NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema February 21 2024 Episode 552: విక్కి ప్రేమ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పద్మావతి.. ఒక్కటి కానివ్వని కృష్ణ

Nuvvu Nenu Prema Today Episode February 21 2024 Episode 552 Highlights

Nuvvu Nenu Prema February 21 2024 Episode 552: విక్కి తో పంతులు గారు అయ్యా మీ నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి, ఆయన కూడా ఆ సంకల్పం చెప్పుకుని పూజ చేస్తే ఇంకా ఈ పూజ సిద్ధిస్తుంది అని చెబుతాడు. అప్పుడు రమేష్ చంద్ర ఆ పాలు చెంబు తీసుకుని నేను చాలా తప్పులు చేశాను. వాటిని నా పిల్లలు క్షమించి వల్లతోపటు నేను కూడా ఉండేలా చేయమని ఆ దేవుడ్ని వేడుకుంటాడు. ఆ మాటలు విన్న విక్కి వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటాడు. విక్కి వైపు చూస్తూ రమేష్ చంద్ర పాల చెంబు తీసుకోమని చెబుతాడు. తీసుకోండి బాబు అని పంతులు అనడంతో రమేష్ చంద్ర ఇచ్చిన పాల చెంబు తీసుకుని ఆ పాలతో శివ పూజ చేస్తారు.

Nuvvu Nenu Prema Today Episode February 21 2024 Episode 552 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 21 2024 Episode 552 Highlights

అందరూ కలిసి పోయారు అనుకున్న సమయంలో ఊహించని ప్రమాదం జరగాలి అప్పుడే కదా వీళ్ళందరూ నాశనం అవుతార నాకు అదే కావాలి అని కృష్ణ మనసులో అనుకుంటాడు. ఇప్పుడు నేను చేసే పని తో విక్కి పద్మావతి ఇద్దరు ఒకరికి ఒకరు దూరమవుతారు. ఆ మంటల్లో పడి కాలిపోతారు అని కృష్ణ మనసులో అనుకుంటాడు. పూజ నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇక ఇద్దరూ కలిసి ఆ హోమం గుండం చుట్టూ తిరగమని పంతులుగారు చెబుతారు. అప్పుడు విక్కి, పద్మావతి ఇద్దరు హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అప్పుడు పద్మావతి మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ.. అగ్నిసాక్షిగా మీరు నాకు మూడు ముళ్ళు వేశారు. మీతో కలిసి ఏడు అడుగులు వేసాను. ఇప్పుడు మరోసారి ఈ అగ్ని చుట్టూ మీతో కలిసి ఏడు అడుగులు వేస్తున్నాను. ఇప్పటివరకు నాపై ఉన్న అపనమ్మకాలు అయిష్టత అన్ని పోవాలి. నేను ఏ పని చేసినా మీకోసమే చేస్తాను. మీరంటే నాకు అంత ఇష్టం సారు. ఇప్పుడే మన ఇద్దరి మధ్య ఉన్న కలహాలు దూరమై పోయి ఇక్కడ నుంచి మనిద్దరం సంతోషంగా ఉండాలి అని పద్మావతి మనసులో అనుకుంటూ విక్కి తో పాటు కలిసి ప్రదక్షిణలు చేస్తుంది. ఇక నుంచి మన ఇద్దరికీ మంచే జరగాలి. నాపై మీకు ప్రేమ కలగాలి. మనిద్దరం కలిసి ఉండాలి. ఎప్పటికీ కలిసే ఉండాలి అని పద్మావతి మనసులో అనుకుంటూ హోమగుండం చుట్టూ విక్కీ తో పాటు కలిసి తిరుగుతుంది.

Nuvvu Nenu Prema Today Episode February 21 2024 Episode 552 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 21 2024 Episode 552 Highlights

అమ్మ ప్రదక్షిణలు పూర్తి చేశారు కదా, ఇక పూర్ణాహుతి చేసే సమయం ఆసన్నమైంది. మీరిద్దరూ ఆ పూర్ణాహుతి కి కావలసిన అన్ని తీసుకొని మీ మనసులో ఉన్న కోరికను ఆ దేవుడికి చెప్పుకోండి అని పంతులుగారు చెబుతారు. ఇద్దరు ఆ మూటను హోమ గుండం లో వేసి దండం పెట్టమని చెబుతారు. ఇప్పుడు మీ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని కృష్ణ మనసులో అనుకుంటాడు. పూర్ణాహుతి చేసే సమయంలో పెద్దగా మంట వస్తుంది. అప్పుడు పద్మావతి విక్కి కి అడ్డుగా వెళ్తుంది. దాంతో ఆ మంట పెద్దగా వచ్చి పద్మావతి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇందతా కృష్ణ ప్లాన్ అని ఎవరికి తెలీదు. పద్మావతీ కళ్లపై నీళ్ళు చల్లి లేపుతారు. సారు మీకు ఏం కాలేదు కదా, మీరు బాగానే ఉన్నారు కదా అని పద్మావతి విక్కి కి అడుగుతుంది.

Nuvvu Nenu Prema Today Episode February 21 2024 Episode 552 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 21 2024 Episode 552 Highlights

నేను బాగున్నా పద్మావతి నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతారు. ఇప్పటి నుంచి మీరు సంతోషంగా ఉంటారు అని పంతులు గారు పద్మావతి, విక్కి నీ దీవిస్తారు. ఆ తరువాత పద్మావతి, విక్కి నీ పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెబుతారు. ముందుగా విక్కి పద్మావతి, విక్కి నారాయణ, కుచల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తరువాత అరవింద దగ్గర విక్కి పద్మావతి, విక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. రమేష్ చంద్ర దగ్గర మాత్రం పద్మావతి ఆశీర్వాదం తీసుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode February 21 2024 Episode 552 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 21 2024 Episode 552 Highlights

పద్మావతి నిద్రపోతూ ఉండగా పద్మావతి చేతికి అయిన గాయం చూసి విక్కి బాధపడుతూ. పద్మావతి ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంది. కానీ తన గురించి నేను పట్టించుకోవడం లేదు అని తన చేతిని తన చేతుల్లోకి తీసుకొని గాయమైన చోట ఆయింట్మెంట్ రాస్తాడు విక్కి.. పద్మావతి తన కోసం ఏమైనా చేస్తుంది, నేను తనని బాగా చూసుకోవాలి అని విక్కి మనసులో అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode February 21 2024 Episode 552 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 21 2024 Episode 552 Highlights

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి ఉదయాన్నే లేచి రెడీ అవుతూ ఉండగా.. పద్మావతి రాత్రి కూడా ఏం తినలేదని తనకోసం విక్కి టిఫిన్ తీసుకుని వస్తాడు. ఏంది సార్ మీరు టిఫిన్ తెచ్చుకున్నారు. నేనున్నాను కదా మీకు టిఫిన్ తీసుకొస్తాను అని పద్మావతి అంటుంది. ఇది నాకోసం కాదు నీకు.. నాకా ఏంది సారు మీరు నాకోసం తెచ్చారా అని పద్మావతి అంటుంది. నిన్న రాత్రి కూడా ఏమి తినకుండా పడిపోయావు నీకోసమే ఈ టిఫిన్ తీసుకువచ్చాను. నువ్వు ముందు కూర్చొ అని పద్మావతిని కూర్చోబెట్టి టిఫిన్ తినిపిస్తాడు విక్కి. అప్పుడు పద్మావతి కన్నీళ్లు పెట్టుకుంది. ఏమైంది పద్మావతి ఇప్పుడు ఏమైంది అని విక్కి అడుగుతాడు. మీరు నా మీద ఇలా ప్రేమ చూపిస్తే చాలు సారు. నాకు ఇంకా ఏమీ వద్దు. మీరు ఉంటే చాలు నాకు ఇంకా ఏమీ వద్దు అని పద్మావతి ఎమోషనల్ గా మాట్లాడుతుంది.

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella