NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami: కంత్రి తంత్రి చేసే మాయాజాలానికి భయపడి పోయి వణుకుతున్న పంచమి..

Naga Panchami Today Episode February 27 2024 Episode 290 Highlights

Naga Panchami :  కంత్రి తంత్రీకి పంచమిని చూపించి ఆ అమ్మాయిని మి మంత్ర విద్యలతో బాగా భయపెట్టాలి అని చెబుతుంది కరాలి. ఓ అంతేనా అని కంత్రి అంటాడు. ముందు పంచమి ఎక్కడుందో కనిపెట్టి మీ శక్తుల్ని ప్రయోగించండి నేను ఇక నుంచే చూస్తూ ఉంటాను అని కరాలి చెబుతుంది. మీరే చూస్తారు గా మెచ్చుకునేలా చేస్తాం అంటూ కంత్రి తంత్రీ మాయమైపోతారు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 27 2024 Episode 290 Highlights
Naga Panchami Today Episode February 27 2024 Episode 290 Highlights

ఇల్లంతా చూశాం పంచమి కనిపించట్లేదు అని తంత్రి అంటాడు. పంచమి వచ్చేదాకా కిచెన్ లో ఉన్నవి అన్ని తినేద్దాం అని కంత్రి అంటాడు. ఈ మనుషులని మనమెక్కడ తింటాం రాత్రికి స్మశానానికి వెళ్లి శవాలని తిందాం అని కంత్రి అంటాడు. ఇంతలో మోక్ష పంచమి ఇంటికి వస్తారు. ఎవరికి ఏమీ తెలియనట్టే ఉండు పంచమి అ కరాలికి భయపడి బతకాల్సిన అవసరం లేకుండా మనిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం అని మోక్ష కారు దిగి లోపలికి వెళ్ళిపోతాడు. మోక్ష బాబు మళ్లీ మొదటికి వచ్చాడు పెళ్లికి ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు అని పంచమి కారు దిగుతూ ఉండగా కంత్రీ తంత్రి మంటలు సృష్టిస్తారు. పంచమి కాలి కింద పెడుతూ ఉండగా మంటలు కాళ్లకు తగిలి పంచమి కారులోనే కూర్చుంటుంది. ఏమైంది పంచమి కారు దిగు అని మోక్ష వెనకకు వచ్చి అంటాడు. మంటలు ఉన్నాయి మోక్ష బాబు అని పంచమి అంటుంది. ఇక్కడ మంటలు ఎక్కడున్నాయి పంచమి అని మోక్ష అంటాడు. నేను దిగబోతుంటే మంటలు ఎగసి పడుతున్నాయి అని పంచమి అంటుంది. నువ్వేమీ దిగొద్దు నువ్వు అలాగే ఉండు నిన్ను ఎత్తుకొని తీసుకు వెళ్తాను అని మోక్ష పంచమి ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్తాడు. అది చూసి కంత్రి త0త్రి నవ్వుకుంటారు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 27 2024 Episode 290 Highlights
Naga Panchami Today Episode February 27 2024 Episode 290 Highlights

ఏంటి మోక్ష పంచమికి ఏమైంది ఎత్తుకొచ్చావు అని మేఘన అడుగుతుంది.ఊరికే సరదా కోసం ఎత్తుకున్నాను అని మోక్ష పంచమిని దించబోతూ ఉంటాడు. వద్దు మోక్ష బాబు మంటలు అక్కడ రాక్షసి ఉంది చూడు నన్ను తినబోతుంది నన్ను దించొద్దు అని పంచమి భయపడుతుంది. ఏమైంది పంచమి నీకు అని కరాలి అంటుంది. ఇంతలో అందరూ అక్కడికి వస్తారు. పంచమి కి ఏమైంది రా అని శబరి అడుగుతుంది. ఏంటి పంచమి ఒళ్ళంతా చెమటలు పట్టి ఉన్నాయి అని మీనాక్షి అడుగుతుంది. తనకు కళ్ళు తిరుగుతున్నాయంట అని మోక్ష అంటాడు. ఏంట్రా ఈ పిచ్చి చేష్టలు మళ్లీ ఇది ఒక కొత్త నాటకమా అని వైదేహి అంటుంది. కోసేపు పడుకుంటే సరిపోతుంది అని మోక్ష పంచమిని తీసుకొని వెళుతూ ఉండగా తంత్రి తన మాయాజాలంతో మోక్ష కాలనీ గట్టిగా పట్టేస్తాడు. అడుగు ముందుకు వేయలేని మోక్ష పంచమిని కింద పడేసి తను కింద పడిపోతాడు. పంచమి లే పంచమి అని మోక్ష లేపుతూ ఉంటాడు. నా చుట్టూ రాక్షసులు ఉన్నారు నన్ను చంపేస్తారు నేను కళ్ళు తెరవను అని పంచమి అంటుంది. పంచమి లే ఒక్కసారి నన్ను చూడు అని మోక్ష అంటాడు. పంచమి లేచి కూర్చుంటుంది. ఒక్కసారి సుబ్బు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంది పంచమి. పంచమి నువ్వేమీ భయపడకు నేను ఉన్నంతవరకు నీకేమీ కానివ్వను అని మోక్ష అంటాడు. నిన్ను నా నుంచి ఎవరు వేరు చేయలేరు ఏడవద్దు పంచమి అని మోక్ష పంచమి కన్నీళ్లు తుడుస్తాడు. పంచమి మోక్షని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆ సంఘటన చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 27 2024 Episode 290 Highlights
Naga Panchami Today Episode February 27 2024 Episode 290 Highlights

మోక్ష దీనికి పిచ్చి పట్టి ఉంటే తీసుకువెళ్లి పిచ్చి ఆసుపత్రిలో వదిలేయ్ ఇది నాటకం అని నాకు తెలిస్తే మాత్రం దీన్ని చంపేస్తాను అని వైదేహి అంటుంది. పంచమి ఇక్కడే ఉంటుంది మీరంతా వెళ్ళండి అని మోక్ష అంటాడు. మోక్ష పంచమిని తీసుకొని వెళ్తూ ఉండగా మోక్ష దాన్ని ఇప్పటికిప్పుడే బయటికి పంపించేసేయ్ అని వైదేహి అంటుంది. ఈ పిచ్చిది ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అని వైదేహి అంటుంది. పంచమి ఇక్కడే నాతోటే ఉంటుంది అని మోక్ష పంచమిని తీసుకొని వెళ్ళిపోతాడు. పంచమికి ఏదో అయినట్టుంది ఎవరికైనా చూపెడితే బాగుండు అని మేఘన అంటుంది.అది బాగానే ఉంది నా కొడుకు ను పిచ్చివాడిని చేసి తన చుట్టూ తిప్పుకుంటుంది ఏదో ఒకటి చేసి దాని ఇంట్లో నుంచి పంపించేయాలి లేదంటే నా కొడుకు నాకు దక్కడు అని వైదేహి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంటికి ఏదో అరిష్టం పట్టినట్టుంది అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని శబరి అంటుంది.ఒక పెద్ద మాంత్రికుని పిలిపించి పూజ జరిపిద్దాం అని మీనాక్షి అంటుంది. ఏదో ఒకటి చేయకపోతే ఒకరి కొకరు కొట్టుకొని చస్తారు అని శబరి వెళ్ళిపోతుంది. ఆ పంచమి ఏదో పెద్ద ప్లాన్ వేసింది చిత్ర అని జ్వాల అంటుంది. నీకు దండం అక్క ఆ పంచమిని కంటే నిన్ను చూస్తేనే భయంగా ఉంది అంటూ చిత్ర వాళ్ళ ఆయనని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 27 2024 Episode 290 Highlights
Naga Panchami Today Episode February 27 2024 Episode 290 Highlights

పంచమి సుబ్బు ఇచ్చిన నెమలి పించని పట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంటుంది. పంచమి జరిగినవన్నీ మరిచిపో నీకు తెలియకుండా ఎవరో నీ మీద ప్రయోగం చేస్తున్నారని పిస్తుంది అని మోక్ష అంటాడు. అంతా కరాలి చేయిస్తుంది తన శక్తులు నాకు తెలుసు నన్ను అంతం చేసి మిమ్మల్ని దక్కించుకోవాలని చూస్తుంది నిన్ను నాకు దూరం చేస్తానని ఛాలెంజ్ చేసింది అందులో భాగమే నాపై జరిగిన ఈ మాయాజాలం దాడి అని పంచమి అంటుంది. ఆ కరాలి గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నావు పంచమి అని మోక్ష అంటాడు.వాళ్ళ అన్నను చంపాననినా మీద పగ పట్టింది నిన్ను సొంతం చేసుకుని ఏవో శక్తులు సంపాదిస్తానంటుంది అని పంచమి అంటుంది. నాకు ఫణీంద్ర మీద అనుమానంగా ఉంది పంచమి తన నాగశక్తితో నిన్ను భయపెట్టి తన వెంట తీసుకుపోవాలనుకుంటున్నాడేమో అని మోక్ష అంటాడు.

Naga Panchami Today Episode February 27 2024 Episode 290 Highlights
Naga Panchami Today Episode February 27 2024 Episode 290 Highlights

నేను నాగలోకపు యువరాణిని  నన్ను కాపాడాలని చూస్తారు కానీ హాని తల పెట్టాలని చూడరు తను నాకు కోపం వచ్చే పని చేస్తే నేను నాగ దేవతను పూజించి చెబితే నాగదేవత శిక్షిస్తుందని అలాంటి పని చేయడు అని పంచమి అంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం పంచమి అని మోక్ష అంటాడు. సుబ్రహ్మణ్య స్వామి  ఈ నెమలి పించని నాకు ప్రసాదించాడు ఏమీ కాదు మీరు భయపడకండి అని పంచమి అంటుంది. దీనికి అంత శక్తి ఉంటే కరాలి నీ మీద మంత్ర శక్తిని ఎలా ప్రయోగించింది అని మోక్ష అంటాడు. కరాలి మంత్రి శక్తిని ప్రయోగించిన నేను మామూలుగా ఉన్నాను అంటే ఈ నెమలి పించం కాపాడి ఉంటుంది మోక్ష బాబు అని పంచమి ఉంటుంది. నెమలి పించం నీ దగ్గర ఉంది ఆ స్వామి మీద అపారమైన నమ్మకం ఉంది అలాంటప్పుడు ఏ శక్తులు నిన్ను అడ్డుకోకూడదు కదా అని మోక్ష అంటాడు. ఆ స్వామి నాకు హెచ్చరించినట్టు ఉంది ఆ కరాలి నుండి నిన్ను కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండమని చెప్పినట్టు అనిపిస్తుంది మోక్ష బాబు అని పంచమి అంటుంది..

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N