NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ – టీడీపీ – జ‌న‌సేన పొత్తు క్రెడిట్ అంతా ఈ ఒక్క‌డిదే… !

టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన పొత్తులు కుదర‌డం.. సీట్లు కూడా పంచుకోవ‌డం అయిపోయింది. కొంద‌రికి త‌గ్గాయి. మ‌రికొంద‌రికిపెరిగాయనే వాద‌న ఎప్పుడూ ఉంటుంది. పొత్తులు అంటే ఇంతే. ఎక్క‌డో ఒక చోట స‌ర్దు కోక త‌ప్ప‌ద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే, అస‌లు ఈ పొత్తులు పెట్టుకునేందుకు వెనుక జ‌రిగిన అనేక విష‌యాలు ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కు తెలియాల్సి ఉంది. ఇది చెప్ప‌కుండా.. ఉంటే ప్ర‌జ‌లు కూడా పొత్తుల‌ను ఎంత మేర‌కు రిసీవ్ చేసుకుంటార‌నేది క‌ష్ట‌మే.

కాబ‌ట్టి.. ఇప్పుడు పొత్తుల వెనుక ఎంత జ‌రిగింది? ఎన్ని ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి? అనేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. ప్ర‌ధానంగా పొత్తుల కార‌ణంగా.. ఎక్కువ‌గా ప్ర‌త్య‌క్ష న‌ష్టం జ‌న‌సేన‌కే జ‌రుగుతోంది. ఆ పార్టీనాయ‌కులు బ‌హిరంగంగా చెబుతున్నా.. చెప్ప‌క‌పోయినా.. అంత‌ర్గ‌తంగా మాత్రం ఇదే ఉంది. అయితే.. ఇలా ఏరికోరి పొత్తులు పెట్టుకోవ‌డానికి ప్ర‌ధానంగా ముందుకు వ‌చ్చింది జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌. ఢిల్లీ చుట్టూ.. ఆయ‌న అనేక సార్లు తిరిగారు.

కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో అప్పాయింట్ మెంటు ఇస్తామ‌ని ఇవ్వ‌కుండా తిప్పి పంపిన ఘ‌ట‌న‌లు కూడా రెండేళ్ల కింద‌ట చ‌ర్చకు వ‌చ్చాయి. ఇక‌, టీడీపీకి, బీజేపీకి మ‌ధ్య 2019లో ఎర్ప‌డిన భారీ గ్యాప్‌ను ఫిల్ చేయ‌డంలో ప‌వ‌న్ త‌న శ‌క్తినంతా ధార పోశారు. కొన్ని గంట‌ల త‌ర‌బ‌డి.. అమిత్ షా ఆఫీసు ముందు వేచి ఉండాల్సిన ప‌రిస్థితి కూడా వ‌చ్చింది. ఇదంతా ప‌వ‌న్ ప‌డిన క‌ష్ట‌మే. ఇక‌, ఇటీవ‌ల కూడా.. టీడీపీని ఎన్డీయే కూట‌మిలో చేర్చుకునేందుకు ఆయ‌న ప‌ట్టుబ‌ట్టారు.

రోజుల త‌ర‌బ‌డి శ్ర‌మించారు. సో.. మొత్తానికి పొత్తు సాధించారు. ఇక‌, ఇప్పుడుబీజేపీ టికెట్ల విషయంలో ప‌ట్టుబ‌డితే.. త‌నే ఒకటి రెండు త‌గ్గించుకుని ప‌వ‌నే త్యాగం చేశారు. స‌రే.. ఇదంతా ఎందుకు? ఆయ‌న స్వార్థం ఏమైనా ఉంద‌? అంటే.. లేద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. ఖ‌చ్చితంగా ఇదంతా చేసింది పార్టీ కోసం.. పార్టీని న‌మ్ముకున్న వారి కోస‌మే.

మ‌రోసారి వైసీపీ వ‌స్తే.. జ‌న‌సేన నాయ‌కులు క‌నీసం బ‌య‌ట తిరిగే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని.. వారిని కాపాడుకునేందుకే వైసీపీని గ‌ద్దె దించాల‌న్న ల‌క్ష్యంతో సేనాని దిగి వ‌చ్చి.. పొత్తుల‌కు ప‌రోక్ష నాయ‌క‌త్వం వ‌హించారు. దీనిని అర్ధం చేసుకుని, క్షేత్ర‌స్థాయిలో దీనిని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తే.. అంతిమ విజ‌యం జ‌న‌సేన‌దే అన‌డంలో సందేహం లేదు.

Related posts

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ పై తీర్పు రిజర్వ్

sharma somaraju

Actress Hema: బెంగళూరు పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా .. హజరుకాలేనంటూ లేఖ

sharma somaraju

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి

sharma somaraju

Graduate MLC Election 2024: తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

sharma somaraju

ఏపీ ఎన్నిక‌లు: ప్ర‌మాదంలో ఎగ్జిట్ పోల్స్ ఎందుకు… ?

Swati Maliwal: కోర్టులోనే కన్నీళ్లపర్యంతమైన రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ .. బిభవ్ కుమార్ బెయిల్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఆ మూవీ మీదే!

kavya N

Road Accidents: ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు .. 11 మంది మృతి

sharma somaraju

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

ఏపీ మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతి

sharma somaraju

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Arvind Kejriwal: బెయిల్ పొడిగించాలంటూ కేజ్రీవాల్ పిటిషన్

sharma somaraju

ష‌ర్మిల గెలిస్తే క‌ష్ట‌మే… వైసీపీలో ఇదో కొత్త‌ టెన్ష‌న్‌…!