NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema February 17 2024 Episode 549: పద్మావతి కోసం వచ్చిన విక్కి.. ఇది నిజమైన ప్రేమంటే..

Nuvvu Nenu Prema Today Episode  February 17 2024 Episode 549 Highlights

Nuvvu Nenu Prema February 17 2024 Episode 549  పద్మావతి వికీతో సారు నేను ఎప్పుడూ మీకు నచ్చే పని చేయటం నాకు చాలా ఇష్టం సార్. మీకు నచ్చిన పనిలే చేస్తాను. మీకు హాని కలిగించే పనులు నేనేమీ చేయను అని పద్మావతి అంటుంటే.. విక్కి నవ్వుకుంటాడు. అంతలోకి రమేష్ చంద్ర అక్కడికి వస్తారు. సార్ ఆయన్ని కూడా మీరు క్షమించవచ్చు కదా.. మీ అమ్మ మిమ్మల్ని ఎప్పుడు హీరో లాగా చూడాలని అనుకుంటుంది. హీరో అంటే తనకు ఇష్టం లేని పనులను కూడా ఎదుటివారి సంతోషం కోసం చేయాలి మీరు ఆయన్ని నాన్నగారు స్వీకరించండి అని పద్మావతి అడుగుతుంది. కానీ విక్కీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు సరిగ్గా అదే సమయానికి అక్కడికి సాధువు వస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode  February 17 2024 Episode 549 Highlights
Nuvvu Nenu Prema Today Episode  February 17 2024 Episode 549 Highlights

విక్కీ వాళ్ళింటికి అనుకోకుండా ఆ సాధువు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యంగాను షాక్ లో ఉండిపోతారు. మీరు మా ఇంటికి రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని నారాయణ అడగగా.. అప్పుడు ఆ సాధువు ఇంట్లో అందరూ ఉన్నట్టే ఉంటారు. కానీ ఎవరు కలిసి ఉండరు. మనసులో లేనిపోని భయాలు బాధలు ఉంటాయి అవన్నీ తొలగిపోవాలంటే పద్మావతి వికీ ఇద్దరూ కలిసి శివుడికి కళ్యాణం చేయాలని చెబుతాడు. లేకపోతే ఇంట్లో చూడరాని కష్టాలు చూడవలసి వస్తుంది అని ఆయన చెబుతాడు. అప్పుడు అరవింద తప్పక చేపిస్తాము అని చెప్పబోతుంది. ఇక విక్కీ పద్మావతితో కలిసి పూజ చేయడానికి ఒప్పుకుంటారా అని అడిగేలోపే అక్కడ నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు ఇక విక్కీతో కలిసి పద్మావతి పూజ చేసినట్లే అని కుశల అంటుండగా ఆయన్ని నేను ఒప్పిస్తాను అని పద్మావతి వికీ గదిలోకి వెళ్తుంది.

Nuvvu Nenu Prema Today Episode  February 17 2024 Episode 549 Highlights
Nuvvu Nenu Prema Today Episode  February 17 2024 Episode 549 Highlights

సారు ఇందాక సాధు చెప్పింది విన్నారు కదా .. మనిద్దరం కలిసి ఆ శివుడికి పూజ చేద్దాము ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని పద్మావతి అంటుంది. కానీ విక్కీ మాత్రం పద్మావతి మాటలని అస్సలు పట్టించుకోడు నాకు ఆ పూజ కంటే ఇంకా ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. నేను పూజలో కూర్చోవడం కుదరదు నేను ఆఫీస్ కి వెళ్తాను అని విక్కి చెబుతాడు. కానీ మనిద్దరం కలిసి పూజ చేయాలి అని పద్మావతి అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode  February 17 2024 Episode 549 Highlights
Nuvvu Nenu Prema Today Episode  February 17 2024 Episode 549 Highlights

పద్మావతి శివ పూజకి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తుంది. హోమానికి కావలసిన మిగతా వస్తువులన్నింటినీ తెప్పించి ఇల్లంతా అందంగా అలంకరించి ఉంటుంది. అసలు విక్కీ ఒప్పుకున్నాడా నువ్వు ఇవన్నీ చేస్తున్నావని కుచల పద్మావతిని ప్రశ్నిస్తుంది అదేంటి పిన్ని విక్కీ ఒప్పుకోకుండానే పద్మావతి ఏర్పాట్లు అన్ని చేసిందా అని అరవింద అడుగుతుంది. విక్కీ నిన్న ఏ ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయాడు కదా అంటే విక్కీ పూజ చేయడమే కదా అర్థం అని కుశల అంటుంది. అప్పుడు నారాయణ విక్కీ ఒప్పుకుంటాడులే అందరం కలిసి ఒప్పిదం అని అంటాడు అప్పుడు విక్కీ ఆఫీస్ కి వెళ్లడానికి కిందకు వస్తాడు సారు ఏంది ఇక్కడ పూజకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ జరిగితే మీరు ఆఫీస్ కి వెళ్తున్నారు. సాధువు చెప్పిన మాటలు మీరు మర్చిపోయారా ఈ ఇంట్లో మనందరం సంతోషంగా ఉండాలంటే ఆ పూజ చేయక తప్పదు ఆ పూజ మన ఇద్దరమే చేయాలి మీరు ఉండండి సారు అనే పద్మావతి విక్కిని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ నేను ఈ పూజ చేయను అని విక్కి వెళ్లిపోబోతాడు

Nuvvu Nenu Prema Today Episode  February 17 2024 Episode 549 Highlights
Nuvvu Nenu Prema Today Episode  February 17 2024 Episode 549 Highlights

అప్పుడు రమేష్ చంద్ర నా వల్లనే మీరు ఈ పూజ చేయడానికి ఒప్పుకోవడం లేదేమో దయచేసి అలా చేయొద్దు . ఈ పూజ జరిగితే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారని దయచేసి పూజ చేయడానికి ఒప్పుకోమని రమేష్ చంద్ర విక్కిని రిక్వెస్ట్ చేస్తాడు కానీ విక్కీ ఎవరి మాటలు వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పద్మావతి విక్కీ సారు పూజ సమయానికి కరెక్ట్ గా వస్తారు నేను ఆయన్ని నిజంగా ప్రేమిస్తున్న అని నిజం మా ఇద్దరి ప్రేమ నిజమైతే ఆయన సరిగ్గా పూజ సమయానికి వస్తాడు. మీరందరూ రెడీ అవ్వండి అని పద్మావతి అంటుంది

Nuvvu Nenu Prema Today Episode  February 17 2024 Episode 549 Highlights
Nuvvu Nenu Prema Today Episode  February 17 2024 Episode 549 Highlights

రేపటి ఎపిసోడ్ లో విక్కి పంచుకట్టుకోవడానికి పద్మావతి హెల్ప్ చేస్తూ ఉంటుంది అంటే విక్కి పూజ చేయడానికి వచ్చినట్లే కదా.. పద్మావతి అన్న మాటలు నిజమే. విక్కీకి పద్మావతి అంటే ఎనలేని ఇష్టం. అందుకే ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని విక్కీ ఆ పూజ చేయడానికి వస్తాడు.

Related posts

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri