NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ ఆయువుప‌ట్టుపై గురి చూసి కొట్టిన జ‌గ‌న్‌… వ‌ర్క‌వుట్ అయితే మ‌ళ్లీ ప‌క్కా సీఎం..!

ఎస్ టీడీపీ ఆయువుప‌ట్టుపై జ‌గ‌న్ గురి చూసి కొట్టేశారు.. చాలా బ‌లంగా కొడుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే ర‌క‌ర‌కాల సోష‌ల్ ఇంజ‌నీరింగ్ ప్ర‌య‌త్నాల‌తో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ఇప్పుడు జ‌రిగే ఎన్నిక‌ల్లో సంక్షేమంతో పాటు భ‌యంక‌ర‌మైన సామాజిక ఈక్వేష‌న్ల‌తో ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలోకి దిగుతున్నారు. రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ ఆవిర్భావం నుంచి మంచి బ‌లం ఉంది. గుంటూరు నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు టీడీపీకి ప‌ట్టుంది.

2014లో టీడీపీ గెలిచిన‌ప్పుడు కూడా గుంటూరు నుంచి ఆ పార్టీ శ్రీకాకుళం వ‌ర‌కు ఎక్కువ సీట్లు గెలిచి అధికారంలోకి వ‌చ్చింది. ఈ ప్రాంతంలో బ‌లంగా ఉన్న బీసీలు ముందు నుంచి టీడీపీకి వెన్నుద‌న్నుగా నిలుస్తున్నారు. ఈ సారి టీడీపీ బీసీ ఆయువుప‌ట్టు మీద దెబ్బ‌కొట్టేలా జ‌గ‌న్ ప్లానింగ్ ఉంది. శ్రీకాకుళం పార్ల‌మెంటు సీటుతో స్టార్ట్ చేసి కోస్తా జిల్లాల్లో ఒక‌టి రెండు సీట్లు మిన‌హా అన్ని పార్ల‌మెంటు సీట్లు బీసీల‌కే ఇచ్చేశారు.

శ్రీకాకుళంలో పేరాడ తిల‌క్ ( కాళింగ‌), విజ‌య‌న‌గ‌రంలో మ‌జ్జి శ్రీనివాస‌రావు ( తూర్పుకాపు), విశాఖ‌లో బొత్స ఝాన్సీ ( తూర్పు కాపు), రాజ‌మండ్రి, న‌ర‌సాపురం సీట్లు బీసీల్లో బ‌ల‌మైన శెట్టిబ‌లిజ వ‌ర్గానికి చెందిన గూడూరి శ్రీనివాస్‌, గూడూరి ఉమాబాల‌కు ఇచ్చారు. ఏలూరు నుంచి యాదవ వ‌ర్గానికి చెందిన కారుమూరి సునీల్‌కు సీటు ఇచ్చారు. న‌ర‌సారావుపేట సీటును కూడా యాద‌వ వ‌ర్గానికే చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్‌కు ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి చూస్తే రిజ‌ర్వ్‌డ్ పార్ల‌మెంటు సీట్ల‌ను వ‌దిలేస్తే కాకినాడ‌లో కాపు వ‌ర్గానికి చెందిన చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్‌, అవ‌నిగ‌డ్డ‌లో కాపు కోటాలో సింహాద్రి ర‌మేష్‌, విజ‌య‌వాడ‌లో క‌మ్మ వ‌ర్గం నుంచి కేశినేని నాని మిన‌హా మిగిలిన అంద‌రూ బీసీ ఎంపీ క్యాండెట్లే.

కేశినేని నాని పార్టీలోకి రావ‌డంతో అక్క‌డ ఆయ‌న‌కు సీటు ద‌క్కిందే త‌ప్పా కేశినేని టీడీపీలోనే ఉండి ఉంటే ఆ సీటును కూడా బీసీల్లో మ‌రో వ‌ర్గం అయిన గౌడ వ‌ర్గానికి ఇవ్వాల‌ని జ‌గ‌న్ ఫిక్స్ అయిపోయారు. ఇక అనంత‌పురం జిల్లాలో అనంత‌పురం, హిందూపురం రెండు సీట్ల‌తో పాటు క‌ర్నూలు జిల్లాలో క‌ర్నూలు బీసీ, నంద్యాల మైనార్టీల‌కు ఇవ్వ‌నున్నారు. ఇక గుంటూరు పార్ల‌మెంటు సీటును కూడా కాపు వ‌ర్గానికే చెందిన ఉమ్మారెడ్డి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు ఇచ్చారు.

ఓవ‌రాల్‌గా చూస్తే కోస్తా జిల్లాల్లో టీడీపీకి ఆయువు ప‌ట్టుగా ఉండే బీసీల‌ను చీల్చ‌డం లేదా బీసీలను మెజార్టీ త‌న వైపున‌కు తిప్పుకునేలా జ‌గ‌న్ వేసిన సోష‌ల్ ఇంజ‌నీరింగ్ ఎత్తుగ‌డ మామూలుగా లేదు. జ‌గ‌న్ దెబ్బ‌కు ఇప్పుడు చంద్ర‌బాబు కూడా సంప్ర‌దాయంగా త‌న వ‌ర్గానికి కేటాయిస్తోన్న కొన్ని పార్ల‌మెంటు సీట్ల‌ను ఇప్పుడు బీసీల‌కు ఇస్తోన్న ప‌రిస్థితి. ఈ బీసీ మంత్రం వ‌ర్క‌వుట్ అయితే మ‌రోసారి జ‌గ‌న్ సీఎం కుర్చీలో కూర్చోవ‌డం ప‌క్కా..!

Related posts

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?