NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: చంద్రబాబుకు షాకిచ్చేలా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan made a key statement on alliances

Pawan Kalyan: జనసేన – టీడీపీ పొత్తు ధర్మంపై పవన కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించడం లేదన్న అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. శుక్రవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఆవిష్కరించారు.

Pawan Kalyan made a key statement on alliances
Pawan Kalyan

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండపేటలో చంద్రబాబు టీడీపీ అభ్యర్ధిని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తుతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే సీట్ల సర్దుబాటుపై ఇంత వరకూ రెండు పార్టీల మధ్య ఇంకా అవగాహన కుదరలేదు. జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ ఆ పార్టీతో సంప్రదించకుండా ఇటీవల చంద్రబాబు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట టీడీపీ అభ్యర్ధిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును ప్రకటించారు.

ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పుడు వ్యతిరేకించారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించాలి కానీ విస్మరించి అభ్యర్ధులను ప్రకటించిందన్నారు. ఇది పొత్తు ధర్మం ఎలా అవుతుందని పవన్ ప్రశ్నించారు. 50- 7-0 సీట్లు తీసుకోవాలని కొందరు చెబుతుంటే అవి తనకు తెలియనవి కావని పవన్ అన్నారు. బలం ఇచ్చే వాళ్లం అవుతున్నాం కానీ తీసుకునే వాళ్లం కాలేకపోతున్నామని అన్నారు. ఏమీ తెలియకపోతే తాను రాజకీయాల్లోకి ఎలా వస్తానని ప్రశ్నించారు.

జనంలో తిరగడని, సమస్యలు తనకు తెలియవని విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇద్దరు వ్యక్తులు కలవడం కష్టమని, కానీ విడదీయడం సులభమని అన్నారు. తాను కలిసి ఉండటానికే ఇష్టపడతానని అన్నారు. నిర్మించడమంటే ఇష్టపడతానని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో సీఎం జగన్ పై కూడా విమర్శలు చేశారు. 22 దళిత పథకాలను తీసేసిన జగన్, అంబేద్కర్ విగ్రహం పెట్టారని ఎద్దేవా చేశారు.

జగన్ జనం ముఖ్యమంత్రా..? లేక సారాయి వ్యాపారా..? అని ప్రశ్నించారు. అధికారంలో వస్తామో లేదో తెలియదని, ఊరంతా శత్రువులు ఉన్న జగన్ తో వైసీపీ నైతలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు అయితే వస్తాయి కానీ అధికారం వస్తుందన్న గ్యారంటీ లేదని పవన్ అన్నారు.

Tamilisai: నియంతృత్వ వైఖరిని సమాజం సహించదు – గవర్నర్ తమిళిసై

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N