Radhika Apte: ఇటీవల కాలంలో ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. సినిమాలకు పోటీగా వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు. స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతో మంది సినీ తారలు ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ జాబితాలో హాట్ బ్యూటీ రాధిక ఆప్టే ఒకటి. నార్త్ తో పాటు సౌత్ సినీ ప్రియులకు కూడా రాధిక ఆప్టే సుపరిచితమే. తమిళనాడులోని వెల్లూరులో 1985న మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో రాధిక ఆప్టే జన్మించింది. ఆమె తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. తండ్రి డా. చారుదత్ ఆప్టే న్యూరో సర్జన్ మరియు పూణేలో సహ్యాద్రి హాస్పిటల్ ఛైర్మన్ గా ఉన్నారు. అలాగే తల్లి జయశ్రీ ఆప్టే పేరున్న అనస్థీషియాలజిస్ట్.
అయితే రాధిక ఆప్టే మాత్రం తన తల్లిదండ్రుల బాటలో వెళ్లేందుకు ఇష్టపడలేదు. టీనేజ్ నుంచే రంగుల ప్రపంచంపై మక్కువ పెంచుకుంది. నటన మరియు డ్యాన్స్ లో శిక్షణ తీసుకున్న రాధికా ఆప్టే.. మొదట థియేటర్ ఆర్టిస్ట్ గా కొనసాగింది. 2005లో వాహ్! లైఫ్ హో తో ఐసీ! అనే హిందీ చిత్రంలో చిన్న పాత్రను పోషించి వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత అంతహీన్ అనే సినిమాతో బెంగాలీలోకి, సామంతర్ చిత్రంతో మరాఠీలోకి ప్రవేశించింది. 2010లో రక్త చరిత్ర చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కెరీర్ ఆరంభంలో సహాయక పాత్రలను పోషించిన రాధికా ఆప్టే.. ఆ తర్వాత హీరోయిన్ గా నిలదొక్కుకుంది.
సౌత్ సినిమాలతో నేమ్ అండ్ ఫేమ్ సాంపాదించుకుని.. ఆపై బాలీవుడ్ లో బిజీ అయింది. తెలుగులో ఈ అమ్మడు రక్తచరిత్ర, రక్తచరిత్ర 2, లెజెండ్, లయన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ మరియు హాలీవుడ్ లో సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. అయితే రాధికా ఆప్టే గత రెండేళ్ల నుంచి వెండితెరపై కంటే డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌పైనే ఎక్కువగా బిజీగా గడుపుతోంది. బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఓటీటీలో దూసుకుపోతోంది.
ఇప్పటికే సేక్రెడ్ గేమ్స్, ఘోల్, ఓకే కంప్యూటర్, మేడ్ ఇన్ హెవెన్ వంటి వెబ్ సిరీస్‌లలో రాధికా ఆప్టే నటించింది. తనదైన యాక్టింగ్ తో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. అలాగే సినిమాల కన్నా వెబ్ సిరీస్ ల ద్వారా రాధికా ఆప్టే ఎక్కువ సంపాదిస్తుందని ఇన్సైడ్ జోరుగా టాక్ నడుస్తోంది. ఈ టాలెంటెడ్ బ్యూటీ ఒక్కో వెబ్ సిరీస్ కు రూ. 4 కోట్లకు తగ్గకుండా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుందని అంటున్నారు. ఓటీటీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీనటులు జాబితాలో రాధికా ఆప్టే ఒకరని కూడా చెబుతున్నారు.