NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మూడు నెల‌ల్లోనే కేసీఆర్ ఫ్యామిలీకి వ‌ణుకు… కేటీఆర్‌, క‌వితకు ఇంత భ‌య‌మా..?

ప్రత్యేక తెలంగాణ కోసం పుట్టిన టిఆర్ఎస్ పార్టీ అనంతరం భారతీయ రాష్ట్ర సమితిగా మారింది. 2014 – 2018 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్న‌ర సంవత్సరాల పాటు కేసిఆర్ ఏక చక్రాధిపత్యంగా పరిపాలన చేశారు. 2018లో టిఆర్ఎస్ వరుసగా రెండోసారి గెలిచాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అసలు తెలంగాణలో మరో 20 ఏళ్ల వరకు బిఆర్ఎస్‌కు తిరిగి ఉండదని అనుకున్నారు. పశ్చిమ బెంగాల్‌, త్రిపురలలో కమ్యూనిస్టులు ఎలా అయితే రెండున్నర దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలారో కెసిఆర్ కూడా తెలంగాణను అలాగే యేల‌తారని అందరు అనుకున్నారు.

కట్ చేస్తే గత డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయింది. సాధారణ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయి మూడు నెలలు అయిందో లేదో అసలు ఆ పార్టీ గ్రాఫ్ పూర్తిగా దిగజారిపోతోంది. మరో నెల రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి.. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్‌ నుంచి పోటీ చేసేందుకు కూడా ఎంపీ స్థాయి అభ్యర్థులు ఎవరు దొరకడం లేదు. మామూలుగా అయితే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎన్నికలలో పోటీ చేసేందుకు బాగా ఉత్సాహం చూపిస్తారు. అయితే ఇప్పుడు వారు కూడా దండం పెట్టేస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికలలో మల్కాజ్‌గిరి పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలలో టిఆర్ఎస్ గెలిచింది. అయితే ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు సీటుకు శంబిపూర్ రాజు పేరు ఖరారు చేశారు. ఆయన ఎంపీ స్థాయి అభ్యర్థి అని ఎవరు అనుకోవటం లేదు. ఇక జహీరాబాద్ కు గాలి అనిల్ కుమార్.. చేవెళ్ళకు కాసాని జ్ఞానేశ్వర్ పేర్లు ఖరారు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు చోట్ల బీర్ఎస్ కు భారీ లీడ్ వచ్చింది.. కానీ అభ్యర్థులను చూస్తే అసలు వీళ్ళు గెలిచేందుకే వెళ్లిన పోటీ పెట్టారా ? అన్న సందేహం ఎవరికైనా వస్తుంది.

మామూలుగా కేసీఆర్ కుమార్తె కవిత – నిజామాబాద్ నుంచి కేటీఆర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకో వీరిద్దరికీ తేడా కొడుతోంది.. పోటీకి దూరంగా ఉంటున్నారు. కవిత అయితే నిజామాబాద్ లో పోటీ చేస్తానని ముందు నుంచి చెబితే వచ్చి తీరా ఇప్పుడు చేతులు ఎత్తేశారు. అసలు ఆమె బిఆర్ఎస్ తరఫున కాకుండా తెలంగాణ జాగృతి పేరుమీద రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు. కవితను నిజామాబాద్ లో నిలబెట్టడం రిస్క్ అనుకుంటే మెదక్లో నిలబెట్టవచ్చు.. అది బీఆర్ఎస్ పార్టీ కంచుకోట.

కానీ కెసిఆర్ మెదక్ లో కూడా కవితను పోటీ చేయించేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇక కెసిఆర్ మెదక్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు.. అయితే ఇప్పుడు కేసీఆర్ కూడా వెనకంజ‌ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా కేవలం మూడు నెలల్లో తెలంగాణలో బీఆర్ఎస్ సీన్ ఏ స్థాయిలో రివర్స్ అయిందో.. చివరకు పార్లమెంట్కు పోటీ చేసేందుకు కేసిఆర్ కుటుంబ సభ్యులే ఏ స్థాయిలో భ‌యపడుతున్నారో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N