Keerthi Suresh: రాధిక ఆప్టే ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బోల్డ్ పాత్రలను కూడా బోల్డంత ఇష్టంతో నటించే ముద్దుగుమ్మ మన టాలీవుడ్ లో ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా రాధిక ఆప్టే పేరే వినిపిస్తుంది. ఇక మరో పక్క కీర్తి సురేష్ సైతం మహానటిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఎటువంటి పాత్ర అయినా ఆమె ఎంచుకున్న దానికి న్యాయం చేస్తుంది కీర్తి. ఇక టాలెంట్ కి కేరాఫ్ అడ్రస్ అయినా ఈ ఇద్దరు కలిసి నటిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇక అది సినిమా కాదు ఓ వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ పేరు అక్క. ఆదిత్య చోప్రా నిర్మాణం వ్యవహరిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో రాధిక ఆప్టే కి కీర్తి సురేష్ చెల్లెలు అవుతుంది. రాధిక ఆప్టే లాంటి అక్క ఉన్న కీర్తి సురేష్ లాంటి అమ్మాయి ఆమె కోసం ఏం చేసింది అనేదే ఈ వెబ్ సిరీస్ కథాంశం.
మరి ఆ అక్క కోసం ఈ చెల్లెలు ఏం చేసిందో చూడాలి. ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్లో వెబ్ సిరీస్ తెరకెక్కడంతో ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక పక్క బోల్డ్ ముద్దుగుమ్మ మరోపక్క మహానటి సావిత్రి డుబ్. ఇక ఈ వెబ్ సిరీస్ పక్క హిట్ అయ్యే లాగానే కనిపిస్తున్నాయి. ఇక ఈ వెబ్ సిరీస్ గురించి మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.