NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్ సినిమా

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

Nuvvu Nenu Prema Today Episode  April 18 2024 Episode 601 highlights

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీ పద్మావతి ఇద్దరు రౌడీలను కొట్టి అక్కడ నుంచి బయటపడతారు.పద్మావతి కొంత దూరం నడిచిన తర్వాత అలసిపోతుంది విక్కీ ఎందుకు పద్మావతి నా కోసం ఇంత ధైర్యం చేసావు అని అడుగుతాడు మీరు లేకుండా నేను ఉండలేను సారు అని. ఇక ఇద్దరు కలిసి అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గరికి వెళ్తారు అక్కడ ఒకచోట ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టి చుట్టూ జెండాలు పాతి ఉంటాయి ఆంజనేయ స్వామిని చూస్తూ పద్మావతి సీతారాములన్ని కలిపిన ఈ ఆంజనేయస్వామి సాక్షిగా మనం కూడా ఎప్పటికీ విడిపోకుండా ఉండాలి సారు అని అంటుంది. నీ ప్రేమ అర్థం చేసుకున్న తర్వాత నేనింకా నిన్ను ఎలా వదులుకుంటాను పద్మావతి మీ ఆంజనేయ స్వామి సాక్షిగా మనం ఇక నుంచి బయటపడాలి మనకు ఈయనే రక్ష అని ఇద్దరు ఆంజనేయస్వామికి దండం పెట్టుకొని అక్కడే ఉన్న జెండాను తీసుకొని, కాసేపు అక్కడే గడిపి తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్లడానికి ముందుకు వస్తారు ఇక పద్మావతి విక్కీ ఇద్దరు అడవి మార్గం నుండి బయట పడడానికి చూస్తూ ఉంటారు ఇక ఈ ఆంజనేయ స్వామి జెండాని మనకి రక్షగా ఉంటుంది పద్మావతి ఎవరు వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు నువ్వు ధైర్యంగా ఉండు అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode  April 18 2024 Episode 601 highlights
Nuvvu Nenu Prema Today Episode  April 18 2024 Episode 601 highlights

ఇక పద్మావతి వికీ ఇద్దరు అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా పద్మావతి మీరు లేకుండా నేను బతకలేని సారు అని అంటుంది నేను అంతే పద్మావతి నువ్వు లేకుండా ఉండలేను అని అంటాడు. అంతలో పద్మావతి కాలికి దెబ్బ తగులుతుంది విక్కీ పద్మావతిని పట్టుకుంటాడు. విక్కీ నీ పద్మావతి ఎత్తుకుంటాను అని అంటుంది నువ్వు నన్ను ఎలా ఎత్తుకుంటావు పద్మావతి అని అంటే అదేంటి సార్ అలా అంటున్నారు. చంటి పిల్లాడికి తల్లు ఎప్పుడు బరువు అని అనుకోదు కదా అలానే అని అంటుంది అది కాదు పద్మావతి అని అంటాడు లేదు సార్ నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను ఎత్తుకోగలను అని విక్కిని పద్మావతి ఎత్తుకుంటుంది. ఒక కళ్ళ లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. పద్మావతి ఇక వదలండి సార్ అని అంటుంది వికీ పద్మావతిని పట్టుకుంటాడు నేను వదలను పద్మావతి అని అంటాడు వదలండి సార్ అని తప్పించుకుంటుంది. ఇక అంతలో నేను నిన్ను పట్టుకుని వదలడానికి కాదు పద్మావతి జీవితాంతం నీకు తోడుగా ఉండడానికి అని అంటాడు ఇక ఇద్దరు హగ్ చేసుకుంటారు జీవితంలో ఇప్పటివరకు మన కష్టాలన్నీ పోయి ఇక అన్ని సంతోషాలే అని పద్మావతి అంటుంది విక్కీ దాని కోసం నేను ఏదైనా చేస్తాను పద్మావతి అని అంటాడు. మనం ఇక నుంచి బయటపడాల్సిన చీకటి పడుతుంది అని అనుకుంటుంది. పదండి మనం తొందరగా ఇంటికి వెళ్దాం అని పద్మావతి విక్కీని రమ్మని ముందుకు వెళుతూ ఉంటుంది. పదా వస్తున్నాను అని విక్కీ మన బంధాన్ని ఇంకెవరు విడదీయలేరు పద్మావతి అని అంటాడు అప్పుడే కృష్ణ వచ్చి వికీ తల మీద కొడతాడు కర్రతో, విక్కీ అక్కడికక్కడే పడిపోతాడు.

Nuvvu Nenu Prema Today Episode  April 18 2024 Episode 601 highlights
Nuvvu Nenu Prema Today Episode  April 18 2024 Episode 601 highlights

ఇక పద్మావతి బాధపడుతూ సారూ లేవండి లేవండి అని అరుస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న కృష్ణా పోయే ప్రాణం కోసం ఎందుకు పద్మావతి అంతలా ఏడుస్తున్నావు నీకోసం పరితపించే నేనున్నాను కదా అని అంటాడు. నాకోసం బాధపడి పద్మావతి నేను ఉండంగా నువ్వు ఎవరి కోసం బాధపడాల్సిన అవసరం లేదు అని అంటాడు అప్పుడే పద్మావతి కోపంగా కృష్ణ వైపు చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావ్? మీ విక్కీ నేమ్ అట్టి కల్పించాను. ఇక నువ్వు ఒక లెక్క నాకు అని అంటాడు కృష్ణ. పద్మావతి ఇక వెళ్దాం పద అని పద్మావతి చేయి పట్టుకొని విక్కి తీసుకు వెళుతూ ఉంటాడు ఇక పద్మావతి దుర్మార్గుడా నీకు అసలు అంటుంది. మా ఇద్దరి మధ్యలోకి వచ్చి ఎందుకు అడ్డుపడుతున్నావు నీ గురించి నిజం తెలిసిన విక్కీ గారు నేను చంపకుండా వదిలిపెట్టాడు అందుకని ఇలా చేస్తున్నావ్ కదా అని అంటుంది. ఆయన కనుక ఏమైనా జరగాలి నేను నిన్ను చంపేస్తాను అని అంటుంది పద్మావతి. నువ్వు చెప్పడం పూర్తయింది కదా ఇంకేమన్నా మిగిలిందా పదా వెళ్దాం అని చేయి పట్టుకొని లాకెళ్తాడు . అసలు ఏదైనా నీ తెలివికి మెచ్చుకోవాలి పద్మావతి నువ్వు ఇంత కష్టపడి చేసినా కూడా కాని చివరికి ఫలితం మాత్రం శూన్యం ఇదంతా నేను చేయడానికి కారణం నువ్వే అసలు అని అంటాడు దానితో పద్మావతి ఆశ్చర్య పోతుంది. నీకు అర్థం కాలేదా ఏంటి అలా చూస్తున్నావు ఇంకా నేను మారాను అనుకుంటున్నారా అసలు మారలేదు కదా నీ మీద నాకు వ్యామోహం అలానే ఉంది. నీ మీద ప్రేమ నాకు అలానే ఉంది నా మనసు వయసు నిన్నే కోరుకుంటున్నాయి దాని కోసమే ఇదంతా చేశాను అని అంటాడు. నువ్వు అసలు మనిషివా పశువా నీకు వావి వరుసలేమి లేవా అని అడుగుతుంది నేను రాక్షసుని పద్మావతి అని అంటాడు. నా కోరిక తీర్చుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. విక్కీ ఆస్తికా చేయడానికి అవిటిది అయినా అరవింద్ ని పెళ్లి చేసుకున్నాను. అన్ని చేశాను కానీ నువ్వంటే మాత్రం నాకు ప్రేమ తగ్గట్లేదు పద్మావతి నీ మీద నా ప్రేమ ఎప్పటికీ మారదు అందుకే నేను దక్కించుకోవడానికి ఇలా వచ్చాను. పద్మావతి నీచుడా అని కొట్టబోతుంది వెంటనే కృష్ణ చెయ్యి పట్టుకుంటాడు. ఆవేశంతో కాదు పద్మావతి ఆలోచించి ఒకసారి ఇద్దరం కలిసి సంతోషంగా వుందా అని అంటాడు. నువ్వు ఎంత తిట్టినా కానీ నాకు మాత్రం నీ మీద కోపం రావట్లేదు పద్మావతి నేను జీవితంలో రెండే రెండిటి కోసం ఆశపడ్డాను ఒకటి మీకు ఈ ఆస్తి రెండు నీ అందం.

Nuvvu Nenu Prema Today Episode  April 18 2024 Episode 601 highlights
Nuvvu Nenu Prema Today Episode  April 18 2024 Episode 601 highlights

కృష్ణ అలానే పద్మావతి తో మాట్లాడుతూ ఇప్పటికే నేను చేయాల్సింది చేశాను పద్మావతి. మంచివాడిగా నటిస్తూ ఆ ఇంట్లో చేరి నేను విక్కీ ఆస్తి కొట్టేసాను ఇప్పుడు నువ్వు కూడా నా దానివి అయితే ఇక నాకు వద్దు అదుపు లేదు నువ్వే ఆలోచించుకో ఏడుస్తూ విక్కీ కోసం బాధపడతావో లేదంటే నా కోసం వచ్చేసి ఆనందపడతావో అని అంటాడు. నీ ఇష్టం కష్టాలు పడతానంటే విక్కీ కోసం బాధపడుతుంది కదా జీవితాంతం కష్టాలు పడుతూనే ఉంటావు. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని అంటుంది పద్మావతి అవును పద్మావతి నిజమే మాట్లాడుతున్నాను నాతో వచ్చేసే ఇక వీటికిని పట్టించుకోకు నాతో వచ్చేసేయ్ కాస్తంత ఇప్పుడు నాదే పద్మావతి ఈ ఆస్తిని నువ్వు నేను కలిసి ఎంజాయ్ చేద్దాం. ఆస్తితో పాటు నాకు నీ మీద కూడా కోరిక ఉంది పద్మావతి అందుకే నువ్వు కూడా వచ్చేసేయ్ అని అంటాడు. ఆస్తి తో పాటు అందం కూడా నా సొంతమైతే నాకు ఇక ఆనందమే వేరు, నీకోసం నేను ఎంత చేశాను పద్మావతి ఇవన్నీ చేసింది నీకోసం కాదా విక్కిని కొట్టింది కూడా నీ కోసం కాదా అని అంటాడు. నేను కోరుకున్నది ఏదైనా సరే అది నాకు దగ్గర తీరాలి వేరే వాళ్లకు దక్కితే నేను చూస్తూ ఊరుకోను అని అంటాడు. నేను ఇంటికి తీసుకెళ్ళి అందరి అడుగు తొలగించి నేను నా మహారాణి చూసుకుంటాను అని అంటాడు. ఇప్పుడు గనక నువ్వు నా చెయ్యి లేకపోతే నిజంగా నా చేతిలో చస్తావ్ అని అంటుంది పద్మావతి. బలవంతంగా పద్మావతి నుంచి కృష్ణ తీసుకొని వెళ్తాడు. పద్మావతి విక్కీ వైపు చూస్తూ సారు లేవండి సారు ఒకసారి లేవండి సారు ఈ నీచుడు నన్ను తీసుకెళ్తున్నాడు ఒకసారి లేవండి సార్ అని బతిమిలాడుతూ ఏడుస్తూ ఉంటుంది. వాడు చావడానికి రెడీగా ఉన్నాడు నిన్ను ఎలా కాపడతాడు పద్మావతి అని అంటాడు కృష్ణ. పద్మావతి సారు సారు అని పిలుస్తూనే ఉంటుంది కృష్ణ బలవంతంగా తీసుకెళ్లి జీప్ లో ఎక్కిస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode  April 18 2024 Episode 601 highlights
Nuvvu Nenu Prema Today Episode  April 18 2024 Episode 601 highlights

ఇక మరోవైపు దివ్య, పాటలు వింటూ వస్తూ ఉంటే అప్పుడే అను, దివ్యకు తగులుతుంది దివ్య ఎప్పుడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు నేను మనశాంతిగా ఉండటం మీకు ఇష్టం లేదా అని అంటుంది దాంతో అను, ఇంట్లో విక్కీ పద్మావతి కనిపించకుండా పోయి మేము చాలా కంగారుగా ఉంటే నువ్వు హాయిగా పాటలు వింటున్నావా అని అంటుంది. అయినా నన్ను అనడానికి నువ్వు ఎవరు అని అంటుంది దివ్య అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్య దివ్య నిజంగా నీకు అను ఎవరో తెలియదా అను ఇంటి కోడలు, అను నీకు వదిన అవుతుంది ఆ విషయం నేను చెప్పక్కర్లేదు అనుకుంటా అని అంటాడు. అయినా ఇంట్లో అందరం కంగారు పడుతూ బాధపడుతూ ఉంటే నువ్వు హాయిగా పాటలు వింటున్నావా ఎప్పుడు ఏమవుతుందో అని నరాలు తెగిపోయే టెన్షన్లో ఉన్నాం మేము. విక్కీ గురించి ఏం చెప్తారు పద్మావతి గురించి ఏం చెప్తారు అని, మేం భయపడుతుంటే నువ్వేమో హాయిగా ఉన్నావా? ఏమీ పట్టనట్టు అని అంటాడు అయినా ఏంటి నేను ఏదో తప్పు చేసినట్టు నిలబెట్టి నన్ను అడుగుతున్నారు అని అంటుంది ఇంట్లో తప్పు చేస్తే అడిగే హక్కు అందరికీ ఉంటుంది అని అంటాడు ఆర్య. ఏంటి మంచిగా నీ బాధ్యత తెలుసుకొని నడుచుకో దివ్య అని అంటాడు ఆర్య. అంటే నాకు బాధ్యత తెలియదని అంటున్నారా అని అంటుంది దివ్య అప్పుడే అక్కడికి శాంతాదేవి వస్తుంది బాధ్యతలు అంటే ఒకరు చెప్తే తెలుసుకునేవి కాదు అని అంటుంది. త్రిపుర సుద్దిగా మనం వాటిని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ కుటుంబం గౌరవం పరువు మర్యాద అనేవి, పెరుగుతాయి లేదంటే, ఎవరికి వారుగా ఇంట్లో ఉండాల్సి వస్తుంది దివ్య అని అంటుంది శాంతాదేవి. ఇది నేను చెప్పాల్సిన మాట కాదు దివ్య పైనున్న మీ నాన్న చెప్పిన ఇదే మాట చెప్తాడు అని అంటుంది. మీ నాన్నకి బాధ్యత తెలుసు కాబట్టి నేను మా చేతిలో పెట్టి వెళ్ళాడు పద్మావతి ఏమైందో విక్కి ఏమైందో అని మేము కంగారు పడుతుంటే, ఈ సమయంలో మనమంతా కలిసి ఒకటిగా ఉండాలి కానీ ఇలా గొడవలు పడటం ఏంటి దివ్య అని అంటుంది. విక్కీ పద్మావతి కనిపించలేదని ఇంత కంగారుపడుతున్నారు శాశ్వతంగా చనిపోయారని తెలిస్తే ఏమైపోతారో ఏంటో ఇంట్లో వాళ్ళు అని అనుకుంటుంది మనసులో, వీళ్ళు అనవసరంగా నా మూడ్ ని పాడు చేశారు అని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode  April 18 2024 Episode 601 highlights
Nuvvu Nenu Prema Today Episode  April 18 2024 Episode 601 highlights

ఇది కృష్ణ పద్మావతిని జీవులలో ఫాస్ట్ గా తీసుకు వెళ్తూ ఉంటాడు సారు నన్ను కాపాడండి అని పద్మావతి అరుస్తూ ఉంటుంది ఇంకా ఎక్కడ సార్? వాడు ఎప్పుడో గాల్లో కలిసిపోయి ఉంటాడు అని అంటాడు కృష్ణ. సైలెంట్ గా నువ్వు నాతోనే ఉండడమే పద్మావతి అని అంటాడు. దిక్కులేంచావు నీలాంటి దుష్టులకి అలాంటి చావు వస్తుంది కానీ, అలాంటి మంచి మనుషులకి కాదురా అని అంటుంది ఇక పద్మావతి నువ్వు విక్కిని మర్చిపోమని ఎన్ని సార్లు చెప్పిన వినవా ఏంటి అని అంటాడు. మా ప్రేమ నిజమైంది అయితే విక్కీ తప్పకుండా బతుకుతాడు నాకోసం వస్తాడు అని అంటుంది. నీ ప్రేమ ఫెయిల్ అవ్వాలనే కదా పద్మావతి విక్కీని కొట్టి చంపేసింది అని అంటాడు కృష్ణ. చనిపోయిన నీ ప్రేమ మళ్ళీ నీ ప్రేమని ఎలా బతికిస్తుంది పద్మావతి అని అంటాడు ఇక తను ఎప్పటికీ రాడు అని అంటాడు. అప్పుడే వికీ ఎదురుగా వచ్చి నిలబడతాడు కృష్ణ ఒకసారి గా జీప్ సడన్ బ్రేక్ వేస్తాడు.ఎదురుగా విక్కిని చూసి ఆశ్చర్యపోతాడు కృష్ణ. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో, విక్కీ కృష్ణతో నిన్ను చంపిన సరే పద్మావతిని కాపాడతాను అంటాడు అంతదాకా వస్తే నేను నిన్ను చంపుతాను అంటాడు ఇద్దరూ కొట్టుకుంటారు. విక్కీ కృష్ణుని బాగా కొడతాడు అంతలో కృష్ణ తన జేబులో నుంచి గన్ తీసి విక్కీని షూట్ చేయబోతాడు. బుల్లెట్ కి పద్మావతి అడ్డుగా వెళ్తుంది. పద్మావతి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇటువంటి నే విక్కీ ఏంటి పద్మావతి ఇలా చేసావు అని అంటాడు. మీకోసం నేను ఏదైనా చేస్తాను చాలు అని అంటుంది. ఇక పద్మావతి ఎంతసేపటికి పిలిచినా పలకక పోవడంతో విక్కీ పద్మావతి చనిపోయిందని గట్టిగా అరుస్తాడు.

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri