NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 4 2024 Episode 1015: శైలేంద్ర వసుధార మీద ఎమ్ ప్లాన్ వెయ్యబోతున్నాడు.

Guppedanta Manasu Today Episode March 4 2024 Episode 1015 Highlights

Guppedanta Manasu March 4 2024 Episode 1015: వసుధార ఏదో పనిమీద కారులో బయటికి వెళుతుంది అనుకోకుండా కారు దారిలో ఆగిపోతుంది.అదే దారిలో వస్తున్న మను కారు ఆగి ఉండడం చూసి దిగి ఏంటి మేడం ఏమైంది కారు దిగారు అని అడుగుతాడు. వసుధార ఏం లేదండి కారు ట్రబుల్ ఇచ్చింది ఆన్ అవ్వడం లేదు అని చెబుతుంది. మను ఏది నన్ను చూడనివ్వండి మీరు వెళ్లే కార్ స్టార్ట్ చేస్తూ ఉండండి నేను చూస్తాను అంటాడు. వసుధార అలాగే అంటూ కారు స్టార్ట్ చేసి ఉంటుంది కానీ కారు స్టార్ట్ అవ్వదు మను గారు కారు స్టార్ట్ అవ్వడం లేదండి మీరు వెళ్ళండి నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అని అంటుంది. మను అయ్యో అలా ఎలా కుదురుతుంది మేడంతెలిసిన మనిషిని ఇలా రోడ్డుమీద వదిలేసి ఎలా వెళ్ళిపోతాం చెప్పండి మీరు నా కారులో రండి మీరు ఎక్కడ దిగాలో అక్కడ దింపేస్తాను అని అంటాడు. వసుధార మను గారు మీరు వెళ్లండి నేను వేరే పనిమీద బయటికి వెళ్తున్నాను మీరు అక్కడికి రాలేరు ఇప్పటివరకు మీరు అది చూసి ఉండరు కూడా అందుకని చెబుతున్నాను మీరు అక్కడికి రాలేరు ఉండలేరు కూడా అందుకని మీరు వెళ్లిపోండి నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళతాను అంటుంది వసుధార. మను అయ్యో మేడం మీకు అర్థం కావడం లేదు మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను కచ్చితంగా చేస్తాను మీరు ఎలాంటి చోటికి తీసుకు వెళ్లిన తప్పకుండా వస్తాను పదండి అని అంటాడు వసుధార సరే పద అంటూ వచ్చి మను కారు ఎక్కుతుంది. మను వసుధార ఇద్దరూ వెళుతూ ఉంటారు.

Guppedanta Manasu Today Episode March 4 2024 Episode 1015 Highlights
Guppedanta Manasu Today Episode March 4 2024 Episode 1015 Highlights

కట్ చేస్తే అది చూసిన శైలేంద్ర ఏయ్ బ్రో ఒకసారి అలా చూడు నీ మరదలు కారులు వెళుతుంది అని చెబుతాడు. రాజువ్ నా మరదలు ఈ మను గాడి కారులో ఎందుకు వెళుతుంది అది ఇద్దరూ నవ్వుకుంటూ వెళుతున్నారు వీడు నా మరదలని ఎక్కడికి తీసుకు వెళుతున్నాడు ఇప్పుడే చంపేస్తాను వీడిని అంటూ వెళ్లబోతాడు. శైలేంద్ర ఆగు బ్రో, తొందర పడొద్దు ఎందుకు అంత ఆవేశపడుతున్నావు ఈ ఆవేశమే తగ్గించుకో దీనికి నేను సరికొత్త ప్లాను కథను అల్లుతాను కదా కొంచెం ఓపిక పట్టు అంటాడు శైలేంద్ర. రాజీవ్ ఏంటి బ్రో నువ్వు సరికొత్త కథను అల్లేది వాడిని ఇప్పుడే లేపిస్తే అయిపోతుంది నువ్వు అడ్డు తప్పుకో అంటాడు. శైలేంద్ర వద్దు రాజువ్ తొందరగా పడొద్దు తొందరపాటు అంత మంచిది కాదు అంటాడు.

Guppedanta Manasu Today Episode March 4 2024 Episode 1015 Highlights
Guppedanta Manasu Today Episode March 4 2024 Episode 1015 Highlights

కట్ చేస్తే మను వసుధారా ఇద్దరూ ఒక బస్తీకి వెళతారు వసుధార దిగండి మామగారు మనం సిటీకి దూరంలో ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న బస్తీకి వచ్చాము రండి మనం ఈ పొలం గట్ల మీద నుండి నడుచుకుంటూ వెళితే ఆ ఊరు వస్తుంది అని చెబుతుంది. మను ఏంటండీ వసుధార గారు మీరు చెప్పేది ఇప్పుడు ఈ పొలం గట్టు మీది నుండి నన్ను నడిపిస్తారా ఏంటి అని అంటాడు వసుధార అవునండి నేను ముందే చెప్పాను కదా మీరు ఆ చోటికి రాలేరు అని అదే ఈ చోటు ఆ ఊరికి చేరుకోవాలి అంటే ఈ పొలం గట్ల మీద నుండి నడుచుకుంటూ వెళ్ళాలి అంటుంది. మనుసరే మేడం మీరు చెప్పారు కదా ట్రై చేస్తాను అంటూ మనో వసుధార ఇద్దరు పొలం గట్ల మీది నుండి నడుచుకుంటూ అవతలి పక్కన ఉన్న గ్రామంలోకి వెళతారు. పిల్లలందరూ కలిసి ఒక దగ్గర ఆడుకుంటూ కనిపిస్తారు వసుధార చూశారా మను గారు ఈ పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఇప్పుడు ఇక్కడ లేరు అందరూ పనుల్లోకి వెళ్లిపోయారు వీళ్ళు మాత్రం బడికి వెళ్లకుండా ఇలా ఆడుకుంటూ వాళ్ళ జీవిత ఆశయాన్ని కోల్పోతున్నారు ఇలాంటి వాళ్ల కోసమే ఈ మిషన్ ఎడ్యుకేషన్ అనే ప్రాజెక్టు మొదలుపెట్టాము నేను రిషి సార్ ఎన్నో ఇలాంటి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసాము ఎంతో మంది పిల్లలను బడిబాట పట్టించాము

Guppedanta Manasu Today Episode March 4 2024 Episode 1015 Highlights
Guppedanta Manasu Today Episode March 4 2024 Episode 1015 Highlights

ఈ ప్రాజెక్టులో నేను రిషి సార్ తో పొందిన అనుభవాలు ఎన్నో ఎన్నో ఇక్కడికి వచ్చి నాకే నాకు అవి గుర్తుకు వస్తున్నాయి రిషి సర్ నా పక్కనే ఉన్నట్టు నాతో మాట్లాడుతున్నట్టు పిల్లలతో ఆడుతున్నట్లు అంతా నా కళ్ళముందు కనిపిస్తూ ఉంది అది ఎంత తీయని అనుభూతి తలుచుకుంటుంటే గుండెలో ఉన్న బాధంతా దిగిపోతుంది అని అంటుంది. మను సరే మేడం ఇప్పుడు మనం ఆ పిల్లలతో మాట్లాడాలా అని అంటాడు.వసుధార అవునండి పిల్లలతో మాట్లాడదాం పదండి అంటూ పిల్లల దగ్గరికి వెళతారు. వసుధార పిల్లలు మీ పేరెంట్స్ ఎక్కడున్నారు మీరు ఈ రోజు బడికి వెళ్లలేదా అని అడుగుతుంది. పిల్లలు ఇక్కడ మాకు బడి లేదు కదా మరి మేము ఎక్కడ వెళ్లాలి అందుకే ఇక్కడ ఆడుకుంటున్నాము అని అంటారు. వసుధార త్వరగా వెళ్లి మీరు మీ తల్లిదండ్రులని పిలుచుకు రండి అని పంపిస్తుంది పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులని తీసుకొని వస్తారు.వసుధార చూడండి మీ పిల్లలందరూ ఇలా చదువు లేకుండా ఉండిపోతే మీకేం బాధ అనిపించడం లేదా అని అడుగుతుంది.

Guppedanta Manasu Today Episode March 4 2024 Episode 1015 Highlights
Guppedanta Manasu Today Episode March 4 2024 Episode 1015 Highlights

పేరెంట్స్ అలా అయితే మేమేం చేయాలి అమ్మ మాకు ఇక్కడ దగ్గరలో బడి ఏమీ లేదు మరి మేము ఎలా చదివించగలం అని అంటారు.వసుధార ఇలాంటి వాళ్ల కోసమే మిషన్ ఎడ్యుకేషన్ అనే ఒక ప్రాజెక్టుమొదలుపెట్టాం అందులో చిన్న పెద్ద అంతరం లేకుండా అందరూ చదువుకోవచ్చు మీ పిల్లలకి చదువుని తిండిని బట్టని అన్ని మేము చూసుకుంటాము మీ పిల్లల్ని మాతో పంపిస్తే చాలు అంటుంది వసుధార. మను అవునండి మేడం చెప్పింది కరెక్టు మీ పిల్లలు కూడా మీలా పని చేసుకుని ఇక్కడే మట్టిలో మగ్గిపోవాల్సిందేనా

Guppedanta Manasu Today Episode March 4 2024 Episode 1015 Highlights
Guppedanta Manasu Today Episode March 4 2024 Episode 1015 Highlights

మీ పిల్లలు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తుంటే మీకు ఎంత గౌరవంగా అనిపిస్తుంది చెప్పండి అందుకే ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించండి మీ పిల్లలని బడిబాట పట్టించండి అని చెబుతాడు. పేరెంట్స్ అలాగేనండి మీరు చెప్పినట్లే చేస్తాము అంటుంది వసుధర ఇప్పుడు మేము వెళ్ళిపోతాము తరువాత మా ప్రాజెక్టుకు సంబంధించిన కొంతమంది వచ్చి మీ దగ్గర నుండి అన్ని డీటెయిల్స్ తీసుకొని వారిని బడిలో చేర్పించి మీ పిల్లలకి మంచి విద్యను అందిస్తారు సరేనా ఇక మేము వెళ్ళొస్తాము అంటూ వసుధార మను ఇద్దరూ వెళ్ళిపోతారు

Related posts

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N