NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu February 22 2024 Episode 2111: అంజలి బంటి భార్యాభర్తలని శాంభవికి తెలుస్తుందా లేదా.

Kumkuma Puvvu Today Episode February 22 2024 Episode 2111 Highlights

Kumkuma Puvvu February 22 2024 Episode 2111: అంజలి మనసులో చ వీళ్ళు ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా ఇలా నిందలు వేస్తున్నారు నా భర్త బంటి ఉండగా నేను వేరే వాళ్ళను కలలో కూడా ఊహించుకోను అలాంటిది నాకు ఇంత పెద్ద ముందే వేశారు ఇక ఇంత జరిగాక నేను ఇంకా ఇక్కడే ఉంటే నాకు విలువ ఉండదు తెల్లవార గానే వెళ్ళిపోవాలి అనుకుంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode February 22 2024 Episode 2111 Highlights
Kumkuma Puvvu Today Episode February 22 2024 Episode 2111 Highlights

కట్ చేస్తే తెల్లవారింది శాంభవి బంటి దగ్గరకు వచ్చి రంగయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరిని ఇక్కడికి రమ్మని పిలుచుకు రా ఈ విజయ శాంభవి నిర్ణయం అందరి ముందు చెబుతుంది అని అంటుంది శాంభవి. రంగా అలాగే అమ్మగారు అంటూ వెళ్లి ఇంట్లో ఉన్న వాళ్ళందరిని బండి దగ్గరికి రమ్మని చెప్పి పిలుచుకు వస్తాడు రంగయ్య. శాంభవి ఏంటి రంగ ఆ కొత్తమ్మాయి అంజలిని కూడా పిలుచుకురా తన కూడా తెలియాలి కదా ఇంట్లో నా నిర్ణయం ఎలా ఉంటుందో కాబట్టి వెళ్లి ఆంజనేయులు కూడా పిలుచుకుని తీసుకురా అంటుంది. రంగ అలాగే అమ్మగారు అంటూ అంజలి దగ్గరికి వెళతాడు. అంజలి ఈరోజు తో ఈ మజిలీ కూడా ముగిసినట్లే అనుకుంటూ ఉంటుంది. రంగ అంజలి దగ్గరికి వచ్చి అంజలి గారు శాంభవి అమ్మగారు అందరిని ఆరు బయటికి రమ్మని చెప్పింది మీరు కూడా రండి అని అంటాడు అంజలి ఎందుకు రంగ అని అడుగుతుంది. రంగా లవ్ లెటర్ రాసిన అతను దొరికాడు అని చెబుతాడు. అంజలి శాంభవి దగ్గరికి వెళుతుంది.

Kumkuma Puvvu Today Episode February 22 2024 Episode 2111 Highlights
Kumkuma Puvvu Today Episode February 22 2024 Episode 2111 Highlights

అంజలి అక్కడ ఆరు బయట చెట్టుకు బంటిని కట్టి వేసి ఉండడం అంజలి చూస్తుంది బంటి కూడా అంజలిని చూస్తాడు అంజలి అంటే నా బంటి కూడా ఇక్కడికే చేరుకున్నాడా దేవుడా ఇప్పుడు బంటి పరిస్థితి ఏంటి అని అంజలి అనుకుంటూ ఉంటుంది. బంటి అంజలిని చూసి అంజలి అని పిలవబోతుండగా అంజలి ఉష్ బంటి సైలెంట్ గా ఉండు అని సైగ చేస్తుంది అంజలి.బంటి సైలెంట్ అయిపోతాడు. శాంభవి వచ్చావా అంజలి రా ఒక నిజం రాబట్టడానికి ఎన్నో దారులు ఉంటాయి అలాగే నిన్ను కూడా అనుమానించాల్సి వచ్చింది అంతే తప్ప నీ మీద వేరే ఉద్దేశంతో నిన్ను అనుమానించలేదు అంజలి అంటూ ఇదిగో ఈ బంటి ఆ లవ్ లెటర్ రాశాడంట నా ఇంట్లో నా ఒంట్లో ప్రేమకు చోటు లేదు అలాంటిది నా ఇంట్లో దిక్కుమక్కు లేక పడి ఉండే తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు వీడు నాకు తగిన శాస్తి చేశాడు.అందుకే ఇక మీదట ఏ ఒక్కరికి ఇలాంటి ఆలోచన రాకుండా ఉండాలి అంటే వీడికి వంద కొరడా దెబ్బలు అలాగే ఊరు బహిష్కరణ చేయాలి.అలా అయితేనే ఇకముందు ఎవరైనా ఇలా చేయడానికి భయపడతారు అని అంటుంది శాంభవి. చరణ్ అలాగే అమ్మనువ్వు చెప్పినట్లే చేస్తాను అంటూ కొరడా తీసుకుని బంటిని కొట్టబోతాడు చరణ్.

