NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నందిగామ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రార‌య్యారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇక్క‌డ నుంచి మ‌రోసారి పోటీ చేయ‌నున్నారు. సాధార ణం గా టికెట్ కోసం ప్ర‌య‌త్నించ‌డం నాయ‌కుల‌కు ప‌రిపాటి. అయితే.. తంగిరాల విష‌యానికి వ‌స్తే.. ఆమె స్వ‌యంగా బిగ్ టార్గెట్ పెట్టుకున్నారు. దీనినే ప్ర‌జ‌ల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు వ‌చ్చే ఎన్నిక ల్లో త‌న‌ను కాదు.. త‌న ల‌క్ష్యాన్ని గెలిపించాల‌ని కోరుతున్నారు.

ఇంత‌కీ సౌమ్య పెట్టుకున్న ల‌క్ష్యం.. భారీ మెజారిటీ. అది కూడా 2014లో జ‌రిగిన బైపోల్‌లో త‌న‌కు ప్ర‌జ‌లు ఇచ్చిన మెజారిటీని తిరిగి క‌ట్ట‌బెట్టాల‌ని ఆమె విన్న‌విస్తున్నారు. దీంతో ఆమె అనుచ‌రులు, టీడీపీ నాయ కులు కూడా.. ఈ మెజారిటీ బోర్డును ప‌ట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. త‌న అనుచ‌రులు కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌చారంలోకి తీసుకువ‌స్తార‌ని ఆమె చెప్పిన వెంట‌నే.. కార్యాచ‌ర‌ణ‌కు పూనుకొన్నారు. టీడీపీకి కంచుకోట అయిన‌.. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నందిగామ‌లో ఈ పార్టీ వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంది.

1994 నుంచి 2019 వ‌రకు జ‌రిగిన ఎన్నిక‌ల‌లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. రిజ‌ర్వ్‌డ్ కాక‌ముందు.. దేవినేని ఉమా గెలుపుగుర్రం ఎక్కారు. 2009లో ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ అయిన త‌ర్వాత‌.. తంగిరాల ప్ర‌భాక‌ర‌రావు పోటీ చేశారు. వ‌రుస‌గా 2009-2014 ఎన్నిక‌ల్లో ప్ర‌భాక‌ర‌రావు విజ‌యంద‌క్కించుకున్నారు. ఆయా ఎన్నిక‌ల్లో 5 వేల పైచిలుకు ఓట్లు మాత్ర‌మే మెజారిటీగా ద‌క్కించుకున్నారు. అయితే, 2014 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఆకస్మికంగా తంగిరాల మృతి చెందారు. దీంతో ఆయ‌న కుమార్తె సౌమ్య అరంగేట్రం చేశారు.

2014లో వ‌చ్చిన ఉప పోరులో ఆమె విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు 78,267 ఓట్ల మెజారిటీ వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం ఆమె ప‌రాజ‌యానికి చేరువైన విష‌యం తెలిసిందే అయితే. ఇప్పుడు మ‌రోసారి ఆమె 2014లో త‌న‌కు వ‌చ్చిన మెజారిటీని ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌న‌పై ఉన్న సింప‌తీ, మ‌హిళా కోటా, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌, తాను ఎక్క‌డున్నా. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం, నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం త‌పిస్తున్న అంశాలు వంటివి ఆమెను ఈ దిశ‌గా న‌డిపిస్తున్నాయి. మ‌రి ఏమేర‌కు రీచ్ అవుతార‌నేది చూడాలి.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju