NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గుంటూరు వైసీపీలో ఆ లీడ‌ర్ క‌ల‌క‌లం… మంత్రి ప‌ద‌వి కోసం పంతం..?

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీలో ముఖ్య నాయ‌కులు చేజారుతున్నారు. ఇప్ప‌టికే టికెట్లు రాని ఎస్సీ నాయ‌కులు వ‌రుస పెట్టి పార్టీ మారిపోయారు. అయితే.. వీరిలో ఒక‌రిద్దరు కీల‌క పార్టీలోకి వెళ్ల‌గా.. మ‌రిం త మంది కాంగ్రెస్ వైపు క్యూ క‌ట్టారు. పూత‌ల‌ప‌ట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌. బాబు తాజాగా ష‌ర్మిల స‌మ‌క్షం లో పార్టీ మారారు. ఇక‌, చింత‌ల‌పూడి ఎమ్మెల్యే ఎలీజా.. కొన్ని రోజుల కింద‌ట ఇదే ప‌నిచేశారు. ఇక, ఇప్పుడు మ‌రో పేరు తెర‌మీదికి వ‌చ్చింది.. అదే డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద‌రావు.

గ‌తంలో మంత్రిగా చేసిన ఆయ‌న‌.. ప్ర‌స్తుతం వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు ఈయ‌న కూడా గుంటూరు రాజ‌కీయాల్లో కాక పెట్టారు. అది కూడా వైసీపీలో క‌ల‌క‌లం రేగే రేంజ్‌లో ఆయ‌న రాజ‌కీయాల‌ను వేడెక్కించారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో డొక్కా.. తాడికొండ‌(ఎస్సీ) సీటును ఆశించారు. అయితే.. ఈ సీటు విష యంలో ముందు ఆశ పెట్టిన వైసీపీ.. త‌ర్వాత మ‌న‌సు మార్చుకుని.. ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రిత‌ను రంగంలోకి దింపింది. అప్ప‌ట్లో డొక్కా పోరాటం చేశారు.

అయినా.. ఆయ‌న‌కు టికెట్ రాలేదు. ఇక అప్ప‌టి నుంచి మౌనంగా ఉన్నారు. మేక‌తోటి సుచ‌రిత‌కు స‌హ‌క రించాల‌న్న పార్టీ ఆదేశాల‌ను కూడా డొక్కా ప‌ట్టించుకోవ‌డంలేదు. పైగా త‌న‌కు ఆరోగ్యం బాగోలేద‌ని చెబు తున్నారు. దీంతో పార్టీలో ఒక విధ‌మైన గ్యాప్ అయితే వ‌చ్చింది. ఇదిలావుంటే.. మ‌రోవైపు కీల‌క‌మైన డొక్కాను తిరిగిత‌న గూటికి చేర్చుకునేందుకు టీడీపీ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. దీంతో డొక్కా కూడా.. ఎలానూ ప్రాధాన్యం లేని పార్టీలో ఉండ‌డం ఎందుకులే అని అనుకుని.. ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నార‌ని స‌మాచారం.

అయితే.. ఈ విష‌యం తెలిసిన వైసీపీ అలెర్ట‌యింది. స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే మంత్రి అంబ‌టి రాంబాబును రంగంలోకి దింపిన పార్టీ అధిష్టానం.. చ‌ర్చ‌ల‌కు తెర‌దీసింది. అయితే.. బ‌ల‌మైన హామీ ద‌క్క‌లేదు. పార్టీలో ఉంటే.. మెరుగైన ప‌ద‌విని ఇస్తామ‌ని చెబుతున్నా.. డొక్కాఆశిస్తున్న మంత్రి ప‌ద‌విపై మాత్రం ఎలాంటి హామీ ద‌క్క‌డం లేదు. అయితే.. ఇదే హామీ టీడీపీలో ద‌క్కుతుందా? లేదా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. వైసీపీలో ఉండాలంటే మాత్రం మంత్రి ప‌ద‌వి హామీ కోసం ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు పార్టీలో చ‌ర్చ సాగుతోంది. మ‌రి వైసీపీ ఏం చేస్తుందో చూడాలి. ఏదేమైనా డొక్కా విష‌యంలో వైసీపీ స‌రైన నిర్ణ‌యం తీసుకోక‌పోతే.. ఆయ‌న సైకిల్ ఎక్క‌డం ఖాయ‌మేనని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N