Kumkuma Puvvu Today Episode February 22 2024 Episode 2111 Highlights
Kumkuma Puvvu Today Episode February 22 2024 Episode 2111 Highlights

అంజలి ఇప్పుడు ఎలాగైనా నా బంటి ని కాపాడుకోవాలి నేను నోరు విప్పి మేమిద్దరం భార్యాభర్తలమని చెప్పేయాలి అని అనుకుంటుంది అంజలి. అంతలోపే అఖిల ఆపండి అన్నయ్య ఆ లెటర్ రాసింది నేను బంటి కాదు అంటుంది. శాంభవి ఏంటి అఖిల నువ్వు చెప్పేది అని అంటుంది. అఖిల అవునమ్మా నేను చెప్పేది నిజం. నేను లవ్ వీల్స్ చేస్తే ఎలా ఉంటుందా అనుకుంటూ ఆ లెటర్ రాశాను కానీ అంతలో నువ్వు పిలవగానే నేను టెన్షన్తో ఆ లెటర్ ని ఎక్కడో జారవిడుచుకున్నాను తరువాత చూస్తే అది బంటి చేతిలో కనబడింది అప్పుడే రంగా చూసి ఆ లెటరు బంటి రాశాడు అని అనుకున్నాడు అంతే అని చెబుతుంది. ఏదో చిన్న పిల్లవి కదా అని వదిలేస్తే నువ్వు రియల్స్ కోసం ఇలా లెటర్లు రాస్తే చూసావా ఎక్కడి వరకు వచ్చిందో అంటూ కోపంతో అఖిలను కొడుతుంది శాంభవి. అంజలి హమ్మయ్య ఇప్పుడు గండం గట్టెక్కింది నా బంటి అలా తప్పుగా ఎప్పుడూ ప్రవర్తించడు అనుకుంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode February 22 2024 Episode 2111 Highlights
Kumkuma Puvvu Today Episode February 22 2024 Episode 2111 Highlights

కట్ చేస్తే అఖిల కోపంతో సంజయ్ దగ్గరికి వెళ్లి ఒరేయ్ అన్నయ్య నువ్వు చేసింది ఏమైనా బాగుందా ఆ లెటర్ రాసింది నువ్వే అని నాకు తెలుసు కానీ నువ్వు చేసిన పనికి ఇప్పుడు బంటీ దోషిగా నిలబడ్డాడు ధైర్యం లేనప్పుడు ప్రేమించడం ఎందుకురా ధైర్యం ఉన్న దగ్గరే ప్రేమ గెలుస్తుంది నీకు ఆ ధైర్యం లేదు నేను మధ్యలో అబద్దం చెప్పకపోతే బంటి పరిస్థితి అమ్మ చేతిలో ఎలా ఉండేదో నీకు అర్థం అవుతుందా అని అంటుంది. అంజి ఏం చేయాలో అఖిల నేను అంజలికి ఇవ్వడానికే వెళుతూ ఉండగా అమ్మ పిలవడంతో టెన్షన్లో ఆ లెటర్ జారవిడుచుకున్నా అంతా వెతికాను ఎక్కడ కనిపించలేదు తీరా చూస్తే అది అమ్మ చేతిలో కనపడింది సరే ఇప్పుడు ప్రాబ్లం తీరిపోయింది కదా అంటాడు. అఖిల ప్రాబ్లం తీరలేదు ప్రాబ్లం అలాగే ఉంది రా అన్నయ్య నువ్వు ధైర్యంగా అంజలికి వెళ్లి చెప్పు లెటర్లు ఫ్లవర్స్ ఇవన్నీ పాతకాలం ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ లో ఉన్నది ఏదైనా ప్లాన్ చెయ్ అంటూ వెళ్ళిపోతుంది అఖిల.

