NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కూట‌మి బ‌లం + తండ్రి వార‌స‌త్వం = ‘ టీడీపీ హ‌రీష్‌ ‘ గెలుపు ఖాయం.. !

కాలం క‌లిసి రావ‌డ‌మంటే ఇలానే ఉంటుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినప్ప‌టికీ.. ఇప్పుడు ఆ యువ నేత‌కు ప‌ట్టం క‌ట్టేందుకు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు రెడీగా ఉన్నారు. అదే అమ‌లాపురం ఎస్సీ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి టీడీపీ నేతృత్వంలోని కూట‌మి పార్టీల అభ్య‌ర్థిగా గంటి మోహ‌న‌చంద్ర‌బాల యోగి కుమారుడు, యువ నేత‌ హ‌రీష్ మాధుర్ పోటీ చేస్తున్నారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న పోటీ చేశారు. అయితే.. అప్ప‌ట్లో వైసీపీ హవా, మ‌హిళా నాయ‌కురాలు చింత అనురాధ సెంటిమెంటుతో గంటి వార‌సుడు గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. కానీ, గ‌ట్టి పోటీ అయితే ఇచ్చారు.

ఇక‌, ఇప్పుడు రెండు ర‌కాలుగా మాధుర్‌కు కాలం క‌లిసి వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పోటీ చేస్తున్నారు. అయితే.. ఆయ‌న ముందుగానే అస్త్ర శ‌స్త్రాలు వ‌దిలే శార‌నేటాక్ ఉంది. ఎందుకంటే.. త‌న‌కు, త‌న‌స్థాయికి మించిన సీటుగా ఆయ‌న భావిస్తున్నారు. దీంతో ప్రచారంలో ఇంకా స్పీడు అందుకోలేక పోతున్నారు. అంతేకాదు.. నిరాశ నిస్పృహ‌ల‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీలో ఇక్క‌డ ఊపు క‌నిపించ‌డం లేదు. పైగా కోన‌సీమ జిల్లా పేరు మార్పు నేప‌థ్యంలో జ‌రిగిన వివాదాలు, మంత్రి ఇల్లు ద‌హ‌నం.. కేసులు.. ఇలా.. ఓ వ‌ర్గాన్ని టార్గెట్ చేసుకోవ‌డం వంటివి సెగ పుట్టిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఓ మంత్రిపై ఉన్న కోపం.. ఈ ఎన్నిక‌ల్లో పార్టీకి సెగ పెడుతోంది.

ఇంకోవైపు.. టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన‌ కూటమి అభ్యర్ధి, టీడీపీ నేత‌ గంటి హరీష్‌మాధూర్ ప్రచారంలో దూకుడు గా వ్యవహరిస్తు న్నారు. ఇప్పటికే మండపేట, ముమ్మిడివరం, కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాలతో పాటు అమలాపురంలో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంతేకాదు.. జ‌న‌సేనలో యువ‌త‌ను క‌లుపుకొని పోతున్నారు. ఇక‌, సొంత పార్టీ టీడీపీలో అంద‌రూ గంటి వార‌సుడికే జై కొడుతున్నారు. దీనికి తోడు తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత‌.. గంటి కుటుంబం నుంచి రాజ‌కీయంగా ప్రాధాన్యం ల‌భించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో ఈ సారైనా గంటి కుటుంబాన్ని గెలిపించుకుని తీరాల‌న్న క‌సి.. ఇక్క‌డి ప్ర‌జ‌ల్లో స్ఫ‌స్టంగా క‌నిపిస్తోంది. గత ఎన్నిక ల్లో ఓటమికి సంబందించి సానుభూతి, జీఎంసీ బాలయోగి కుమారుడు కావడం ఆయనకు కలిసొస్తున్నారు. ఇంకో వైపు జ‌న‌సే న యూత్ ఓట్లు.. యువ నాయ‌కుడు అనే టాక్ కూడా గంటికి అనుకూలంగా మారాయి. మొత్తంగా చూస్తే.. అమ‌లాపురం స్థానంలో ఈ ద‌ఫా టీడీపీ గెలుపు గుర్రం ఎక్కిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కూట‌మి బ‌లం.. తండ్రి వార‌స‌త్వం.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఇలా.. ప‌లు అంశాలు ఈ ద‌ఫా గంటి మాధుర్‌కు విజ‌యాన్ని అందించ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

Related posts

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N