NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Union Budget 2024: ఏపీలో రైల్వే అభివృద్ధికి బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయింపు

Union Budget 2024:  2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని ముందుగా భావించారు కానీ ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో ఆశించిన మేర కేటాయింపులు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే తాత్కాలిక బడ్జెట్ లో రైల్వే అభివృద్ధికి ఏపీకి రూ.9,138 కోట్లు, తెలంగాణకు రూ.,5,071 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి రాకముందు 2009 నుండి 2014 వరకూ ఉమ్మడి ఏపీలో రైల్వే అభివృద్ధికి 886 కోట్ల నిధులు ఇవ్వగా, ప్రస్తుత బడ్జెట్ లో ఒక్క ఏపీకే రూ.9,138 కోట్లు కేటాయించామని తెలిపారు.

ఆంధ్రాలో ఏడాదికి 240 కిలో మీటర్ల మేర నూతన ట్రాక్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. 98 శాతం లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటునకు 53 ఎకరాల భూమిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరామనీ, అయితే ప్రభుత్వం ఇంకా భూమి అప్పగించలేదని చెప్పారు. జోన్ ఏర్పాటునకు డీపీఆర్ సిద్దమైందని, భూమి ఇస్తే పనులు ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

తెలంగాణలో రైల్వేల కోసం రూ.5,071 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో వంద శాతం విద్యుదీకరణ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. గత పదేళ్లలో వివిధ చోట్ల 414 ఫ్లైఓవర్లు, అండర్ పాసేజ్ లు నిర్మించినట్లు చెప్పారు. రైల్వేపై రాష్ట్రంలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఖాజీపేట కోచ్ ప్యాక్టరీకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి .. పనులు జరుగుతున్నట్లు తెలిపారు.

AP Assembly: ఈ నెల ఐదో తేది నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N