Kumkuma Puvvu Today Episode February 22 2024 Episode 2111 Highlights
Kumkuma Puvvu Today Episode February 22 2024 Episode 2111 Highlights

అందరూ వెళ్లిపోయాక బంటి అంజలి ఒక దగ్గర కలుసుకుంటారు అంజలి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు బంటి. అంజలి చెబుతాను నువ్వు వాటర్ తీసుకురావడానికి వెళ్లగానే ఆ ఏసీబీ యుగంధర్ అక్కడికి వచ్చాడు నేను అతన్ని దగ్గర నుండి తప్పించుకునే ప్రయత్నంలో వెళ్లి షాంపూవి గారి కారు డిక్కీలో దాచుకున్నా శాంభవి గారు ఏదో ప్రెస్టేషన్లో తీసుకువెళ్లి యాక్సిడెంట్ చేశారు అప్పుడు తనని కాపాడి ఇక్కడికి తీసుకువచ్చాను. ఇక అప్పటినుండి నన్ను ఇక్కడే ఉండమన్నారు సరే కానీ నువ్వు ఎలా వచ్చావు అని అడుగుతుంది అంజలి. బంటి చెబుతాను అంజలి నువ్వు కనిపించకపోయేసరికి నేను నిన్ను వెతుక్కుంటూ వెళుతూ ఉండగా ఒక పూలకుండిలు దింపే అతనికి తగలడంతో పూలకుండి పగిలిపోయింది

ఆ ఓనరు ఆ పూలకుండి ఆ పూల కుండి పైసలు తీరేంతవరకు ఇక్కడే ఉండు అన్నాడు ఇక నేను అక్కడే ఉంటూ పని చేస్తూ ఉండగా అక్కడికి పోలీసులు వచ్చారు వారి నుండి తప్పించుకోవడానికి అక్కడ ఉన్న ట్రాలీలో ఎక్కి కూర్చున్నాను ఇక్కడికి వచ్చాను కానీ ఎటు వెళ్ళాలో తెలియక దారి తప్పి అడివిలోకి వెళితే పాము కరిచి పడిపోయాను ఇక అడవికి మూలికల కోసం వచ్చిన వాళ్ళు నన్ను తీసుకువచ్చి ఇక్కడ బ్రతికించారు అని చెబుతాడు బంటి. అంజలి ఎలా అయితేనే ఇద్దరం ఒక దగ్గరికి చేరుకున్నాము అందరూ ఉన్నప్పుడు మనము వేరు వేరు ఎవరూ లేనప్పుడు మనిద్దరం భార్య భర్తలు సరైన బంటి అని అనుకుంటారు

Related posts

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

Big flop Movie: బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన భారీ బడ్జెట్ మూవీ.. మొత్తం బాలీవుడ్ ని ముంచేసిన మూవీ ఇది..!

Saranya Koduri

Dhe Celebrities Special 2: ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 కి సరికొత్త హోస్ట్.. ఈసారి డబల్ కిక్..!

Saranya Koduri

Swathi Chinukulu: మళ్లీ వస్తున్న ” స్వాతి చినుకులు ” సీరియల్.. ఆనందంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Elections Results 2024: మూవీ థియేటర్స్ లో ఎన్నికల ఫలితాల లైవ్.. ఆ సిటీలో బుకింగ్స్ కూడా స్టార్ట్..!

Saranya Koduri

OTT: థియేటర్ రిలీజ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Big Boss 8: బిగ్ బాస్ 8 కి కంటెస్టెంట్లు సిద్ధం.. ఈసారి కొత్త రూల్స్ తో మరింత ఎంటర్టైన్మెంట్..!

Saranya Koduri

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri