NewsOrbit
జాతీయం న్యూస్

CAA: సీఏఏ పై సుప్రీం కోర్టులో విచారణ   

CAA: కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై స్టే ఇవ్వాలని కోరుతూ  దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇవేళ (మంగళవారం) విచారణ చేపట్టింది. పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం తన స్పందన తెలియజేయాలని ఆదేశించిన ధర్మాసనం .. తదుపరి విచారణకు ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించగా.. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ల పై విచారణ పూర్తి అయ్యే వరకూ సీఏఏ నిబంధనలపై స్టే విధించవద్దని తుషార్ మెహతా కోరారు. వీటిపై పూర్తిగా స్పందించేందుకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆదేశించింది.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుపై పలు వర్గాలు నిరసనలు తెలుపుతున్నాయి. కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ దాఖలు చేసిన పిటిషన్ ను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. లోక్ సభ ఎన్నికల వేళ వివాదాస్పద చట్టం అమలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మతం ఆధారంగా సీఏఏ అమలు చేస్తున్నారనీ, ప్రత్యేకించి ముస్లింలపై వివక్ష  చూపుతుందనీ ఇతర పిటిషనర్లు పేర్కొన్నారు.

మతపర విభజన వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం వారి హక్కులను ఉల్లంఘించడం అవుతోందని ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం సంఘాలతో పాటు టీఎంసీ నేత ముహువా మొయిత్రా, కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అసొం కాంగ్రెస్ నేత దేబబ్రద సైకియా, ఎన్జీవో రిహయ్ మంచ్ తదితరులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు.

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

Related posts

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N