NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: చంద్రబాబుకు ఓటు వేయటమంటే పులి నోట్లో తల పెట్టినట్లే – వైఎస్ జగన్

YSRCP: చంద్రబాబుకు ఓటు వేయటమంటే పులి నోట్లో తల పెట్టినట్లేనని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల బహిరంగ సభలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే ఇప్పుడు ఉన్న పథకాలు అన్నీ ఆపేస్తాడని అన్నారు. ప్రజల ఎజెండాతో మనం జెండాలు జతకట్టిన వారని ఒడించి సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా అని ప్రశ్నించారు. ప్రజల రాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని, మహిళల రాజ్యాని, పిల్లల రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు వస్తున్న కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా! అని ప్రశ్నించారు. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగేవి కాదు. ఈ ఎన్నికలు పిల్లల వారి చదువు, అక్కచెల్లెమ్మల సాధికారతం, రైతుల సంక్షేమం, పేద వర్గాలకు న్యాయం వంటివన్ని కొనసాగించాలా.. లేదా వెనక్కి వెళ్లాలా అని, మన భవిష్యత్తు ఎలా ఉంటుందని నిర్ణయించేదే మన ఒటు అని అన్నారు.

ఇది జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు.. ఇది పేదలకు మోసాలకు మధ్య జరిగే ఎన్నిక, మీ బిడ్డ జగన్ పేదల పక్షం.. కాబట్టి ప్రతి ఒటు మీ కుటుంమంతా వచ్చే ఐదేళ్లు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తుంది. ఈ ఐదేళ్లలో జరిగిన సంక్షేమం కొనసాగాలంటే జగన్ కి ఒటు వేయలి, రద్దు చేయాలనుకుంటే చంద్రబాబుకు వేయాలి అని అన్నారు. బాబు దారి అడ్డ దారి, బాబు విలువలు పాతాళంలోనే ఉంటాయి, విలువలు, విశ్వనీయత అంటే తెలిదు.. చంద్రబాబు మార్క్ రాజకీయమేమింటి అంటే అబద్ధాలు, కుట్రలు, మోసాలు..అని ధ్వజమెత్తారు. తన మనిషి నిమ్మగడ్డ తో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. పేదవారికి ఇంటికి వెళ్లి వాలంటీర్లు పింఛన్ ఇవ్వకూడదట, అలా చేస్తే నేరం అంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబువి శాడిస్టు చర్యలు అంటూ విమర్శించారు.

పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్క స్కీమ్ అయినా గుర్తువస్తుందా? అని ప్రశ్నించారు.  పేదలకు మంచి చేసినట్లు చెప్పుకోవటానికి లేని వ్యక్తి చంద్రబాబు మన ప్రత్యర్ది, మరో వంక మీ బిడ్డ ప్రతి గ్రామంలో, ఇంటి ఇంటికి, అక్కచెల్లమ్మలకు, పిల్లలకు, అవ్వతాతలకు నేరుగా బటన్ నొక్కి రూ.2.70 లక్షల కోట్లు అందించాం. మెనిఫేస్టోలోని 99శాతం వాగ్ధానాలను అమలు చేసి చూపించి ప్రజల ముందు సిద్ధం అంటు వచ్చాం. జగన్ మార్క్ ప్రభుత్వాన్ని ఈ 58 నెలల్లో స్థాపించాం అని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు జరగని విధంగా 13 జిల్లాను 26 జిల్లాలుగా మార్చాం, పట్టణాల్లో, గ్రామాల్లో సచివాలయాలు కనిపిస్తున్నాయి. కొత్తగా 4 పోర్టులు, 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు నిర్మాణాల్లో ఉన్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి.. ఇవన్నీ జరిగింది మీ బిడ్డ హయంలో మాత్రమే అని పేర్కొన్నారు.

చంద్రబాబు దోచుకోవటానికి, దోచుకున్న వాటిని పంచుకోవటానికి అధికారాన్ని ఉపయోంగిచాడు.. తేడా గమనించండి, అదే బడ్జెట్, అదే రాష్ట్రం.. మీ బిడ్డ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అలోచన చేయండని విజ్ఞప్తి చేసారు. చంద్రబాబు అభివృద్ధి చేసి ఉంటే పొత్తులు ఎందుకు అని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే మోసపు మాటలు గుర్తుకు వస్తాయన్నారు. 2014 లో ఇదే కూటమి ఇచ్చిన హామీలు గుర్తున్నాయా అని ప్రశ్నించారు. రైతుల రుణ మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా..? పొదుపు సంఘాల రుణ మాఫీ చేస్తానన్నాడు .. చేశాడా..? ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా..? ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు .. నిర్మించాడా..? అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావించి 99 శాతం హామీలను నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చానని అన్నారు జగన్. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడాలని జగన్ విజ్ఞప్తి చేశారు.

TDP: రఘురామకు చంద్రబాబు ఏ స్థానం కేటాయిస్తారు..?

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju