉంటుందమ్మా అది రాసినప్పుడు చదువుదువులే అని ఆర్య అంటాడు. అయితే దీని రేపు పోస్ట్ చేస్తాను అంటూ పేపర్ తీసుకొని వెళ్ళిపోతుంది ఉష. అక్కడే నిలబడి ఆర్య ని చూస్తుంది అను. పిల్లలు స్నానం చేసి వచ్చి అమ్మ మేము మా ఫ్రెండ్ దగ్గర పడుకుంటాము అని అంటారు. సరే అలాగే పడుకోండి కానీ ఎక్కువగా అల్లరి చేసి ఆయనను ఇబ్బంది పెట్టకండి అని అను అంటుంది. సరే అమ్మ అని పిల్లలు వెళ్ళిపోతారు.

Prema Entha Madhuram Today Episode December 02 2023 Episode 1115 Highlights
Prema Entha Madhuram Today Episode December 02 2023 Episode 1115 Highlights

ఆర్య రేపు అనుని కలుసుకుంటానన్న సంతోషంలో ఆలోచిస్తూ నిద్రపోకుండా అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు. ఏంటి సార్ ఇంకా నిద్ర పోవట్లేదు నా గురించి ఆలోచిస్తున్నాడా నన్ను క్షమించండి సార్ మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు అని అను అనుకుంటుంది. కట్ చేసే,ఛాయా రౌడీల దగ్గరికి వెళ్లి  అను ఆర్యాల ఫోటో చూపించి వీళ్ళిద్దరిని చంపేయాలి ఎక్కడ ఎప్పుడు చంపాలనేది ఫోన్ చేసి చెప్తాను అని అంటుంది. ఒక్కసారి నేను పని చేస్తానని ఒప్పుకున్న తర్వాత అది కచ్చితంగా చేసి తీరుతాను మీ పని అయిపోయినట్టే మేడం అని ఆ రౌడీ అంటాడు. వీళ్లను చూస్తూ ఉంటే రేపటితో అను చావు తప్పదనిపిస్తుంది ఛాయా అని మానస అంటుంది. అందుకే కదా మనం వీళ్ళ దగ్గరికి వచ్చింది అను రేపు నీ చావు చూడబోతున్నాను అని చాయ అనుకుంటుంది. కట్ చేస్తే, ఇంతలో తెల్లవారింది అను లేచి తులసి చెట్టుకు పూజ చేసి దీపం పెడుతుంది. బయటికి వెళ్లి వస్తూ ఆర్య ఇంట్లోకి వస్తూ ఉండగా తులసి చెట్టు దగ్గర ఉన్నది దీపం కొండేక్క పోతుంటే తన రెండు చేతులు అడ్డుపెట్టి కాపాడుతాడు. అ దీపాన్ని కొంచెం లోపలికి జరిపి ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఆర్య.

Prema Entha Madhuram Today Episode December 02 2023 Episode 1115 Highlights
Prema Entha Madhuram Today Episode December 02 2023 Episode 1115 Highlights

అక్కడే నిలబడి ఆర్య ని చూస్తున్నాను సార్ నా దీపం కొండ ఎక్కకుండా కాపాడారు థాంక్స్ అని మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే, నీరజ్ సార్ ఏంటి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎక్కడికి వెళ్ళాడు అని జెండి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో నీరజ్ వస్తాడు. ఎక్కడికి వెళ్లారు సార్ ఫోన్ ఎత్తడం లేదు ఏంటి అని జెండి అడుగుతాడు. గుడికి వెళ్ళాను జెoడి ఫోన్ సైలెంట్ లో ఉంది చూసుకోలేదు మహేష్ జెoడీకి ప్రసాదం పెట్టు అని నీరజ్ కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్లిపోతాడు. అదేంటి సార్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఏమైంది అని  మహేష్ ని అడుగుతాడు. సార్ గుడి చుట్టూ 1000 ఎనిమిది ప్రదక్షిణ చేశాడు సార్ అని మహేష్ చెప్తాడు. ఎందుకు అలా చేశావు నీరజ్ అని జెండి అడుగుతాడు.

Prema Entha Madhuram Today Episode December 02 2023 Episode 1115 Highlights
Prema Entha Madhuram Today Episode December 02 2023 Episode 1115 Highlights

రేపు కార్తీక పౌర్ణమి కదా అండి వదినమ్మ అన్నయ్యకి దొరకాలని 1000 8 ప్రదక్షిణ చేశాను భగవంతుడు అనుగ్రహించి వాళ్ళిద్దరిని కలిపితే అంతకంటే సంతోషమే ఏముంటుంది అని నీరజ్ అంటాడు. మీలాంటి తమ్ముడు దొరకడం ఆర్య చేసుకున్న గొప్ప అదృష్టం కానీ భగవంతుడు ఎలా చేయాలనుకుంటున్నాడో ఏమో రాధా మేడంగారు ఆర్య కంట పడుతుందో లేదో అని జెండి అంటాడు. లేదు జెండా వదినమ్మ తప్పకుండా అన్నయ్యకి దొరకాలి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అని నీరాజ్ అంటాడు. అందరము కోరుకునేది అదే కదా నీ రాజ్ అంతకంటే మనకి ఇంకేం కావాలి అని జెండి అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella