NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa March 4 2024 Episode 167: ఒకరికి ఒకరు దూరంగా ఉన్నా మనసులో ప్రేమని పెంచుకుంటున్న స్వర అభిషేక్..

Paluke Bangaramayenaa  Today Episode March 4 2024 Episode 167 Highlights

Paluke Bangaramayenaa March 4 2024 Episode 167:  స్వర అని పిలుస్తాడు అభిషేక్. పిలిచావా అని అడుగుతాడు అభిషేక్. నేను మనసులో అనుకున్నది మీకు వినిపించింది అంటే మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారు కానీ బయటపడడం లేదు అn మనసులో అనుకుంటుంది స్వర. వెళ్ళొస్తాను సార్ అంటూ స్వర వెళ్తుంది. ఏమైంది తను కూడా నాలాగే ఫీల్ అవుతుందా అని అభిషేక్ అనుకుంటాడు. స్వర తనని చూస్తూ ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, అభిషేక్ స్వీట్లు తెచ్చి ఇంట్లో అందరికీ పంచుతాడు. స్వరకూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి స్వీట్ తెచ్చి పెడుతుంది. ఏమైంది నాన్న ఎందుకు స్వీట్లు పంచుతున్నావ్ అని యశోద అడుగుతుంది.న్యాయం గెలిచింది ధర్మం నిలబడింది ఆ వైజయంతికి కారాగార శిక్ష పడింది అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa  Today Episode March 4 2024 Episode 167 Highlights
Paluke Bangaramayenaa  Today Episode March 4 2024 Episode 167 Highlights

పిన్నికి శిక్ష పడింది అనే సంతోషం కన్నా అమ్మకు న్యాయం జరిగిందన్న ఆనందమే ఎక్కువ ఉంది నాన్న నాలో అని స్వర అంటుంది. అన్నయ్య అయితే వైజయంతి ఎప్పటికీ జైల్లోనే ఉండిపోతుందా అని కీర్తి అడుగుతుంది. ఆ విశాల్ కూడా జైల్లోనే ఉండిపోతాడు అని అభిషేక్ అంటాడు. స్వర కష్టాలన్నీ తీరిపోయినట్టే రా ఆ వైజయంతి విశాల్ జీవితం జైల్లోనే మగ్గిపోతుంది అని బామ్మ అంటుంది. ఆ దుర్మార్గురాలికి ఇన్నాళ్లకైనా జైలు శిక్ష పడింది నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు అని నాయుడు అనుకుంటాడు. అవును నాయనమ్మ స్వరకి ఇక అన్ని మంచి రోజులే అని అభిషేక్ చందనాన్ని స్వీట్ తీసుకోమని అంటాడు. నాకు వద్దన్నయ్య జలుబు ఎక్కువగా ఉంది దగ్గు వస్తది అని చందన అంటుంది. నువ్వు తీసుకో రవీంద్ర అని అభిషేక్ అంటాడు. నాకు వద్దులే బావ అని రవీంద్ర అంటాడు.

Paluke Bangaramayenaa  Today Episode March 4 2024 Episode 167 Highlights
Paluke Bangaramayenaa  Today Episode March 4 2024 Episode 167 Highlights

వాళ్ళిద్దరు స్వీట్ నాకే ఇచ్చేయ్ అన్నయ్య అని కీర్తి తీసుకుంటుంది స్వీట్లు. ఇన్ని రోజులు అవైజయంతి నిన్ను ఏం చేస్తుందో అని భయపడే దాన్ని అభి ఇకమీదట ఆ భయం నాకు లేదురా అని యశోద అంటుంది.ఏంటి బంగారం వీళ్లు ఇంత హ్యాపీగా ఉన్నారు మన గతి ఎటు కావాలి అని రవీంద్ర అంటాడు. అంత పలుకుబడి ఉన్న వైజయంతి మేడం తనని తాను కాపాడుకోలేక పోయింది ఇప్పుడు మనకు డబ్బులు ఎలా వస్తాయి అని చందన ఆలోచిస్తుంది. కట్ చేస్తే, అమ్మ ఈ నాల కైనా వైజయంతి పిన్నికి జైలు శిక్ష పడింది నీకు న్యాయం జరిగింది ఇన్నాళ్లు నాకు తోడుగా ఉండి అభిషేక్ సార్ నన్ను గెలిపించారు అందుకే అమ్మ నాన్న నన్ను అభి సార్ కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు అని స్వర వాళ్ళ అమ్మ ఫోటో పట్టుకొని అంటుంది. అయితే ఇంకేముంది త్వరలోనే మీ పెళ్లి అని వాళ్ళ అమ్మ అన్నట్టు వినిపిస్తుంది స్వరకి. అమ్మ నువ్వు ఇక్కడే నా చుట్టూనే ఉన్నావా నీ ఆశీర్వాదం నాకు దక్కినందుకు చాలా సంతోషం నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించావా అమ్మ అని స్వర అనుకుంటుంది.కట్ చేస్తే,స్వర కాఫీ తీసుకురా అని అభిషేక్ అంటాడు. బామ్మ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇదేంటి బామ్మ కాఫీ నువ్వు తెచ్చావు స్వర లేదా అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa  Today Episode March 4 2024 Episode 167 Highlights
Paluke Bangaramayenaa  Today Episode March 4 2024 Episode 167 Highlights

ఇది మరీ బాగుందిరా అభి స్వర వాళ్ళ ఇంటికి వెళ్లిపోయాక ఇక్కడ ఎందుకు ఉంటుంది రా ఇక్కడే ఉందనుకుంటున్నావా ఏంటి అని బామ్మ అంటుంది. మర్చిపోయానా స్వర ఇక్కడే ఉందని అని అభిషేక్ అనుకుంటాడు. స్వర ఇక్కడే ఉంది అనుకున్నాను కానీ ఇక్కడ లేదు అయినా సరే కవ్విస్తూనే ఉంది స్వర ఏం చేస్తూ ఉంటుంది అని అభిషేక్ ఆలోచిస్తాడు. కట్ చేస్తే,స్వర నిద్రలేచి హాల్లోకి వస్తుంది. గుడ్ మార్నింగ్ స్వరమ్మ గారు నాన్నకు మీకు ఏం టిఫిన్ చేయమంటారు అని వాళ్ళ పనిమనిషి అడుగుతుంది. ఈరోజుకి దోశ తిందాం కానీ డాడీ కి నేనే కాఫీ పెడతాను  నీ పని నువ్వు చేసుకోమని చెబుతుంది స్వర. స్వర వాళ్ళ నాన్నకి కాఫీ తెచ్చి ఇచ్చి అభి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి సార్ నిన్నటి నుంచి నాకు ఒకసారి కూడా ఫోన్ చేయలేదు ఒకవేళ నేనే ఎక్కువగా ఆశపడుతున్నానా లేదంటే ఆయన బాధ్యత అని ఫీల్ అవుతున్నారా ఆయన పనిలో పడి బిజీగా ఉంటేనే నేను చేస్తాను అని స్వర అనుకుంటుంది.

Paluke Bangaramayenaa  Today Episode March 4 2024 Episode 167 Highlights
Paluke Bangaramayenaa  Today Episode March 4 2024 Episode 167 Highlights

ఏంటి నిన్న అనంగా వెళ్లింది స్వర 24 గంటలు అవుతుంది ఇప్పటిదాకా నేను  గుర్తు రాలేదా లేదంటే గుర్తొచ్చినా ఫోన్ చేయకుండా కవ్విస్తూ ఉంటుందా ఇక్కడ ఉన్నప్పుడు గలగల మాట్లాడే దాని స్వర ఏంటో నువ్వు వెళ్ళాక ఏమి తోచట్లేదు ఎందుకు నాకు స్వర ఫోన్ చేయట్లేదు వాళ్ళ నాన్నని చూసుకోవడంలో పడి నన్ను మర్చిపోయిందా తను మర్చిపోతేనే నేనే చేస్తాను అని అభిషేక్ అనుకుంటాడు.ఎంత బిజీలో ఉన్నా నాకు ఫోన్ చేయకుండా ఉంటే నేనెందుకు చేయాలి?కనీసం మెసేజ్ చేసినా ఫోన్ చేస్తాను అని అభిషేక్ అనుకుంటాడు. సార్ ఎంత బిజీగా ఉండి ఫోన్ చేయకపోయినా కనీసం మెసేజ్

Paluke Bangaramayenaa  Today Episode March 4 2024 Episode 167 Highlights
Paluke Bangaramayenaa  Today Episode March 4 2024 Episode 167 Highlights

కూడా పెట్టలేదు ఫోన్ చేయలేదు నేను ఎందుకు చేయాలి అని స్వర ఊరుకుంటుంది. ఇంతలో డాక్టర్ గారు వస్తారు. రండి డాక్టర్ మా నాన్నకి నిన్నటి నుంచి టాబ్లెట్ వాడుతున్న కాస్త కూడా మార్పు లేదు అసలు నాన్న కోలుకుంటారా నాన్న మంచిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు దర్జాగా సింహంలా ఉండేవాడు అని స్వర అంటుంది. అలా ఉన్న మనిషి ఇలా వీల్ చైర్ లో పడిపోవడం నేను చూడలేకపోతున్నాను సార్ చూడండి మా నాన్నని అని స్వర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella