NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema Feburavy 22 2024 Episode 553: పద్మావతి ఫుల్ ఖుషి.. రమేష్ చంద్రను కాపాడిన విక్కీ..

Nuvvu Nenu Prema: పద్మావతి నిద్రపోతూ ఉండగా పద్మావతి చేతికి అయిన గాయం చూసి విక్కి బాధపడుతూ. పద్మావతి ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంది. కానీ తన గురించి నేను పట్టించుకోవడం లేదు అని తన చేతిని తన చేతుల్లోకి తీసుకొని గాయమైన చోట ఆయింట్మెంట్ రాస్తాడు విక్కి.. పద్మావతి తన కోసం ఏమైనా చేస్తుంది, నేను తనని బాగా చూసుకోవాలి అని విక్కి మనసులో అనుకుంటాడు. విక్కీ పద్మావతి చేతికి ఆయింట్మెంట్ రాసిన తర్వాత తను కూడా నిద్రపోతాడు. అప్పుడు పద్మావతి విక్కీ వైపు చూస్తుంది మళ్ళీ విక్కీ తన వైపు తిరిగి చూస్తున్నాడు అని తెలిసి పద్మావతి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది అప్పుడు పద్మావతి నిద్రపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. మీ నాన్న చివరి కోరికను కూడా నేను తీర్చాలి ఆయన్ను మీకు దగ్గరికి చేయాలి. మీ ప్రేమను ఆయనకు కూడా అందించాలి ఈ విషయంలో నన్ను క్షమించండి సారు అని పద్మావతి మనసులో విక్కికి క్షమాపణలు చెబుతుంది. మీరు ఎప్పటికీ నాతో ఇలాగే ప్రేమగా ఉండాలి అని పద్మావతి మనసులో అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Feburavy 22 2024 Episode 553 highlights
Nuvvu Nenu Prema Feburavy 22 2024 Episode 553 highlights

ఉదయనే నిద్రలేచిన విక్కీ వంటగదిలోకి వెళ్లి వంట మనిషితో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నేను టిఫిన్ చేస్తాను అని విక్కీ అంటాడు. సారు నేనున్నాను కదా చేస్తాను అని ఆ పనిమనిషి అంటే లేదు ఈరోజు పద్మావతి కోసం స్వయంగా నేనే టిఫిన్ చేస్తాను అని విక్కి కోట్ కూడా కట్టుకొని నీటుగా పద్మావతికి ఇష్టమైన దోసెలను వేస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు విక్కి పద్మావతి కోసం ఈ విధంగా మారిపోవటం చూసి.. విక్కి పద్మావతి కోసం దోశలు వేయడం చూసిన కుచల కుళ్ళుకుంటుంది. అరవింద మాత్రం విక్కీకి పద్మావతి అంటే చాలా ఇష్టం పిన్ని వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని అరవింద అంటుంది.
Nuvvu Nenu Prema Feburavy 22 2024 Episode 553 highlights
Nuvvu Nenu Prema Feburavy 22 2024 Episode 553 highlights

పద్మావతి ఉదయాన్నే లేచి రెడీ అవుతూ ఉండగా.. పద్మావతి రాత్రి కూడా ఏం తినలేదని తనకోసం విక్కి టిఫిన్ తీసుకుని వస్తాడు. ఏంది సార్ మీరు టిఫిన్ తెచ్చుకున్నారు. నేనున్నాను కదా మీకు టిఫిన్ తీసుకొస్తాను అని పద్మావతి అంటుంది. నీతో వచ్చిన చిక్కే ఇది పద్మావతి. ఇది నాకు కాదు నీ కోసమే తెచ్చాను అని విక్కి అంటాడు. అప్పుడు పద్మావతి సంతోషంగా ఇది నాకోసం కాదు నీకు.. నాకా ఏంది సారు మీరు నాకోసం తెచ్చారా అని పద్మావతి అంటుంది. నిన్న రాత్రి కూడా ఏమి తినకుండా పడిపోయావు నీకోసమే ఈ టిఫిన్ తీసుకువచ్చాను. నువ్వు ముందు కూర్చొ అని పద్మావతిని కూర్చోబెట్టి టిఫిన్ తినిపిస్తాడు విక్కి. అప్పుడు పద్మావతి కన్నీళ్లు పెట్టుకుంది. ఏమైంది పద్మావతి ఇప్పుడు ఏమైంది అని విక్కి అడుగుతాడు. మీరు నా మీద ఇలా ప్రేమ చూపిస్తే చాలు సారు. నాకు ఇంకా ఏమీ వద్దు. మీరు ఉంటే చాలు నాకు ఇంకా ఏమీ వద్దు అని పద్మావతి ఎమోషనల్ గా మాట్లాడుతుంది. పద్మావతి నువ్వు రెస్ట్ తీసుకో ఏ ఇంట్లో ఏ పనులు చేయకు అని విక్కీ చెబుతాడు అలాగే సారు అని పద్మావతి అంటుంది. మీ ప్రేమ నాతో ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి అని పద్మావతి మనసులో అనుకుంటుంది.
Nuvvu Nenu Prema Feburavy 22 2024 Episode 553 highlights
Nuvvu Nenu Prema Feburavy 22 2024 Episode 553 highlights

అరవింద వాళ్ల ఇంటికి ముత్తైదువులు బొట్టు పెట్టి ఆహ్వానించడానికి వస్తారు మా కోడలి శ్రీమంత మీరు తప్పకుండా రావాలి అని చెప్పి కుచేలకు బొట్టు పెట్టి పిలుస్తారు ఆ తరువాత అరవింద్ కు కూడా బొట్టు పెడతారు ఇక పద్మావతి కూడా ముందుకు వచ్చి బొట్టు పెట్టించుకుంటుంది. అప్పుడే అను వచ్చి బొట్టు పెట్టించుకోబోతుండగా ఈ అమ్మాయికి ఎందుకు తను గొడ్రాలు అని కుచల అంటుంది. ఏంటి అత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు మా అనుని అంతమాటే అట్లా అంటారు అమాయకురాలు కదా అని ఏ మాట పడితే ఆ మాట అంటే నేను ఊరుకోను అని పద్మావతి కుచలపై అరుస్తుంది అయినా మా అనుకి పెళ్లయి ఎన్నాళ్లయిందని మీరు ఆ మాట అంటారు అని పద్మావతి అంటుంది. అక్క నువ్వు ఎందుకు ఊరుకో అని పద్మావతిని అను అంటుంది.
Nuvvu Nenu Prema Feburavy 22 2024 Episode 553 highlights
Nuvvu Nenu Prema Feburavy 22 2024 Episode 553 highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో మురళి ఎలాగైనా సరే రమేష్ చంద్రను లేపేయాలని అనుకుంటాడు. అప్పుడు పైనుంచి కావాలనే ఈ పూల కుండీని ఆయన మీద పడేస్తే విక్కినే వాళ్ళ నాన్నని చంపేస్తాడు అని అందరూ అనుకుంటారు అని మురళి ప్లాన్ చేస్తాడు. ఇక పైనుంచి పూల కుండీ పడేయగా రమేష్ చంద్రను విక్కీ పక్కకు లాగుతాడు. అప్పుడు రమేష్ చంద్రకు పట్టరాని సంతోషం కలుగుతుంది. పద్మావతి ఎంతైనా మీరిద్దరిది రక్తసంబంధం కదా సారు.. తప్పకుండా మీ నాన్నని మీరే కాపాడుకుంటారు. మావయ్య గారు మీ అబ్బాయా మిమ్మల్ని కాపాడారు అని పద్మావతి అంటుంది.

Related posts

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri