Hanuman OTT response: 2024 సంక్రాంతి బరిలో ఎటువంటి అంచనాలు లేకుండా చాలా చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో ఫస్ట్ ప్లేస్ ని సొంతం చేసుకుంటుంది హనుమాన్. హీరో మరియు డైరెక్టర్ పై ప్రేక్షకులకి ఎటువంటి అవగాహన లేకపోయినా వీరిద్దరూ అందించిన కథ మరియు యాక్టింగ్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. 40 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ను రాబట్టింది. అంటే ఈ మూవీ ప్రేక్షకుల్లోకి ఏ విధంగా వెళ్లిందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక థియేటర్లో షేక్ చేసిన సినిమాలు ఓటిటిలో కూడా ఫుల్ రెస్పాన్స్ దక్కించుకుంటేనే ఆ సినిమాని హిట్ అంటారు. ఇక మన హనుమాన్ ఓటిటి లోకి ఇటీవల స్ట్రీమింగ్ అయ్యేందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ యొక్క ఒరిజినల్ తెలుగు వర్షన్ ఆదివారం అనగా మార్చ్ 17వ తారీఖున g5లో స్ట్రీమింగ్ అయింది. అదేవిధంగా జియో టీవీలో హిందీ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లో భారీ రికార్డులను సృష్టించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ లో కూడా తన హవా నిరూపించుకుంటుంది.
నిజానికి ఈ మూవీ ఓటిటి లోకి ఎప్పుడో రావాలి. కానీ కాస్త లేట్ చేశారు మేకర్స్. ముందు ఈ మూవీ ఓటిటి హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని నెట్ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఓటిటి రిలీజ్ కి ఒక్కరోజు ముందు జి 5 లో స్ట్రీమింగ్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ప్లాట్ఫారం ఏదైనా సినిమాకి మాత్రం రికార్డులు బద్దలు అవ్వాల్సిందనే చెప్పొచ్చు.
తాజాగా ఈ మూవీ జీ ఫైవ్ లో రిలీజ్ అయిన 11 గంటలకే అదిరిపోయే యువర్ షిప్ ను దక్కించుకుంది. తొలి 11 గంటల్లోనే హనుమాన్ మూవీ 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు జి 5 వారు వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ..” ఓటిటి హనుమాన్ పాట.. రికార్డుల వేట. ఢీ కొట్టేందుకు ఎవరైనా రెడీగా ఉన్నారా? అయినా మహేష్ సినిమానే ఈ మూవీ ని ఏం చేయలేకపోయింది. కనుమ సినిమాలు ఎంత లే. రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.