NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili December 08 2023 Episode 515: గౌతమ్ గీసిన లక్ష్మణ రేఖ దాటి మల్లి బర్త్డేకి వస్తుందా లేదా?.

Malli Nindu Jabili Today Episode December 08 2023 Episode 515 Highlights

Malli Nindu Jabili December 08 2023 Episode 515: బర్త్డే బాయ్ ని పిలవండి లేటవుతుంది కేక్ కట్ చేయాలి అని కౌసల్య అంటుంది. మాలిని అరవింద్ త్వరగా రండి అందరు మీకోసం కింద వెయిట్ చేస్తున్నాం అని శరత్ పిలుస్తాడు. కట్ చేస్తే,భద్ర నేలకొండపల్లి నుంచి బయలుదేరిన ఆఫీసర్ ఎక్కడ దాకా వచ్చాడు అని వసుంధర అడుగుతుంది. బయలుదేరాడు మేడం ఇంకా అరగంటలో వచ్చేస్తాడు అని భద్ర చెప్తాడు. తనని ఫాలో అయ్యి ఇక్కడికి తీసుకురా అని  వసుంధర చెప్తుంది. గౌతమ్ బాగానే ఉన్నావా నిన్న కోపంగా ఉన్నావు కదా సెట్ అయిందా అని కౌసల్య అడుగుతుంది. బాగానే ఉన్నాను అమ్మ కొన్ని అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి అని గౌతమ్ అంటాడు.  ఎంతటి ప్రాబ్లం నైనా సులువుగా తీర్చుకోగల సమర్ధుడు ఇక మనమేం చేస్తాం అని వసుంధర అంటుంది. ఎలాంటి సమస్య అయినా పంచుకుంటేనే తెలుస్తుంది సమర్థవంతుడని వదిలేస్తే ఎలా అని శారద అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 08 2023 Episode 515 Highlights
Malli Nindu Jabili Today Episode December 08 2023 Episode 515 Highlights

మనం పార్టీ మూడ్లో ఉన్నాం వేరే విషయాలు వద్దు అని గౌతమ్ అంటాడు. కట్ చేస్తే, ఇంతలో మాలిని అరవింద్ కిందికి వస్తారు. త్వరలో మనవడిని ఇవ్వబోతున్నావంట గుడ్ న్యూస్ తెలిసింది అని కౌసల్య అడుగుతుంది. ముందు మాలిని మా ఇంటికి వారసున్ని ఇస్తుంది తర్వాత మల్లి మీ ఇంటికి మనుమనో మనవరాలునో ఇస్తుందిలే వదిన అని వస్తుందర అంటుంది. నీ నోటి చలవ వల్లన అలా జరిగితే మాకు సంతోషమే కదా వసుంధర అని కౌసల్య అంటుంది. అదేంటి గౌతమ్ నేనిచ్చిన డ్రెస్ వేసుకోలేదు మల్లి ఇవ్వలేదా అని అంటుంది మాలిని. తీసుకొచ్చింది అని గౌతమ్ అంటాడు. మాలిని ఎంతో ప్రేమగా ఇచ్చింది ఎందుకు వేసుకోలేదు అని శరత్ అంటాడు. నాకు ఇది కంఫర్ట్ గా ఉంది అందుకే వేసుకోలేదు అని గౌతమ్ అంటాడు. నువ్వు వేసుకున ని అన్నావు అంటే ఏదో ఉంది అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 08 2023 Episode 515 Highlights
Malli Nindu Jabili Today Episode December 08 2023 Episode 515 Highlights

ఏమీ లేదు అత్త వదిలేయ్ అని గౌతమ్ అంటాడు. అందరమూ ఉన్నాము మల్లి ఎది అని కౌసల్య అడుగుతుంది. బాబు మల్లేది అని శారద అడుగుతుంది. పైన గదిలో ఉందేమో తనకేదైనా ప్రాబ్లం ఏమో మనం కేక్ కట్ చేద్దామా అని గౌతమ్ అంటాడు. మీరా నువ్వు వెళ్లి మల్లి ని తీసుకురా అని శారదా అంటుంది. గౌతమ్ నీ కూతురికి లక్ష్మీనరేఖ గీశాడు మీరా నువ్వు పిలిచినా తను రాదు అని వసుంధర మనసులో అనుకుంటుంది. పుట్టినరోజు దగ్గరికి అందరూ వచ్చేసారు మల్లి నువ్వు గదిలో ఉండి ఏం చేస్తున్నావ్ అని మీరా అడుగుతుంది. నేను రానమ్మ అని మల్లి అంటుంది. ఈ ఫంక్షన్ కి వచ్చారు కదా రాను అంటావేంటి అని మీరా అడుగుతుంది.నేను తర్వాత వస్తాను నువ్వు వెళ్ళమ్మా నేను చెప్పేది వినమ్మ అని మల్లి అంటుంది. నీకు అల్లుడు గారికి ఏదైనా గొడవ జరిగిందా అని మీరా అడుగుతుంది. అదేమీ లేదమ్మా అని మల్లి అంటుంది. అది కాదమ్మా అని మీరా అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 08 2023 Episode 515 Highlights
Malli Nindu Jabili Today Episode December 08 2023 Episode 515 Highlights

నేను చెప్పేది విను అమ్మ నువ్వు వెళ్ళు అని మీరా అని బయటికి నెట్టేసి డోర్ పెట్టుకుంటుంది మల్లి.ఏమీ లేదని నువ్వు అంటున్నావు కానీ ఏదో అయ్యింది అమ్మ దగ్గర చెప్పుకోలేని విషయమా అది నాకు చెప్పకుండా నువ్వు బాధపడితే నాకు కష్టంగా అనిపిస్తుంది అని మీరా అంటుంది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లకపోతే నా మీద ఒట్టే అని మల్లి అంటుంది. మీరా బాధపడుకుంటూ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఈరోజు నేను గీసిన గీత దాటితే మల్లి పరిస్థితి రేపటి నుంచి వేరే విధంగా ఉంటుంది అని గౌతమ్ అనుకుంటాడు. వదిన ఎందుకు రాలేదు నేను వెళ్లి అడిగి రానా అని నీలిమా అంటుంది. తల్లి వెళ్ళింది కదా తీసుకొస్తుందిలే నువ్వెందుకు కంగారు పడతావు అని వసుంధర అంటుంది. మీరా బాధపడుతూ కిందికి వస్తుంది. మల్లి ఏది అని కౌసల్య అడుగుతుంది. ఏమైందో అమ్మ రానంటుంది అని మీరా అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 08 2023 Episode 515 Highlights
Malli Nindu Jabili Today Episode December 08 2023 Episode 515 Highlights

నువ్వు పిలిచిన తర్వాత రానునటం ఏంటి అని కౌసల్య ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇందాకటిదాకా ఇక్కడ ఉండి అన్ని చూసుకొని ఇప్పుడు ఎందుకు రానంటుంది అని శారద అంటుంది. గౌతమ్ ఎందుకు మౌనంగా ఉన్నాడో ఈ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదో నాకు అర్థం కావట్లేదు అని వసుంధర అంటుంది. నేనెందుకు రావద్దంటానత్తా అని గౌతమ్ ఉంటాడు. మల్లి నీ గౌతమ్ ఏదో అని ఉంటాడు అందుకే రావట్లేదు అని అరవింద్ అనుకుంటాడు. గౌతమ్ నువ్వు వెళ్లి తీసుకురా అని కౌసల్య అంటుంది. రావద్దని వార్నింగ్ ఇచ్చి వస్తాను అని గౌతమ్ పైకి వెళ్తాడు. గౌతమ్ నేను కూడా వస్తాను పద అని మాలిని అంటుంది. నువ్వెందుకు నేను వెళ్తానులే అని గౌతమ్ అంటాడు. మల్లి దేనికైనా అలిగిందేమో నేను అడిగి తెలుసుకుంటాను అని మాలిని అంటుంది. చేసేదేమీ లేక మాలిని తీసుకొని పైకి వెళ్తాడు గౌతమ్. మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను నేలకొండపల్లి నుంచి అరవింద్ బర్త్ డే కి ఒక్క గెస్ట్ వస్తున్నాడు ఆగస్టు పేరు సుబ్రహ్మణ్యం అని వసుంధర చెప్తుంది. బయట వాళ్లని ఎవ్వరిని మనం పిలవలేదు కదా అత్తయ్య ఆయన ఎందుకు వస్తున్నారు అని అరవింద్ అడుగుతాడు. ఆయన నీకు బాగా పరిచయం అంట కదా తెలుసుకొని వస్తున్నాడు అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 08 2023 Episode 515 Highlights
Malli Nindu Jabili Today Episode December 08 2023 Episode 515 Highlights

ఆయన ఇక్కడికి వస్తే అరవింద్ బాబు పక్కన మల్లి ఉండాలి మల్లి అలా ఉంటే గౌతమ్ బాబుకి కోపం వస్తుంది ఇప్పుడు ఎలా అని మీరా టెన్షన్ పడుతుంది. కట్ చేస్తే, మల్లి డోర్ ఓపెన్ చెయ్ అని గౌతమ్ అంటాడు. మల్లి డోర్ తీస్తుంది. మల్లి రాను అన్నావంట ఏమైంది అని మాలిని అడుగుతుంది. నేను రాను మీరు వెళ్ళండి అక్క అని మల్లి అంటుంది. అందరం నీకోసం అక్కడ ఎదురు చూస్తుంటే నువ్వు రానంటావ్ ఏంటి అని మాలిని అంటుంది. తలనొప్పిగా ఉందా ఒంట్లో బాగోలేదా ఏంటి నీ ప్రాబ్లం ఏదైనా ఉంటే బయటికి చెప్పుకుంటే నే కదా మాకు అర్థమవుతుంది మీ అమ్మ వచ్చి పిలిచినా రానన్నావంట మీ అమ్మ మాటను కూడా కాదన్నావంటే ఏమైంది నీకు అని గౌతమ్ ఏమీ తెలియనట్టు అడుగుతాడు. ఏమీ కాలేదండి అక్కడికి వచ్చే ఇంట్రెస్ట్ లేదు అని మల్లి అంటుంది. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఏదో జరిగింది మల్లి మీ అక్కకు చెప్పకూడదా నాతో చెప్పు ఏదైనా సరే తీరుస్తాను అని మాలినిఅంటుంది. తనకేదైనా ప్రాబ్లం ఉంటే నేను తీరుస్తాను కదా మాలిని నీదాకా ఎందుకు రానిస్తాను అని గౌతమ్ అంటాడు.

మల్లి సమాధానం చెప్పకుండా ఉండదు మల్లి నీ మాట్లాడనివ్వకుండా చేసింది నువ్వే అనిపిస్తుంది తను ఎందుకు భయపడుతుంది గౌతమ్ ఏమన్నావ్ అని మాలిని అడుగుతుంది. ఏమీ కాలేదు అక్క అని మల్లి అంటుంది. నేను నిన్ను అడగలేదు గౌతమ్ నువ్వు చెప్పు ఏమైంది అని గట్టిగా అడుగుతుంది మాలిని. మల్లిని నేను ఎంతగా ప్రేమిస్తానో మీ అందరికీ తెలుసు మల్లిని నేను ఎందుకు అంటాను అని గౌతమ్ అంటాడు. నువ్వు అబద్దం చెప్తున్నావ్ గౌతమ్  అని మాలిని అంటుంది. అంటే మల్లి అబద్ధం చెప్పదా అని గౌతమ్ అంటాడు. తను ఎప్పటికీ అబద్ధం చెప్పదు ఎందుకంటే తను మా దగ్గర చానల్ ఉంది తనేంటో నాకు తెలుసు అని మాలిని అంటుంది. నేను అబద్ధం చెప్తున్నాను మల్లి నిజం చెప్పుదా మల్లి అంతా అబద్ధం చెప్తుంది అని గౌతమ్ గట్టిగా అరుస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri