NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: తుఫాను బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చిన సీఎం వైఎస్ జగన్

CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మిచౌంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే చేశారు. ముందుగా తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం వద్ద స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతులను పరామర్శించారు.

తర్వాత బుద్దాంలో దెబ్బదిన్న వరి పంటను పరిశీలించి రైతులతో ముఖాముఖి సమావేశమైయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ .. తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తుఫాను కారణంగా నాలుగైదు రోజుల్లో భారీ వర్షం కురిసిందన్నారు. మనకు వచ్చిన కష్టం.. నష్టం వర్ణణాతీతమని అన్నారు. వరుసగా వర్షాలు పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.

సాయం కోసం 92 రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు సీఎం జగన్. 60వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికీ రూ.2500లు ఇస్తున్నామనీ, ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వమని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మనకు వాలంటీర్ల వ్యవస్థ ఉందనీ, వాలంటీర్ ప్రతి ఇంటికి వచ్చి రూ.2,500లు ఇస్తారని చెప్పారు. పంట నష్టంపైనా ఏ ఒక్కరూ బాధపడాల్సిన అవసరం లేదని అన్నారు.

స్వర్ణముఖి పై హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణానికి హామీ ఇచ్చారు జగన్. హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ.30కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారనీ, నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. రోడ్లు, ట్యాంక్ ల మరమ్మత్తులకు రూ.32 కోట్ల ప్రపోజల్స్ వచ్చాయన్నారు. వీటిని యుద్ద ప్రాతిపదికన మొదలు పెట్టేంచే కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ ప్రభుత్వం మీది అన్నది గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికైనా మంచే జరుగుతుంది తప్ప చెడు అనేది ఎప్పుడూ జరగదని అన్నారు.

వారంలో అందరికీ సాయం అందుతుందని తెలిపారు సీఎం జగన్. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని చెప్పారు. రోడ్లను పునరుద్దరించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తుఫాను బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, కాకాణి గోవర్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ అభినందన ట్వీట్ కు తెలంగాణ సీఎం రేవంత్ ఎలా స్పందించారంటే..?

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N