NewsOrbit
జాతీయం న్యూస్

Supreme Court: యూట్యూబర్ అరెస్టుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: సోషల్ మీడియాల్లో విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ జైలుకు పంపడం సరికాదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై విమర్శలు చేశాడన్న ఆరోపణలతో అరెస్టయిన ఓ యూట్యూబర్ కు సుప్రీం కోర్టు బెయిల్ ను పునరుద్దరించింది. ఈ సందర్భంగా తమిళనాడు సర్కార్ పై సుప్రీం ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

వివరాల్లోకి వెళితే.. సీఎం స్టాలిన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తమిళనాడుకు చెందిన యూట్యూబర్ దురై మురుగన్ ను 2021  అక్టోబర్ నెలలో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతనికి బెయిల్ మంజూరైంది. అయితే న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్చను దుర్వినియోగం చేశాడన్న కారణంగా 2022 లో మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ అతని బెయిల్ ను రద్దు చేసింది.

దీంతో మురుగన్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. మద్యంతర బెయిల్ లభించింది. అప్పటి నుండి అతను బయటే ఉన్నాడు. ఈ క్రమంలోనే రెగ్యులర్ బెయిల్ రద్దును సవాల్ చేస్తూ యూట్యూబర్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంలో తమిళనాడు సర్కార్ పై ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.

యూట్యూబ్ లో విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ అరెస్టు చేసుకుంటూపోతే .. ఎన్నికల ముందు ఎంత మందిని జైల్ లో పెడతారు అని ప్రశ్నించింది. కోర్టు ఇచ్చిన స్వేచ్చను అతను దుర్వినియోగం చేసినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని తెలిపింది. అందువల్ల అతనికి రెగ్యులర్ బెయిల్ ను పునరుద్దరిస్తూ తీర్పు వెల్లడించింది.

AP CID: తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాలు దగ్ధం .. టీడీపీ నేతలు ఏమంటున్నారంటే ..?

Related posts

IPS AB Venkateswararao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్ .. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

sharma somaraju

ఈవిఎం ధ్వంసం ఘటనలో ఇద్దరు అధికారులపై ఈసీ వేటు

sharma somaraju

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులకు ఊరట ..జూన్ 6 వరకూ అరెస్టు వద్దు

sharma somaraju

 బంగాళాఖాతంలో అల్పపీడనం .. ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక

sharma somaraju

AP High Court: మంత్రి అంబటి, మోహిత్ రెడ్డి పిటిషన్లు డిస్మిస్ చేసిన హైకోర్టు

sharma somaraju

Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో పురోగతి .. మరో ముగ్గురు అరెస్టు

sharma somaraju

Prashant Kishor: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్ వైరల్

sharma somaraju

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

BRS: లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతల పరిస్థితి అంత దారుణంగా ఉంటుందా..?

sharma somaraju

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

TDP: టీడీపీ నేతల గృహ నిర్బంధం

sharma somaraju