NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

షాక్‌: టిక్కెట్ ఇచ్చిన‌ట్టే ఇచ్చి వెన‌క్కు లాగేసుకుంటోన్న చంద్ర‌బాబు..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం మార్చుకున్నారు. 94 నియోజ‌క‌వ‌ర్గాల‌లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించినా.. కూడా పార్టీని బ‌లం గా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేలా గేర్ మార్చారు. నాయ‌కుల‌కు భ‌రోసా ఇవ్వ‌డంతోపాటు.. చాలా వ్యూహా్త్మ‌కంగా వారిని హెచ్చ‌రించా రు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టికెట్లు ఇచ్చామ‌న్న అహంకారం ప‌నికిరాద‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. అవ‌స‌ర‌మైతే మార్పు కూడా త‌ప్ప‌వ‌ని చంద్ర‌బాబు అలెర్ట్ చేశారు. ఈ ప‌రిణామాల‌తో టీడీపీ నాయ‌కులు ఉలిక్కిప‌డ్డారు. అయితే.. వాస్త‌వం.. గ్ర‌హించిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు వ్యూహాన్ని వారు అర్ధం చేసుకున్నారు.

ఇదీ.. వ్యూహం…
టీడీపీ అధినేత చంద్ర‌బాబు హెచ్చ‌రించ‌డం వెనుక ప‌క్కా వ్యూహం ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం టికెట్లు ఖ‌రారైన నాయ కుల‌కు యాంటీగా వైసీపీ నాయ‌కులు ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంది. అదేవిధంగా వారి లొసుగుల‌ను కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకురావ‌డం ద్వారా టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల‌ను డైల్యూట్ చేసేందుకు వ్యూహ ర‌చ‌న చేసినా.. దానిని రాజ‌కీయ కోణంలో త‌ప్పుపట్టే ప‌రిస్థితి ఉండ‌దు. దీనిని ముందుగానే ఊహించిన చంద్ర‌బాబు..ఇలాంటి వాటి నుంచి బ‌య‌ట ప‌డేందుకు నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డం కీల‌మ‌ని భావిస్తున్నారు. దీనినే ఆయ‌న హెచ్చరిక రూపంలో పేర్కొన్నారు.

మ‌రోవైపు.. సీనియ‌ర్ నేత‌ల‌కు కూడా చాలా చోట్ల టికట్లు ద‌క్క‌లేదు. వారంతా అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటివారిని ప‌దే ప‌దే వారి ఇళ్ల‌కు వెళ్లి మ‌రీ క‌లుసుకోవ‌డం ద్వారా టికెట్ ద‌క్కించుకున్న నాయ‌కుల‌పై.. అసంతృప్తి ఉన్న నేప‌థ్యంలో వారిని బుజ్జ‌గిం చాల‌నేది చంద్ర‌బాబు ఆలోచ‌న‌. త‌ద్వారా గ్రూపు రాజ‌కీయాల‌కు చెక్ పెట్ట‌డంతోపాటు పార్టీని మూకుమ్మ‌డిగా ఐక్యంగా ముందు కు తీసుకువెళ్లాల‌నే వ్యూహంతో ఉన్నారు. దీనినే ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. అదేస‌మ‌యంలో వైసీపీని త‌క్కువ‌గా అంచ‌నావేయ‌డానికి వీల్లేద‌న్న మాట వెనుక కూడా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతుందో చంద్ర‌బాబు ఊహిస్తున్న‌ట్టు గా ఉంది.

ఇక‌, నాయ‌కుల వ్య‌వ‌హారం వేరేగా ఉండ‌డానికి కూడా లేకుండా.. చంద్ర‌బాబు న‌ట్లు బిగించారు. ప్ర‌తి చోటా త‌ను మ‌రోసారి.. స‌ర్వేలు చేయ‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. దీని ఫీడ్ బ్యాక్ ఆధారంగానే నిర్ణ‌యాల‌ను మ‌రోసారిపునః స‌మీక్షిస్తాన‌ని కూడా హెచ్చ‌రించారు. త‌ద్వారా..ఇప్ప‌డు సీటు ద‌క్కించుకున్న‌వారు.. భ‌రోసాగా కాకుండా.. భ‌ద్రంగా ప‌నులు చేయాల్సి ఉంటుంది. లేక‌పోతే ఆయ‌న టిక్కెట్ వెన‌క్కు లాగేసుకుంటారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి గ‌డ‌ప‌కు తిరగ‌డంతోపాటు.. పార్టీని బ‌లోపేతం చేయ‌డం, కార్య‌క‌ర్త‌ల‌ను త‌న వెంట తిప్పుకోవ‌డం.. నాయ‌కుల‌ను క‌ల‌వ‌డం అనే కీల‌క క్ర‌తువుల దిశ‌గా నాయ‌కుల‌ను ముందుకు న‌డిపించ‌డంలో చంద్ర‌బాబు వ్యూహం ప‌క్కాగా క‌నిపిస్తోంది.

Related posts

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?