NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CID: తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాలు దగ్ధం .. టీడీపీ నేతలు ఏమంటున్నారంటే ..?

AP CID: తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో పలు పత్రాలను సిబ్బంది దగ్ధం చేశారు. అయితే సిబ్బంది పత్రాలను దగ్ధం చేస్తున్న సమయంలో పలువురు వీడియో తీశారు. హెరిటేజ్ సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్లను కార్యాలయ సిబ్బంది తగులబెట్టారు. హెరిటేజ్ పత్రాలు దగ్దం చేయడంపై టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

హెరిటేజ్ సంస్థకి సంబంధించి పలు కీలక పత్రాలతో సహా ఇతర డాక్యుమెంట్స్ ను సిట్ సిబ్బంది తగలబెట్టింది. అయితే ఈ పత్రాలను సిట్ అధిపతి కొల్లి రఘురామరెడ్డి ఆదేశాల మేరకు వ్యక్తిగత సిబ్బందే తగలబెట్టారని సిట్ సిబ్బంది చెబుతున్నారు. హెరిటేజ్ సంస్థ కీలక పత్రాలు సహా  ఇతర డాక్యుమెంట్స్ అందులో ఉన్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ ఆదేశాలతో చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు సిట్ అక్రమ కేసులను పెట్టిందని చెప్పారు.

చంద్రబాబుకు వ్యతిరేకంగా వాంగ్మూలం కోసం సీఐడీ అనేక మంది పై ఒత్తిడి చేసిందని తెలిపారు. అనుమతులు లేకుండా పలు దస్త్రాలు ఎలా వచ్చాయని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల విచారణ సందర్భంలో ప్రశ్నించారు. కేసుతో సంబంధం లేని పత్రాలు మీ చేతికి ఎలా వచ్చాయని నిలదీశారు. ఇవేళ సిట్ కార్యాలయం కాంపౌండ్ లో పలు పత్రాలను దహనం చేయడంపై టీడీపీ నేతలు స్పందించారు.  లోకేష్ విచారణ సమయంలోనే బ్రాహ్మణి, భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ ఎలా వచ్చాయని ప్రశ్నించామని, ఆ పత్రాలు ఎలా వచ్చాయో ఇంత వరకు సమాధానం చెప్పలేదని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు.

ఎవరి ఉత్తర్వులతో హెరిటేజ్ పత్రాలు తగులబెట్టారో డీజీపీ చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్మ రామయ్య డిమాండ్ చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మాట్లాడుతూ .. సిట్, సీఐడీ తప్పు లేకపోతే హెరిటేజ్ ఫుడ్స్ పత్రాలు తగలబెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఓటమి భయంతో సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర భద్రత పెంచాలని కోరారు.

కాగా, దీనిపై ఏపీ సీఐడీ స్పందించింది. మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది. నిందితులకు సంబంధించి ఐటీ రిటర్న్స్ ను సంబంధిత శాఖ నుండి అధికారికంగానే తీసుకోవడం జరిగిందని, సంబంధిత పత్రాలను కేసుకు సంబంధించి చార్జిషీట్ తో కోర్టునకు సమర్పించడం జరిగిందన్నారు. వేస్ట్ (పనికిరాని) పత్రాలను మాత్రమే కాల్చివేయడం జరిగిందన్నారు. దీనిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని సీఐడీ పేర్కొంది.

Janasena: జనసేనకు షాక్ ఇచ్చిన కీలక నేత పోతిన మహేష్ .. పార్టీకి పదవికి రాజీనామా

AP CID note

 

Related posts

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju