NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa Episode 88: కరుణని ఒప్పించడానికి వైజయంతి పడుతున్న తంటాలు…

Paluke Bangaramayenaa Today Episode Dececber 01 2023 Episode 88 Highlights

Paluke Bangaramayenaa Episode 88: నిన్ను నమ్మించడానికి నేనేం చేయాలి అని వైజయంతి అడుగుతుంది. వీలైనంత త్వరగా నాకు స్వరకూ ఎంగేజ్మెంట్ అయిపోవాలి. సరే జరిపిస్తాను, కానీ ఇదంతా నువ్వు స్వర తో పెళ్లి కోసం చేస్తున్నావా లేక తరువాత నా దగ్గర నుండి డబ్బులు లాక్కోవడానికి చేస్తున్నావా అని అడుగుతుంది వైజయంతి. అలాంటిదేం లేదు, నేను అలాంటి వాడిని కాదు నాకు క్యారెక్టర్ ఉంది అని అంటాడు విశాల్.మీరు ఇలా మాట్లాడితే నేను చాలా హర్ట్ అవుతాను అని విశాల్ అంటాడు. వీడో దుర్మార్గం అదో దరిద్రం సరిపోయింది ఇద్దరికి అని వైజయంతి అనుకుంటుంది. సరే నాకు మీ పెళ్లి జరిపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఒక ప్రాబ్లం ఉంది అని చెప్తుంది వైజయంతి. అసలు అభి గాడిని వేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా అని అంటాడు విశాల్.అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు, ఊరికే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడం కాదు నిజంగా నువ్వు అభిని చంపగలవా కనీసం వాడిని టచ్ చేయగలవా అని వైజయంతి అడుగుతుంది.

Paluke Bangaramayenaa Today Episode Dececber 01 2023 Episode 88 Highlights
Paluke Bangaramayenaa Today Episode Dececber 01 2023 Episode 88 Highlights

అత్తయ్య మీకు నా క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలియదు అని అంటాడు విశాల్. ఆడవాళ్ళని హింసించినంత తేలిక కాదు ఒక మగవాడిని చంపడం అని వైజయంతి అంటుంది. మీరు అన్నది నేను నిజం చేసి చూపిస్తాను అని అంటాడు విశాల్. ఊరికే మాట్లాడటం కాదు చాతనైతే చేసి చూపించు అని వెళ్ళిపోతుంది వైజయంతి. కట్ చేస్తే,ఝాన్సీ గుడికి వెళ్లి అభితో తన పెళ్లి జరగాలని కోరుకుంటుంది. కట్ చేస్తే,నేను ఒక నష్ట జాతకురాలునని ఇప్పుడిప్పుడే అన్ని సర్దుకుంటున్నాయని అనుకునే లోపే అమ్మను దూరం చేశావు అయినా నేను నిన్ను నిందించట్లేదు అని స్వర దేవుడి దగ్గర అనుకుంటుంది. ఇన్నాళ్ళల్లో నేను ఎవరి గురించి ఇంతలా ఆలోచించలేదు నా జీవితంలో ప్రేమ అనేది ఉంటుందని నేను అసలు అనుకోలేదు నువ్వే ఎలాగైనా నా ప్రేమను గెలిపించాలి ఇప్పుడు అభి సార్ ని ప్రేమిస్తున్నాను అని చెప్పే ధైర్యం నాకు లేదు ఆయన మనసులో నా స్థానం ఏంటో అని తెలుసుకోవాలి అనుకుంటున్నాను నిజంగా నా జీవితంలో ప్రేమ అనేది ఉంటే అది అభి సార్ తోనే జరగాలి ఈ ఒక్క విషయంలో నాకు సహాయం చేయి కృష్ణ అని దేవుడిని కోరుకుంటుంది.

Paluke Bangaramayenaa Today Episode Dececber 01 2023 Episode 88 Highlights
Paluke Bangaramayenaa Today Episode Dececber 01 2023 Episode 88 Highlights

వైజయంతి నువ్వు ఒక ఇన్స్పెక్టర్ కి భయపడుతున్నావా పెద్ద పెద్ద వాళ్ళని వనికించి చలనం లేకుండా కుర్చీలో కూర్చోబెట్టావ్, ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటావు అని రంగరాజు అంటాడు.అసలు ఆ ఇన్స్పెక్టర్ నీతో ఏం చెప్పింది వైజయంతి అని అడుగుతాడు రంగరాజు. అది నాకేం చెప్పలేదు రంగరాజు గారు డాన్స్ చేసింది వెళ్ళిపోయింది. మనకు సంబంధించిన రహస్యాలు తన దగ్గర లేకుండా ఉంటే చాలు అని రంగరాజు అంటాడు. కానీ ఆమె కాన్ఫిడెన్స్ చూస్తే మన సాక్షాలు ఉన్నాయేమో అనిపిస్తుంది అని వైజయంతి అంటుంది. పోలీస్ బుద్దే అంత అమ్మ ఏ సాక్షాలు లేకపోయినా బెదిరించి నిజాలు చెప్పాలని శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటారు అయినా మనం భయపడకూడదు అని రంగరాజు అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode Dececber 01 2023 Episode 88 Highlights
Paluke Bangaramayenaa Today Episode Dececber 01 2023 Episode 88 Highlights

మంచి వాళ్ళని భయపెట్టో బెదిరించో కంట్రోల్ చేయొచ్చు చెడ్డవాళ్లను వాళ్ళ లెక్కల్లోనే దారులోకి తెచ్చుకోవచ్చు కానీ ఇది ఎలాంటిదో అర్థం కావట్లేదు అప్పుడే స్ట్రిక్ట్ అనిపిస్తుంది మళ్ళీ అప్పుడే తింగరిది అనిపిస్తుంది అని వైజయంతి చెప్తుంది. ఇలాంటి తిక్కలు వాళ్లకైనా కొన్ని లెక్కలు ఉంటాయి అని రంగరాజు అంటాడు. నా భయం అది మనల్ని ఏం చేస్తుందో అని కాదు రంగరాజు గారు ఈ విషయాలన్నీ పార్టీ వాళ్లకు ఎక్కడ తెలుస్తాయి అని వైజయంతి అంటుంది. ఇలాంటి వాళ్లను నా సర్వీస్ లో ఎంత మందిని చూసి ఉంటాను అని అంటాడు రంగరాజు. ఇంతలో కరున వచ్చి ఎంతమందిని చూసి ఉంటారు అని అడుగుతుంది.

Paluke Bangaramayenaa Today Episode Dececber 01 2023 Episode 88 Highlights
Paluke Bangaramayenaa Today Episode Dececber 01 2023 Episode 88 Highlights

నువ్వు చెప్పింది కరెక్టే ఈవిడని అంచనా వేయడం కష్టమే అని చెవిలో చెప్తాడు రంగరాజు. నాయుడు గారు మంచిగానే సంపాదించినట్టు ఉన్నారు కదా అని అడుగుతుంది కరుణ.ఎక్కడ సంపాదించారండి అంతా ప్రజలకే ఖర్చు పెట్టారు అని చెప్తుంది వైజయంతి. మీకు ఇది కొంచెం ఓవర్గా అనిపించడం లేదు నేను మీడియాని కాదు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కాబట్టి సుత్తి లేకుండా మాట్లాడుకుందాం అని అంటుంది కరుణ. ఈ మిడిల్ క్లాస్ లైఫ్ బోర్ కొట్టేసింది కొంచెం లగ్జరీగా బతకాలనిపిస్తుంది అని అంటుంది కరుణ. మేడం మీరు అలా అనుకోవడంలో తప్పేం లేదు మీకు అర్హత ఉంది అని అంటాడు రంగరాజు.

Paluke Bangaramayenaa Today Episode Dececber 01 2023 Episode 88 Highlights
Paluke Bangaramayenaa Today Episode Dececber 01 2023 Episode 88 Highlights

ఇదిగో చూడండి మేడం మీకు 5 ఇస్తాము అని రంగరాజు అంటాడు. సరే మీరంతా ప్రేమగా ఇస్తున్నారు కాబట్టి వద్దని నేను అనను అని అంటుంది కరుణ. ఐదు కోట్లు నా బ్యాంకు లోకి వేసేయండి అని అంటుంది కరుణ. మేడం మీకు 10 కోట్లు ఇస్తాము ఫైనల్ గా సరేనా మీరు తీసుకుంటున్నారు. మీరు మరీ బలవంతం చేస్తున్నారు చెప్పిన గాని ఇలాంటివన్నీ నచ్చవని, ఇప్పుడు ఈ డబ్బులు ఈరోజు ఉంటాయి రేపు ఖర్చయిపోతాయి రంగరాజు అదే ప్రాపర్టీ అయితే అలా పడి ఉంటుంది కదా పైగా ల్యాండ్ రేట్లు పెరిగిపోతున్నాయి ఈ మధ్య, నాకు ఒక ఫామ్ హౌస్ కావాలి అది కూడా వరంగల్లో అని అడుగుతుంది కరుణ. మేడం దాని విలువ 25 కోట్లు మేడం అని అంటాడు రంగరాజు. ఇప్పుడు నేను కేసు పెడితే చిప్పకూడు తింటూ ఊసలు లేక పెట్టాలి అని కరుణ అంటుంది. నేను పదవిలోకి వచ్చాక ముందు దీని అంతు చూస్తాను అని వైజయంతి అంటుంది.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella