NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Michaung Cyclone: దిశ మార్చుకున్న మిచౌంగ్

Michaung Cyclone:  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడిన మిచౌంగ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చుపుతోంది. తుఫాను కారణంగా ఏపితో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిచౌంగ్ తుఫాను హఠాత్తుగా దిశ మార్చుకుంది. ప్రస్తుతం సూళ్లూరుపేట వద్ద కేంద్రీకృతం అయ్యింది. దీంతో సూళ్లురుపేట ఇప్పటికే జలదిగ్భంధంలో చిక్కుకుంది. రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల లోపు నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం అందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లా మనుబోలు, కలువాయి, నెల్లూరులో విపరీతమైన ఈదురు గాలులతో భారీ వర్షం పడుతోంది.

ఇవేళ అర్ధరాత్రి లోపు నెల్లూరు – కావలి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. మిచాంగ్ తుఫాన్ తీరం దాటిన తర్వాత ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా పయనించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తొలుత మచిలీపట్నం వద్ద తీరం దాటుతుందని భావించారు. కానీ ఇది ఆకస్మాత్తుగా తన దిశ మార్చుకొని నెల్లూరు – కావలి మధ్యలో తీరం దాటే పరిస్థితి ఉందని వాతావరణ శాక అధికారులు చెబుతున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వెల్లడించింది.

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో రాబోయే రెండు రోజులు ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరిస్తొంది. మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బాపట్ల చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. 14 పునరావ కేంద్రాలను 800మందిని తరలించారు. 43 తుఫాను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు 350 మంది గజ ఈతగాళ్లను సిద్దం చేశారు. నిజాంపట్నం హార్బర్ లో పదవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.

Michaung Cyclone: మిచౌంగ్ తుఫాను .. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్

Related posts

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju